
సాక్షి, విజయనగరం: తెలంగాణ నుంచి రావాల్సిన లక్షల కోట్ల రూపాయాలను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎందుకు తీసుకురాలేకపోతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. అవినీతి, ఓటుకు నోటుక కేసు వల్ల తెలంగాణ నుంచి చంద్రబాబు తొకముడుచుకుని పారిపోయివచ్చారని ఆరోపించారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయితే అక్కడి నుంచి రావాల్సిన ఆస్తులను ఖచ్చితంగా తీసుకువస్తారని స్పష్టం చేశారు.
తన స్వార్ధం కోసం ఏపీ ప్రత్యేక హోదాను కేంద్ర వద్ద తాకట్టు పెట్టిన వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకులపై ఆయన చంద్రబాబు మాట్లాడే తీరు రాజకీయ నాయకుడిలా లేదని, కామెడీ షోని తలపించే విధంగా మాట్లాడుతున్నారని బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని విమర్శించారు. ఏపీ ప్రజలను మోసం చేసిన చంద్రబాబు జిమ్మికులు, నటనను ప్రజలు గుర్తించారని, ఎన్నికల్లో తగిన బుద్ధిచెప్తారని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment