(ఫైల్ ఫోటో)
గొలుగొండ/మాడుగుల: విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి బొలెరో జీపులో అక్రమంగా తరలిస్తున్న వంద కిలోల గంజాయిని గొలుగొండ ఎస్‌ఈబీ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. ముందస్తు సమాచారంతో కొయ్యూరు మండలం ధర్మవరం వద్ద గంజాయి పట్టుకున్నట్లు ఎస్‌ఈబీ సీఐ రాజారావు, ఎస్‌ఐ గిరి తెలిపారు. దీని విలువ సుమారు రూ.3 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. ఎస్.సత్యనారాయణ, రామన్న, నారాయణరావు అనే ముగ్గురు నిందితులను అరెస్టు చేసి కోర్టుకు తరలించామన్నారు. వారి నుంచి బైక్, బొలెరో జీపు, నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
60 కిలోల పట్టివేత
విశాఖ జిల్లా మాడుగుల మండలం తాటిపర్తి జంక్షన్ వద్ద బుధవారం మాడుగుల ఎస్‌ఐ పి.రామారావు ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది గంజాయి పట్టుకున్నారు. తాటిపర్తి జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా విశాఖ మన్యం నుంచి వస్తున్న మారుతీ కారులో 60 కిలోల గంజాయి బయటపడింది. కారు సీజ్ చేసి గంజాయిని స్వా«దీనం చేసుకున్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment