స్వాధీనం చేసుకున్న గంజాయి బస్తాలు
మల్కన్‌గిరి : మల్కన్‌గిరి సమితి పద్మాగిరి పంచాయతీలో బుధవారం ఉదయం ఎక్సైజ్ అధికారులు తనిఖీ నిర్వహించి ఓ ఇంటిలో నాలుగు క్వింటాల గంజాయిని పట్టుకున్నారు. ముందస్తు సమాచారంతో మల్కన్‌గిరి ఎక్సైజ్ అధికారి అశోక్‌కుమార్‌శెట్టి తన బృందంతో తనిఖీలు నిర్వహించారు. అయితే పతీత్ బిస్వష్, మహాదేవ్ బిస్వష్‌లు ఛత్తీస్‌గఢ్ తరలించేందుకు గంజాయి నిల్వలు ఇంటిలో ఉంచారు. ఎక్సైజ్ అధికారులు దాడి చేసిన సమయంలో తండ్రి పతీత్ బిస్వష్ పరారయ్యాడు. కొడుకు మహదేవ్ బిస్వస్‌ను అరెస్టు చేశారు. మల్కన్‌గిరి ఎక్సైజ్ అధికారి అశోక్‌కుమార్ మాట్లాడుతూ ఈ గంజాయి విలువ 20లక్షలు ఉంటుంటుని తెలిపారు. మంగళవారం కూడా రెండు వలదల క్వింటాళ్ల గంజాయిని పట్టుకున్నామని తెలిపారు. గిరిజన గ్రామాల్లో ఇదే ముఖ్య పంటగా పండిస్తున్నారన్నారు. నెల రోజుల్లో 50 కోట్లు విలువ చేసే గంజాయి పంటను ధ్వంసం చేశామని ఇంకా ప్రతి గ్రామంపై దాడి చేసి ఈ గంజాయి సాగును ధ్వంసం చేస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment