botcha satyanarayana
-
అందరివాడు బొత్స
ఆయన పేరు బొత్స సత్యనారాయణ.. కానీ అందరూ ఆయనను అభిమానంగా సత్తిబాబు అని పిలుచుకుంటారు. విభిన్నమైన నాయకుడు బొత్స. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో పదవులు అలంకరించారు. అన్నిటి కంటే అందరివాడుగా పేరు పొందడమే ఆయనకు పెద్ద అలంకారం. సామాన్యులు వెళ్లి తమ కష్టం చెప్పినా ఆయన వెంటనే స్పందించి వారి సమస్య పరిష్కరిస్తారని ప్రతిపక్షంలోని వారు సైతం చెప్పుకునే మాట. అలాంటి నాయకుడిని ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి పార్టీ అభ్యర్థిగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఉమ్మడి విశాఖ జిల్లా నాయకుల సమావేశంలో అందరి అభిప్రాయాలు తెలుసుకున్న పార్టీ అధినేత బొత్సను అభ్యర్థిగా ప్రకటించారు. సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర రాజకీయాల్లో బొత్స సత్యనారాయణ సీనియర్ రాజకీయ నాయకుడు. బలమైన ప్రజా మద్దతుతో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. ఎలాంటి వివాదాన్నయినా సామరస్యంగా పరిష్కరించగల నేతగా పేరు. విశాఖ అభివృద్ధి కోసం.. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న యూనియన్ సంఘాలకు తన మద్దతు పలికారు. అంతేకాకుండా తన సతీమణీ ఎంపీగా ఉన్న సమయంలో విశాఖ స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ గురించి ఆనాడు పార్లమెంట్లో గళం వినిపించేలా చేశారు. గాజువాక అల్లుడిగా ఈ ప్రాంతంతో మరింత అనుబంధం బొత్స సత్యనారాయణకు ఉంది. విద్యార్థి నాయకుడి నుంచి మంత్రిగా.. విజయనగరంలో బొత్స గురునాయుడు, ఈశ్వరమ్మ దంపతులకు 1958లో బొత్స సత్యనారాయణ జన్మించారు. ఆయన మహారాజా కళాశాలలో బీఏ డిగ్రీ పూర్తి చేశారు. ఆయన 1985లో బొత్స ఝాన్సీలక్ష్మీని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. అబ్బాయి సందీప్, అమ్మాయి అనూష. రాజకీయ జీవితం విద్యార్థి దశ నుంచే ప్రారంభమైంది. 1978లో విద్యార్థి సంఘ నాయకుడిగా రాజకీయాల్లోకి వచ్చి అంచలంచెలుగా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్‌గా ఎదిగారు. ఆయన 1992 నుంచి 99 వరకు రెండుసార్లు విజయనగరం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్‌గా పనిచేశారు. 1999లో బొబ్బిలి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా విజయం సాధించారు. ఆనాడు ఎన్డీయే హవా వల్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ నుంచి కేవలం ఐదుగురు ఎంపీలే గెలవగా అందులో బొత్స ఒకరు. 2004, 2009లలో చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రధాన అనుచరుడిగా ఆయనకు పేరుంది. ఆయన వైఎస్సార్, రోశయ్య , కిరణ్ కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు. రాష్ట్ర విభజన అనంతర పరిణామాలతో 2014లో ఓడిపోయారు. దీంతో 2015లో కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన బొత్స సత్యనారాయణ తన మద్దతుదారులతో కలిసి వైఎస్సార్సీపీలో చేరారు. 2019 చీపురుపల్లి నియోజకవర్గం నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి క్యాబినెట్లో పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. అదేవిధంగా వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్‌గా కూడా ఆయన పనిచేశారు. -
2051 లక్ష్యంగా వీఎంఆర్డీఏ బృహత్తర ప్రణాళిక
సాక్షి, విశాఖపట్నం: 2051 లక్ష్యంగా దృక్పథ ప్రణాళిక సిద్ధం చేయడానికి విశాఖపట్నం మహాప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీఏ) కసరత్తు ప్రారంభించింది. గురువారం నిర్వహించిన వీఎంఆర్డీఏ స్టేక్ హోల్డర్స్ సమావేశంలో మంత్రులు బొత్స సత్యనారాయణ,అవంతి శ్రీనివాస్, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్, ఎమ్మెల్యేలు రమణమూర్తి రాజు,నాగిరెడ్డి, కరణం ధర్మశ్రీ, వీఎంఆర్డీఏ కమిషనర్ కోటేశ్వరరావు, జీవీఎంసీ కమిషనర్ సృజన, విశాఖ నార్త్ కన్వీనర్ కె రాజు పాల్గొన్నారు. వీఎంఆర్డీఏ పరిధిలో సూక్ష్మస్థాయి నుంచి పరిశీలన చేసి అభివృద్ధి చేయడంతో పాటు పాలసీ ఫ్రేమ్ వర్క్‌పై దృష్టి పెట్టానున్నారు. దృక్ఫథ ప్రణాళిక రెండేళ్లలో పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టనున్నారు. మూడు రీజియన్ల ఫీడ్‌బ్యాక్‌తో ఆర్థిక వృద్ధికి పెద్దపీట,రాష్ట్ర విధానాలకు అనుగుణమైన నిర్మాణాత్మక ప్రణాళిక, సీఆర్‌జెడ్ రెగ్యులేషన్స్ పరిధిలో రెజీలియంట్ టెక్నాలజీలపై సమావేశంలో చర్చించారు. భావనపాడు,నక్కపల్లి, భీమిలిపట్నంలో వచ్చే గ్రీన్‌ఫీల్డ్ పోర్టులపై సమావేశంలో ప్రస్తావన కొచ్చాయి. అధికారులు, ప్రజా ప్రతినిధుల నుంచి నిర్మాణాత్మకమైన సలహాలను, సూచనలను వీఎంఆర్డీఏ స్వీకరించింది. -
గుంటూరులో మంత్రుల పర్యటన
సాక్షి, గుంటూరు : మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పశు సంవర్థక శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ముస్తఫా, శనివారం గుంటూరు నగరంలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ నగరంలోని డ్రైనేజీ పనులను పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అస్తవ్యస్తంగా పనులు నిర్వహిస్తున్న అధికారులపై ఆయన ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి చెందుతున్న నగరం గుంటూరు అని, అలాంటి నగర అభివృద్ధి పనులలో నిర్లక్ష్యం వహించడం దారుణమన్నారు. వర్షం పడితే నగరం దుర్వాసన వస్తోందని, త్వరితగతిన మార్పులు చేయాల్సిన అవసరం ఉందని మంత్రి అధికారులను ఆదేశించారు. అలాగే నగరంలోని ఇసుక సమస్యపై కూలీలు మంత్రుల దృష్టికి తీసుకెళ్లగా.. త్వరలోనే ఇసుక సమస్య పరిష్కారం అవుతుందని హామీ ఇచ్చారు. -
సాహితీ సౌరభం... సాంస్కృతిక వికాసం...
ఒకవైపు అపురూప పుష్ప సోయగాలు... మరోవైపు మనసును మైమరపించే శ్రావ్యమైన సంగీత సరాగాలు... ఇంకోవైపు లయబద్ధంగా వినిపించే శాస్త్రీయ నృత్య మంజీరాలు... మరోవైపు చూడగానే ఆకట్టుకునే రకరకాల పెంపుడు శునకాలు... నగరవాసుల్ని అమితంగా ఆకర్షించే క్రీడాసంబరాలు. ఇలా ప్రతీ వేదికా ఆకర్షణీయమే. ప్రతి అంశమూ అభినందనీయమే. విజ్ఞాన... వినోదాన్ని పంచే ప్రదర్శనలో ప్రభుత్వ పథకాలపై వినూత్నమైన ప్రచారం ఆలోచనాంశమే. ఇదీ గడచిన రెండు రోజులుగా జరుగుతున్న విజయనగర ఉత్సవ విశేషాలు. దీనికి తోడైన అమ్మవారి సంబరాలు... నగర రూపురేఖల్నే మార్చేశాయి. నగరం శోభాయమానంగా కనిపిస్తోంది. సాక్షి, విజయనగరం : విజయనగరం ఉత్సవాలు రెండో రోజు మరింత శోభను సంతరించుకున్నాయి. అన్ని కార్యక్రమాలకు సందర్శకుల తాకిడి గణనీయంగా పెరిగింది. ఎటు చూసినా కోలాహలంగా మారింది. నగరమంతా పండగ వాతావరణం కనిపించింది. ఆదివారం నాటి ఉత్సవాల్లో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. వివిధ వేదికల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాలను ఆయన స్వయంగా వెళ్లి తిలకించారు. మరోవైపు గురజాడ కళాక్షేత్రంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరిజవహర్‌లాల్ గాత్ర కచేరీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గురజాడలోనూ, సంస్కృతిక కశాశాలలోనూ పలువురు కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అబ్బురపరిచాయి. రెండవ రోజు డాగ్‌షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్యా, వైజ్ఞానిక, ఫల పుష్ప ప్రదర్శనలు కొనసాగాయి. కవి సమ్మేళనం, ఆనంద వేదిక’ ప్రదర్శనలు మరింతగా ప్రజలను ఆకట్టుకున్నాయి. పుష్ప... ఫల ప్రదర్శనకు అదే తాకిడి... స్థానిక ఎమ్మా సంగీత నృత్య కళాశాలలో ఏర్పాటు చేసిన పుష్ప, ఫల ప్రదర్శనను మంత్రి బొత్స సత్యనారాయణ ఆదివారం సాయింత్రం సందర్శించారు. ప్రధాన ద్వారం వద్ద ఉన్న ఎడ్లబండితో పాటు, ప్రదర్శనలో ఏర్పాటు చేసిన ఫ్లవర్స్‌ను, పండ్లను, మొక్కలను అన్నింటిని పరిశీలించి వాటిగురించి తెలుసుకున్నారు. అదేవిధంగా పైడితల్లి అమ్మవారి రూపంలో వేసిన సైకత శిల్పాన్ని, ఐస్‌తో రూపొందించిన శివలింగాన్ని కూడ తిలకించారు. ఆ తర్వాత బ్రహ్మకుమారీస్ ఏర్పాటు చేసిన స్టాల్‌ను కూడ చూసి వారు ఇచ్చిన ప్రసాదాన్ని స్వీకరించారు. సందర్శకుల కోసం వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రధమ చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక కోటలోని మాన్సాస్ ఇంగ్లిష్ మీడియం స్కూల్ విద్యార్థులు చేపట్టిన విద్యవైజ్ఞానిక ప్రదర్శన ఆదివారం కొనసాగింది. అందరికీ విద్య అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రకటించిన ‘అమ్మ ఒడి’ పథక ప్రదర్శన హైలైట్‌గా నిలింది. పట్టణ, జిల్లా వ్యాప్తంగా 145 ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్య పాఠశాలలకు చెందిన 165 పరిశోధనా, సామాజిక చైతన్య నమూనాలను ప్రదర్శనకు ఉంచారు. వినూత్నంగా గతంలోలేని అంశాలను ఈ ఏడాది ప్రదర్శనలో ఉంచడం విశేషం. ఈ–నాలెడ్జ్ హబ్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్, ఇంక్యూసివ్ ఎడ్యుకేషన్, స్టాంప్స్, కాయిన్స్ సందర్శనలు, రోబోటిక్స్ ప్రదర్శనలో ఉంచారు. సంస్కృత కళాశాల విద్యార్థులకోసం హాస్టల్ మహారాజా సంస్కృత కళాశాలలో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్ధులకు రెసిడెన్షియల్ హాస్టల్ ఏర్పాటుకు ప్రయత్నిస్తామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ హామీనిచ్చారు. విజయనగర ఉత్సవాల్లో భాగంగా సంస్కృత కళాశాలలో ఏర్పాటుచేసిన ప్రాచీన ప్రాచ్యగ్రంథాలను, అష్టావధానం ప్రక్రియను ఆయన ఆదివారం పరిశీలించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పెన్నేటి స్వప్న హైందవి విజ్ఞప్తి మేరకు విద్యార్థులకోసం హాస్టల్ ఏర్పాటుకు కృషిచేస్తామన్నారు. విజయనగర సాంస్కృతిక సాహిత్య, కళా విశిష్టతను తమ కవితల ద్వారా ఆవిష్కరించి నగర ఖ్యాతిని చాటిచెప్పేలా కమిసమ్మేళనంలో కవితలు వినిపించిన వారిని జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకటరావు సత్కరించారు. స్థానిక టీటీడీ కల్యాణ మండపంలో నాటికలు, హరికథలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. గురజాడ కళాభారతిలో ప్రదర్శించిన నాటికలు, ఏకపాత్రాభినయాలు వీక్షకులను కట్టిపడేశాయి. వీనుల విందు చేసిన గానకచేరీలు సినీగీతాలాపనలో జిల్లా కలెక్టర్ ఎం.హరిజవహర్‌లాల్ విజయనగరం ఉత్సవాల సందర్భంగా ఆనందగజపతి కళా క్షేత్రంలో రెండో రోజైన ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకే సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. గాన కచేరీలు వీనుల విందు చేసి ప్రేక్షకులను ఆలరించాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరిజవహర్ లాల్ కూడా తనదైనశైలిలో సంగీత కళాకారుల చెంత చేరి వారితో గళం కలిపారు. భక్తి గీతాన్ని ఆలపించి కార్యక్రమాన్ని రక్తికట్టించారు. కళాభిమానులు, ప్రేక్షకులు కరతాళ ధ్వనులతో ఆయన్ను అభినందించారు. కార్యక్రమంలో స్త్రీ నిధి రుణాలకు సంబంధించిన 142 మంది సభ్యులకు సంబంధించిన రూ.71 లక్షల విలువగల చెక్కును జిల్లా కలెక్టర్ డా.ఎం.హరి జవహర్ లాల్ మహిళా సంఘాల సభ్యులకు అందజేశారు. శ్రీవారి స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకుడు, సంగీత దర్శకుడు యం. భీష్మ సారధ్యంలో అన్నమాచార్య కీర్తనలు విజయనగరం సంస్కృతీ, సంప్రదాయం ఉట్టి పడేలా సాగింది. విశ్వకర్మ డ్యాన్స్ అకాడమీ, జమ్ము నారాయణపురం బృందంచే అష్టలక్ష్మీ స్తోత్రం నత్య రూపకం ప్రదర్శించారు. కార్యక్రమాలకు హాజరైన మంత్రి బొత్ససత్యనారాయణ కళాకారులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. సాయంత్రం స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి కార్యక్రమానికి విచ్చేసి కళాకారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఘంటసాల స్మారక కళాపీఠం ఆ«ధ్వర్యంలో నిర్వహించిన ఆర్కెస్ట్రాలో కలక్టర్ హరిజవహర్‌లాల్, సినీ నటి కల్యాణి, సోషల్వెల్ఫేర్ డీడీ కె సునీల్ రాజ్‌కుమార్ సినీ గేయాలు ఆలపించి శ్రోతలను అలరించారు. -
తోటపల్లికి మహర్దశ..!
సాక్షి, బొబ్బిలి(విజయనగరం) : తోటపల్లి ప్రాజెక్టు ఆయకట్టు రైతుల ఆశలు నెరవేరనున్నాయి. మొత్తం ఆయకట్టుకు సాగునీరందించేందుకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నడుంబిగించింది. ప్రాజెక్టు పరిస్థితిపై పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ ఇటీవల మంత్రులు, ఎంపీలతో చర్చించారు. జిల్లాలోని అన్ని ప్రాంతాలకూ సాగునీరందేలా పిల్ల కాలువలు, లైనింగ్, భూసేకరణ, ఆర్ఆర్ ప్యాకేజీలకు రూ.400 కోట్లు అవసరంగా గుర్తించారు. ఇదే విషయాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన సానుకూలంగా స్పందించారు. నిధుల సమీకరణ ఏఏ విభాగాల నుంచి సేకరించాలన్న అంశంపై మరోమారు సమావేశం కానున్నట్టు మంత్రి బొత్స ప్రకటించడంతో ఆయకట్టు రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ప్రాజెక్టు పూర్తయితే బీడు భూముల్లో బంగారు పంటలు పండుతాయని ఆశపడుతున్నారు. ఇదీ పరిస్థితి.. తోటపల్లి ప్రాజెక్టు జిల్లాలోనే ఏకైక మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో దాదాపు 1.29 లక్షల ఎకరాలకు సాగునీరందాలి. ప్రస్తుతం లక్ష ఎకరాలకు కూడా సాగునీరు అందడం లేదు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో దాదాపు 85 శాతం పనులు పూర్తయిన ప్రాజెక్టుకు చివరి విడతలో పనులు చేసి తాము ప్రారంభించినట్టు చెప్పుకునేందుకు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఉమ్మితడి పనులతో మమ అనిపించింది. పార్వతీపురం నుంచి బొబ్బి లి, తెర్లాం, బాడంగి మీదుగా చీపురుపల్లి నియోజకవర్గానికి కాలువ వెళ్తున్నా రైతాం గానికి సాగునీరందడం లేదు. పిల్ల కాలువలు లేకపోవడమే దీనికి కారణం. కళ్లముందే సాగునీరు వెళ్తున్నా మోటార్లు పెట్టే అవకా శం కూడా లేదు. ఎందుకంటే ఆ హక్కు లేద నీ, ఎవరయినా మోటార్లు పెడితే స్వాధీనం చేసుకుంటామని గతేడాది రైతులను అధికారులు హెచ్చరించడంతో ఇప్పుడు రైతులు కాలువ వంకే చూడడం మానేశారు. ఆ సమస్యలను అధిగమించేందుకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కృషి చేస్తోంది. గత ప్రభుత్వ నిర్లక్ష్యం తోటపల్లి ప్రాజెక్టును హడావిడిగా ప్రారంభించేందుకు చేసిన గత ప్రభుత్వ తీరు వల్ల భూ సేకరణ కూడా పూర్తిగా చేయలేదు. దీం తో బొబ్బిలి, బాడంగి, తెర్లాం ప్రాంతాల్లో చాలాచోట్ల పిల్ల కాలువలు లేవు. దాదాపు 24 వేల ఎకరాలకు సాగునీరు అందడం లేదు. మరోవైపు చీపురుపల్లి ప్రాంతంలో కాలువలున్నా చివరి ఆయకట్టు భూములైనందున సాగునీరు అందడం లేదు. కాలువ పరిధిలో లైనింగ్ లేకపోవడం, కాలువల్లో తుప్పలు పెరగడంతో ఏటా రైతులకు సాగునీటి కష్టాలు తప్పడం లేదు. 483 ఎకరాల భూ సేకరణకు చర్యలు తోటపల్లి ప్రాజెక్టు పూర్తి చేయాలంటే ఇంకా 483 ఎకరాల భూమిని సేకరించాలి. ఇది కేవలం పిల్ల కాలువలకు మాత్రమే. పిల్ల కాలువ ల కోసం 13వ భూసేకరణ చట్టం ప్రకారం భూ సేకరణ చేయాలని రెవెన్యూ అధికారుల తరఫున ఆదేశాలుండగా ఇరిగేషన్ అధికారుల నుంచి దీనికి సంబంధించిన నివేదిక మాత్రం నేటికీ ఇవ్వడం లేదని అంటున్నారు. దీనిపై ఇప్పుడు సీఎం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ, ఇతర మంత్రులు, ఇరిగేషన్ అధికారుల మ ధ్య ఇటీవల జరిగిన సమావేశాల్లో చర్చించా రు. భూ సేకరణతో పాటు కాలువల లైనింగ్, పిల్ల కాలువల నిర్మాణం, ఆర్ఆర్ ప్యాకేజీలకు చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి బొత్స ఇటీవల బహిరంగ సభలో తెలిపారు. ఇందులో భాగంగా పర్యావరణ, కాలుష్య నియంత్రణమండలి అధికారుల నుంచి అను మతులు తీసుకునే పనులు మొదలయ్యాయి. ప్రాజెక్టు పూర్తిచేసేందుకు సన్నాహాలు ఆరంభించారు. -
మాది ఫ్రెండ్లీ ప్రభుత్వం: మంత్రి బొత్స
సాక్షి, అమరావతి : దేశంలో ఆంధ్రప్రదేశ్‌ను రోల్‌మోడల్‌గా నిలపాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అమరావతిలో శుక్రవారం ఏర్పాటు చేసిన స్టేక్ హోల్డర్స్ సమావేశంలో మంత్రితో పాటు 13 జిల్లాల స్టేక్ హోల్డర్స్, క్రెడాయ్ బిల్డర్స్ అసోషియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఏ రాష్ట్రంలో అయితే సిమెంట్, స్టీలు వినియోగం ఎక్కువగా జరుగుతుందో.. ఆ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు సాగుతోందని అర్థం అన్నారు. అందరికి ఇల్లు నిర్మించి ఇవ్వాలన్నదే ప్రభుత్వ నిర్ణయమని, మధ్య తరగతి, పేద ప్రజలకు ఇళ్ల నిర్మాణం చేసి ఇస్తామని హామీ ఇచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది ఫ్రెండ్లీ ప్రభుత్వమని.. అందరి సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుని ముందుకు వెళతామని పేర్కొన్నారు. లేఅవుట్ల విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని తెలిపారు. అలాగే నిర్మాణ అనుమతులు ఇవ్వడంలో కొంత జాప్యం జరుగుతోందని, బిల్డింగ్ ఫీజులు ఎక్కువగా ఉన్నాయన్న బిల్డర్స్ భావన సహజమే.. అయితే ప్రభుత్వ ఆదాయం కోసం ఫీజులు పెంచడం లేదని మంత్రి వివరించారు. బీపీయస్‌ను అలవాటుగా చేయబోమని, వాటిపై ఇక ఎలాంటి ప్లాన్స్ ఉండవని మంత్రి అన్నారు. రాష్ట్రంలో అనుమతులు లేని లే అవుట్స్ ఉన్నాయని, ఆన్లైన్ సిస్టంను మరింత మెరుగుపరిచి లోటు పాట్లు సరిచేస్తామన్నారు. ఖాళీ స్థలాలకు సెల్ఫ్ డిక్లరేషన్ కల్పిస్తామని, రేరాలో సభ్యత్వం పరిశీలన చేస్తామని వచ్చే ఏప్రిల్ కల్లా మాస్టర్ ప్లాన్ తయారు చేస్తామన్నారు. ఇందుకోసం స్టేక్ హోల్డర్స్ తమ సలహాలను, సూచనలను ఇచ్చి.. రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని మంత్రి కోరారు. అలాగే పొరుగు రాష్ట్రాల్లో నిబంధనలను పరిగణనలోకి తీసుకుని.. ఒక వర్కింగ్ గ్రూప్‌ని ఏర్పాటు చేసి ఆ నిబంధనలు అమలు చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్టేక్ హోల్డర్స్ 25 విషయాలను తమ దృష్టికి తీసుకువచ్చారని, వాటిని ప్రభుత్వం కచ్చితంగా పరిగణనలోకి తీసుకుంటుందని తెలిపారు. కాగా ఇసుక సమస్య కొంత ఇబ్బందిని కలిగిస్తోందని, వర్షాల వలన కూడా కొంత ఇబ్బంది కలుగుతోందని.. ఇసుక విధాన ఫలాలు భవిష్యత్తుకు దోహదపడతాయని మంత్రి వివరించారు. చంద్రబాబు ఆలోచన ధోరణి మారాలి సచివాలయ ఉద్యోగాలపై చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలపై మంత్రి స్పందిస్తూ.. చంద్రబాబు ప్రతి అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం నీచమని విమర్శించారు. లక్ష మందికి ఉద్యోగ అవకాశలు కల్పిస్తే ఓర్వలేక విమర్శలు చేయడం సరికాదని, చంద్రబాబు వ్యాఖ్యలు వింటుంటే అసహ్యం వేస్తోందని మండిపడ్డారు. 4 నెలల కాలంలో రాష్ట్రాన్ని గాడిలో పెట్టి రాష్ట్ర అభివృద్దికి కృషి చేస్తుంటే చంద్రబాబు విమర్శలు చేయటం దారుణమన్నారు. అలాగే చంద్రబాబుపై సోషల్ మీడియాలో వస్తున్న పోస్టింగ్స్‌ని ఖండిస్తున్నామని.. వాటిపై పోలీసులు వారి పని వారు చేస్తున్నారని తెలిపారు. పెయిడ్ ఆర్టిస్టులను పెట్టించి తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తే ఇలాంటి పరిస్థితులే వస్తాయని తెలిపారు. గత ఐదేళ్లలో చంద్రబాబు చేసిన పనులు అందరు చూశారు.. సోషల్ మీడియాలో వచ్చిన పోస్ట్‌లను తాము ప్రోత్సహించడం లేదని, నీవు నేర్పిన విద్య వలనే నీకే తిప్పలు వచ్చాయని.. ఇకనైనా చంద్రబాబు ఆలోచన ధోరణి మార్చుకోవాలని బొత్స హితవు పలికారు. -
అన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. పట్టణాభివృద్ధిలో విశేష అనుభవం ఉన్న ఆరుగురితో కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. ఈ కమిటీ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తుందని చెప్పారు. శుక్రవారం విజయవాడలో మున్సిపల్ కమిషనర్ల వర్క్‌షాపు ముగింపు కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. ఇటీవల నియమితులైన వార్డు వలంటీర్లు, రానున్న సచివాలయ వ్యవస్థను వాడుకుని పట్టణ ప్రజలకు మరిన్ని సేవలు అందించడానికి కమిషనర్లు కృషి చేయాలన్నారు. ముఖ్యంగా పేదలకు ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలన్నారు. పురపాలక విభాగాల్లో అధికారులతో సమన్వయం చేసుకుని ప్రభుత్వ కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. మున్సిపల్ స్కూళ్లలో విద్యాప్రమాణాల పెంపునకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా మంచినీటి కుళాయిల ఏర్పాటు, రక్షిత మంచినీటి సరఫరా, వీధిలైట్ల నిర్వహణపై అధికారులకు సూచనలు చేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్పందన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు. సమీక్షల్లో వాస్తవాలనే అధికారులు వివరించాలని, అవాస్తవ గణాంకాలతో మభ్యపరిచే ప్రయత్నం చేయొద్దన్నారు. మున్సిపల్ శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు మాట్లాడుతూ పాఠశాలల అభివృద్ధికి స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోవాలని సూచించారు. అందుబాటులో ఉన్న మున్సిపల్ నిధులతో పాఠశాలల మరమ్మతులు, అభివృద్ధి కార్యక్రమాలు చేపడదామన్నారు. మున్సిపల్ శాఖ కమిషనర్, డైరెక్టర్ విజయకుమార్ మాట్లాడుతూ విద్యాప్రమాణాల మెరుగుకు ప్రత్యేక కార్యాచరణను అమల్లోకి తీసుకువస్తామని చెప్పారు. వర్క్‌షాపులో మున్సిపల్ కమిషనర్లు, ఆర్డీఎంఏలు, మెప్మా పీడీలు, ఇంజనీర్లు, మధ్యాహ్నం జరిగిన సమావేశంలో ఏపీటిడ్కో ఎండీ దివాన్, ఈఎన్సీ చంద్రయ్య, డీటీసీపీ రాముడు, స్వచ్ఛ ఆంధ్రా కార్పొరేషన్ ఎండీ సంపత్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
అన్నా క్యాంటీన్ల మూసివేతపై మంత్రి బొత్స..
సాక్షి, విజయనగరం: అన్నా క్యాంటీన్లను తాత్కాలికంగా మాత్రమే మూసివేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. క్యాంటీన్లను నిలిపివేయడం తమకు కూడా బాధగానే ఉందని, కానీ గత ప్రభుత్వం అనవసరమయిన చోట క్యాంటీన్లను నిర్మించిందని అన్నారు. శుక్రవారం ఆయన విజయనగరంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అన్నా క్యాంటీన్ల కోసం గత ప్రభుత్వం లక్షల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. త్వరలోనే ప్రభుత్వ క్యాంటీన్లు నిర్మిస్తామని, రద్దీ ప్రాంతాల్లో అవసరమయితే మొబైల్ క్యాంటీన్లు కూడా ఏర్పాటు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. జిల్లా పర్యటనలో భాగంగా పట్టణ పరిధిలోని పేదల కోసం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, ఎన్టీఆర్ గృహ నిర్మాణాలను మంత్రి పరిశీలించారు. గత ప్రభుత్వం అధిక ధరలకు టెండర్లను పిలిచి నిర్మాణాలను చేపట్టిందని మంత్రి విమర్శించారు. తక్కువ ధరలకు పేదలకు ఇళ్ల నిర్మాణాలను కేటాయించాలనేదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యమని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఇళ్ల నిర్మాణలపై ధరలను తగ్గించుకోవాలని కాంట్రాక్టర్లను కోరినట్లు మంత్రి తెలిపారు. ఇసుక కొరతపై భవన నిర్మాణ కార్మికులు చింతించాల్సిన అవసరం లేదని, ప్రజలకు నిర్మాణాల కోసం అవసరమైన ఇసుకను కేటాయించాలని, కొత్తగా రీచ్ లను తెరిపించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామని మంత్రి వెల్లడించారు. -
అలా చూపిస్తే.. సభలో తలదించుకుంటా: బొత్స
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై శాసనమండలిలో అధికార, విపక్షాల మధ్య వాడీవేడీ చర్చ జరిగింది. ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్షనేత చంద్రబాబు పోరాడుతున్నారంటూ టీడీపీ సభ్యుడు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఆయన వ్యాఖ్యలపై మంత్రులు అవంతి శ్రీనివాసరావు, బొత్స సత్యనారాయణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా కోసం నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడినట్లు చంద్రబాబు నాయుడు ఏనాడైనా మాట్లాడారా అని ప్రశ్నించారు. హోదాపై టీడీపీ సభ్యులు అలా మాట్లాడినట్లు చూపిస్తే.. సభలో తలవంచుకుని నిలబడతానంటూ మంత్రి బొత్స సత్యనారాయణ సవాల్ చేశారు. హోదా వద్దని ప్యాకేజీని ఎందుకు తీసుకువచ్చారని మంత్రి ఘాటుగా ప్రశ్నించారు. హోదా సంజీవని కాదంటూ చంద్రబాబు అవహేళన చేసిన వ్యాఖ్యలను ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినందుకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది టీడీపీ కాదా అని ప్రశ్నించారు. హోదా గురించి మాట్లాడే హక్కు టీడీపీ సభ్యులకు లేదని తీవ్రంగా హెచ్చరించారు. కేంద్రంతో కొట్లాడైనా సరే ఏపీకి ప్రత్యేక హోదాను తెచ్చి తీరుతామని మంత్రి బొత్స మండలిలో స్పష్టం చేశారు. -
బాబు స్వార్ధం కోసం ఏపీ హోదాను కేంద్ర వద్ద తాకట్టు పెట్టారు
-
‘తోకముడుచుకుని పారిపోయి వచ్చారు’
సాక్షి, విజయనగరం: తెలంగాణ నుంచి రావాల్సిన లక్షల కోట్ల రూపాయాలను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎందుకు తీసుకురాలేకపోతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. అవినీతి, ఓటుకు నోటుక కేసు వల్ల తెలంగాణ నుంచి చంద్రబాబు తొకముడుచుకుని పారిపోయివచ్చారని ఆరోపించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయితే అక్కడి నుంచి రావాల్సిన ఆస్తులను ఖచ్చితంగా తీసుకువస్తారని స్పష్టం చేశారు. తన స్వార్ధం కోసం ఏపీ ప్రత్యేక హోదాను కేంద్ర వద్ద తాకట్టు పెట్టిన వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకులపై ఆయన చంద్రబాబు మాట్లాడే తీరు రాజకీయ నాయకుడిలా లేదని, కామెడీ షోని తలపించే విధంగా మాట్లాడుతున్నారని బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని విమర్శించారు. ఏపీ ప్రజలను మోసం చేసిన చంద్రబాబు జిమ్మికులు, నటనను ప్రజలు గుర్తించారని, ఎన్నికల్లో తగిన బుద్ధిచెప్తారని స్పష్టం చేశారు. -
‘ధర్నాల పేరుతో ఢిల్లీలో డ్రామాలు’
సాక్షి, విజయవాడ: ధర్నా పేరుతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో డ్రామాలు ఆడుతున్నారని వైఎస్సార్సీపీ సీనియర్‌నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. హోదాతో ఏం వస్తాయని గతంలో ఎద్దేవా చేసిన వ్యక్తే నేడు ధర్నా చేయడం హాస్యాస్పదమన్నారు. హోదా ఉన్న రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయని గతంలో చంద్రబాబు అనలేదా? అని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ పోరాటం కారణంగానే ప్రత్యేక హోదా నేటికీ సజీవంగా ఉందన్నారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎన్నికలు ఉన్నందునే హోదా పేరుతో చంద్రబాబు కొత్త డ్రామాలు ఆడుతున్నారని బొత్స మండిపడ్డారు. నాలుగున్నరేళ్లు బీజేపీతో అంటకాగి.. ఇప్పుడు కాంగ్రెస్‌తో జతకట్టారని విమర్శించారు. దీక్షల పేరుతో చంద్రబాబు నాయుడు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని చెప్పారు. -
ఏపీటీఏ సదస్సుకు వెళ్లిన బొత్స సత్యనారాయణ
వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అమెరికా బయల్దేరి వెళ్లారు. అక్కడి మేరీలాండ్‌లో జరిగే ఏపీటీఏ తూర్పు సదస్సులో పాల్గొనడంతో పాటు.. వైఎస్ఆర్సీపీ అమెరికా కమిటీ సమావేశాల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా అక్కడ పలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరగనున్నాయి. ఇంకా దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆరో వర్ధంతి సందర్భంగా అమెరికాలోని మేరీలాండ్, డల్లస్, డెట్రాయిట్, హార్ట్ఫోర్డ్ తదితర పలు రాష్ట్రాల్లో జరిగే సామాజిక కార్యక్రమాల్లోనూ బొత్స పాల్గొంటారు. అక్కడ జరిగే రక్తదాన శిబిరాలు తదితర కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. -
ఎందుకో?ఏమో?
సాక్షి ప్రతినిధి, విజయనగరం: అవకాశం దొరికినప్పుడల్లా ప్రభుత్వంపై విరుచుకు పడే ఆయన.. మీడియా సమావేశమంటే ముందుండే ఆయన.. హుద్‌హుద్ తుఫాన్ తదనంతర పరిణామాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన ఆయన.. ఎందుకో గానీ ఒక్కసారిగా మౌనవ్రతాన్నే ఆశ్రయించారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తనకేమీ పట్టనట్టు కొన్నాళ్లుగా గుంభనంగా ఉంటున్నారు. దీంతో విజయనగరం జిల్లాలో కాంగ్రెస్ తరఫున గట్టిగా మాట్లాడే నేతలు కరువయ్యారు. ఒకవైపు పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి సమయం దొరికినప్పుడల్లా టీడీపీ ప్రభుత్వాన్ని దుయ్యబడుతున్నారు. ప్రెస్మీట్లు, పార్టీ సమావేశాల పేరుతో సర్కార్ పాలనను ఎండగడుతున్నారు. కానీ, ఆ తర్వాత స్థానంలో ఉన్న బొత్స సత్యనారాయణ మాత్రం ఇటీవల కాలంలో ఆ దిశగా స్పందించడం లేదు. ముఖ్యంగా చంద్రబాబు చేసిన రుణమాఫీతో రైతులు దగా పడ్డారని తెలిసినప్పటికీ నోరు మెదపలేదు. తనకొక ఎజెండా ఉందన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇదే సందర్భంలో బొత్స బీజేపీలో చేరుతారని, ఇప్పటికే మంతనాలు జరిగాయని, భారీ జన సమీకరణతో పార్టీలో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నారని...ఇలా రకరకాల ప్రచారం జరుగుతోంది. కానీ, వాటిని నేరుగా బొత్స ఖండించే ప్రయత్నం చేయలేదు. కనీసం ఆయన అనుచర వర్గమైనా ఖండించడం లేదు. ఈ ప్రచారానికి తగ్గట్టుగానే బొత్స కూడా పార్టీ కార్యక్రమాలకు అంతగా హాజరు కావడం లేదని తెలుస్తోంది. మీడియాలో కన్పించే సందర్భాలు కూడా అరుదుగా ఉన్నాయి. జిల్లాలోనే ఉన్నా బయటికి రావడం లేదు. స్థానికంగా లేనట్టుగానే ఉంటున్నారు. ఒకవైపు టీడీపీ నేతలు ఆయన్ను టార్గెట్ చేస్తూ డీసీసీబీ, రావివలస సొసైటీ అక్రమాల విషయమై ఫోకస్ పెంచారు. మరిశర్ల తులసిని ఇరకాటంలో పెడితే మొత్తం బాగోతమంతా బయటపడుతుందని లక్ష్యంగా పెట్టుకున్నారు. అటు శాఖా పరమైన విచారణతో పాటు సీబీసీఐడీ విచారణకు ఆదేశించేలా చంద్రబాబు ఒత్తిడి చేశారు. వారనుకున్నట్టుగానే విచారణలకు గ్రీన్‌సిగ్నల్ వచ్చింది. వీటిపై కూడా బొత్స కనీసం స్పందించలేదు. దీంతో ఆయనను అనుసరిస్తున్న నేతల పరిస్థితి అయోమయంగా తయారైంది. కనీస సంకేతాలు ఉండడం లేదని, ఏం జరుగుతుందో తెలియడం లేదని, ఆయన వ్యూహమేంటో పసిగట్టలేకపోతున్నామంటూనే...ఏదో జరుగుతోందని మాత్రం చెప్పుకొస్తున్నారు. ఈ డైలమాకు ఎప్పుడు తెరపడుతుందో తెలియదు గానీ అంతా ఉత్కంఠగానే చూస్తున్నారు. టీడీపీ నేతల ఉలికిపాటు ఇదిలా ఉండగా బొత్స బీజేపీలో చేరితే తమకు ఇబ్బందులొస్తాయని టీడీపీ నేతలు కూడా ఉలిక్కి పడుతున్నారు. కేంద్రంలో బీజేపీ ఉండడం వల్ల ఆ పేరు చెప్పి జిల్లాలో మరో పవర్ సెంటర్‌గా తయారై తమకు ఏకుమీదమేకులా తయారవుతారని అంతర్మథనం చెందుతున్నారు. మమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకే బొత్స బీజేపీలోకి వెళ్తున్నట్లుందని ఒకరిద్దరు నర్మగర్భ వ్యాఖ్యలు చేస్తున్నారయి. -
సీన్ రివర్స్
* పీసీసీ నేత బొత్సకు భంగపాటు * పట్టించుకున్న నాయకులే కరువు *పురందేశ్వరికీ అదే అనుభవం *మర్నాడే ఎదురైన విభజన స్ట్రోక్ సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రాష్ట్ర విభజన ప్రభావం కాంగ్రెస్ నేతలకు మర్నాడే తెలిసొచ్చింది. కేంద్ర నిర్ణయంపై జనం నుంచే స్వపక్షీయుల నుంచీ వారికి ఛీత్కారం ఎదురయింది. సీమాంధ్ర కాంగ్రెస్ దయనీయస్థితికి శుక్రవారం నాటి సంఘటనే దర్పణం పట్టింది. శుక్రవారం నగరంలోనే ఉన్న పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి పురందేశ్వరిలను కలిసేందుకు విశాఖ కాంగ్రెస్ నాయకులెవరూ పెద్దగా ఆసక్తి చూపలేదు. పీసీసీ అధ్యక్షుడు వస్తే కనీసం నలుగురైదుగురు శాసనసభ్యులు వచ్చి కలిసేవారు. జిల్లా స్థాయి నేతలు సైతం ఆయనను కలసి మాట్లాడాలంటే గంటో, రెండు గంటలో ఎదురుచూడాల్సివచ్చేది. శుక్రవారం సర్య్కూట్ హౌస్‌కు వచ్చిన ఆయన వచ్చిన కొద్దిమందితో కాలక్షేపం చేసి, విలేకరుల సమావేశంలో మాట్లాడి వెళ్లిపోయారు. పార్టీ శానససభ్యులు తలో పార్టీ దారి వెతుక్కోవడంతో ఆయనను కలసేందుకు శాసనసభ్యులెవ్వరూ రాలేదు. పురందేశ్వరిది అదే పరిస్ధితి. నిన్నటి వరకూ ఆమె కేంద్రమంత్రిగా ఉండడంతో పనుల కోసం, పైరవీల కోసం ఆమె ఇళ్ల, కార్యాలయాల వద్ద జనం గంటల తరబడి వేచి ఉండేవారు. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. పురందేశ్వరి శుక్రవారం విశాఖలోనే ఇంటిలో అందుబాటులో ఉంటారంటూ ఆమె సహాయకులు నేతలు, కార్యర్తలకు ఫోన్లు చేసి, ఎస్ఎంఎస్లు పెట్టినా పెద్దగా స్పందన కనిపించలేదని తెలిసింది. ఇద్దరు మాజీ కార్పోరేటర్ల మినహా చెప్పుకోదగ్గ నేతలెవ్వరూ ఆమె ఇంటివద్ద శుక్రవారం కనిపింలేదు. పురందేశ్వరి కాంగ్రెస్ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో కాంగ్రెస్ క్యాడర్ కూడా ఆమెను కలసేందుకు సందేహిస్తోంది. విభజన పరిణామాల తరువాత నేతల మాటలకు ఎవ్వరూ విలువివ్వకపోవడంతో వీరి వద్దకు పెద్దగా జనం వెళ్లడం లేదు. -
క్లైమాక్స్‌కు సీను!
అటా... ఇటా.. అసలెటు పోవాలి?.. ఎవరితో కలవాలి?.. ఎన్నికల్లోపు కొత్త పార్టీ వస్తే దాని భవిష్యత్తు ఎలా ఉంటుంది?.. మీడియాలో ఎలాంటి కథనాలు వచ్చినా, రాజకీయ పార్టీల్లో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నా ఇంకా ఎంత కాలం మౌన దీక్ష కొనసాగించాలి?.. ఈ రకమైన ఇబ్బందితో సతమతమవుతున్న అధికార పార్టీలోని పలువురు నేతలు ఈ నెల 23న తామెటో తేల్చేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే మంత్రి గంటా శ్రీనివాసరావు పీసీసీ తనకు షోకాజ్ ఇస్తే సీఎం సహా సీమాంధ్రలోని ఎంపీలు, ఎమ్మెల్యేలందరికీ షోకాజ్ నోటీసులు ఇవ్వాల్సి ఉంటుందని మంగళవారం తొలిసారి పార్టీ హై కమాండ్‌పై నేరుగానే మాటల యుద్ధం ప్రారంభించారు. విశాఖపట్నం, సాక్షి ప్రతినిధి : సమైక్యాంధ్ర ఉద్యమ పరిణామం అనంతరం పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కాంగ్రెస్ నుంచి జంప్ చేసే నేతల జాబితాలను తయారు చేసిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో మంత్రి గంటాతో పాటు ఆయన మద్దతు దారులైన ఎమ్మెల్యేలు ముత్తం శెట్టి శ్రీనివాసరావు, పంచకర్ల రమేష్, కన్నబాబు రాజు, చింతలపూడి వెంకట్రామయ్య ఉన్నారు. వీరితో పాటు మరికొందరు కూడా ఇదే దారిలో ఉన్నారని గుర్తించి వారికి కౌన్సెలింగ్ ఇవ్వడం ద్వారా ప్రస్తుతానికి పార్టీ మారే ఆలోచన విరమింపజేసినట్టు ప్రచారం జరుగుతోంది. వెళ్లాలనుకుంటున్న వారు పార్టీని వీడుతున్నట్టు ప్రకటించకముందే తామే బయటకు పంపామనే రీతిలో వ్యవహరిస్తే మంచిదనే ఆలోచనతో బొత్స ఈ రకమైన ఎత్తు వేసినట్టు సమాచారం. ఇందులో భాగంగానే విశాఖ జిల్లాలో మంత్రి గంటాకు షోకాజ్ నోటీసు ఇస్తున్నారనే ప్రచారం ప్రారంభమైనట్టు చర్చ జరుగుతోంది. గంటాతో పాటు మిగిలిన న లుగురు ఎమ్మెల్యేలకు కూడా షోకాజ్ ఇస్తే వివరణ ఇవ్వకుండానే వారు వెళ్లిపోతారని పార్టీ అంచనా వేస్తోంది. ఇందుకోసం ఆయా నియోజక వర్గాల్లో ఇప్పటికే ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని తయారు చేసే పనిలో పడ్డారు సత్తిబాబు. ఇప్పటికే ఒక శాసన సభ్యుడిని ఆయన నేరుగా నువ్వు పార్టీ విడిచి వెళ్లిపోనని హామీ ఇస్తావా? అని పార్టీ నేతలందరి ఎదురుగానే అడిగి ఆ ఎమ్మెల్యేకి షాక్ ఇచ్చారు. శాసన సభలో తెలంగాణ బిల్లుపై చర్చ పూర్తయ్యేంత వరకు వేచి చూసి అక్కడ పార్టీ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించి సమైక్యాంధ్ర లోకల్ చాంపియన్లుగా బయటకు రావాలని గంటా అండ్ కో వ్యూహ రచన చేసింది. ఇందుకోసం ముహూర్తం దగ్గర పడ డంతోనే గంటా తొలిసారి పీపీసీ అధ్యక్షుడిపై నేరుగా ఎదురుదాడికి దిగినట్టు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. చర్చకు అదనపు సమయం కోరుతూ ఈ నెల 16 లేదా 17 తేదీల్లో రాష్ట్రపతికి ప్రభుత్వం లేఖ రాస్తుందని, సమయం వస్తే తమ నిష్ర్కమణ మరింత ఆలస్యం అవుతుందని, లేకపోతే 23 తర్వాత ముఖాలకు ఉన్న రాజకీయ మాస్క్‌లను తొలగించ వచ్చని గంటా ఇప్పటికే తమ మద్దతు దారులకు చెప్పినట్టు సమాచారం. -
24న సమ్మె నోటీసు: ఎన్ఎంయూ
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కాంట్రాక్టు డ్రైవర్లు, కండక్టర్ల సర్వీసు క్రమబద్ధీకరణపై ప్రభుత్వం వెంటనే ఉత్తర్వులు వెలువరించని పక్షంలో సమ్మె చేపట్టాలని ఆర్టీసీ కార్మిక సంఘం ఎన్ఎంయూ నిర్ణయించింది. ఈ మేరకు 24న యాజమాన్యానికి నోటీసు అందజేయాలని యూనియన్ కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు అధ్యక్ష, కార్యదర్శులు నాగేశ్వర్రావు, మహమూద్ మంగళవారంప్రకటించారు. ఆర్టీసీలో దాదాపు 24 వేల మంది కార్మికుల సర్వీసును క్రమబద్ధీకరించాలని చాలా కాలంగా కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇటీవల సీమాంధ్ర ఉద్యమ సమయంలో సమ్మె విరమణకోసం జరిపిన చర్చల్లో రవాణా మంత్రి బొత్స సత్యనారాయణ క్రమబద్ధీకరణపై సానుకూలంగా స్పందించారు. కానీ, ఇప్పటివరకు క్రమబద్ధీకరణపై అడుగు ముందుకు పడలేదు. ఈ నేపథ్యంలో ఈ నెల 21లోపు క్రమబద్ధీకరణ ఉత్తర్వులు వెలువడని పక్షంలో 24న సమ్మె నోటీసు ఇస్తామని ఎన్ఎంయూ ప్రకటించింది. -
ఆర్టీసీకి మొరాయింపు
విజయనగరం అర్బన్, న్యూస్‌లైన్:‘సురక్షిత ప్రయాణమే మా లక్ష్యం’ ఈ నినాదం ఆర్టీసీది అని అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు ఈ నినాదం ప్రయాణికుల కు భరోసా కల్పించడం లేదు. ఆర్టీసీ నడుపుతున్న బస్సులు ఎక్కడికక్కడే మొరాయిస్తూ నినాదానికి విరుద్ధంగా ప్రజల్లో అపనమ్మకం, అభద్రతా భావాన్ని కలిగిస్తున్నాయి. అయినప్పటికీ ఎప్పటికప్పుడు మొరాయిస్తున్న బస్సులనే ఆర్టీసీ రోడ్లపైకి పంపిస్తూ ప్రయాణికుల సహనాన్ని పరీక్షిస్తోంది. ఇవేమి సేవలని ప్రశ్నిస్తే..ఈ బస్సులు సంస్థవి కావు. అద్దెబస్సులు. మేమేం చేయగలం. మాకు సంబం ధం లేదంటూ ఆర్టీసీ సిబ్బంది తప్పించుకుంటున్నారు. సాక్షాత్తు రాష్ర్ట రవాణా శాఖమంత్రి బొత్స సత్యనారాయణ సొంత జిల్లాలోనే ఆర్టీసీ బస్సు పనితీరు దయనీయంగా ఉందంటే ఇక రాష్ర్టవ్యాప్తంగా ఆర్టీసీ సర్వీసులు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. కండిషన్లో లేని బస్సులే.. గడిచిన రెండురోజుల సర్వీసుల్లో విజయనగ రం పట్టణ పరిధిలో ఐదు బస్సులు వివిధ కారణాలతో మధ్యలోనే ఆగిపోయి ప్రయాణికులను ఇబ్బంది పెట్టాయి. విశాఖ నుంచి పార్వతీపురం వెళ్లే బస్సు విజయనగరంలోని ఆర్అండ్బీ జంక్షన్ సమీపాన ఆగిపోయింది. అదే సమయంలో విజయనగరం నుంచి సాలూరు వెళ్లే మరో బస్సుదీ అదే పరిస్థితి. అయితే ఆగిన బస్సులన్నీ అద్దెబస్సులే కావడం విశేషం. ఆర్టీసీ బస్సులయితే ప్రతిరోజూ కండిషన్ పరీక్ష ఉంటుంది. అదే అద్దెబస్సుల కైతే నెల రోజుల కోసారి గానీ పరీక్ష చేయరు. ప్రయాణికులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా సరే కండిషన్ లో లేని బస్సులే ప్రతి రోజూ జిల్లా నలుమూలలా నడుస్తున్నాయి. పెరుగుతున్న అద్దె బస్సుల భారం జిల్లాలోని నాలుగు డిపోల పరిధిలోని 418 బస్సుల్లో విజయనగరం-54, సాలూరు-42, పార్వతీపురం-34, ఎస్.కోట-5 బస్సులు అద్దె ప్రాతిపదికన నడుస్తున్నాయి. నెలలో అవి తిరిగిన 43.49 లక్షల కిలోమీటర్లకు రూ.5.79 కోట్ల లావాదేవీలు జరగాల్సి ఉంది. అయితే అద్దె బస్సు తిరిగే అన్ని సర్వీసులూ నష్టాల్లోనే ఉన్నాయి. ఎందుకంటే అవి ఎక్కడికక్కడ ఆగిపోతుండడమేనని తెలుస్తోంది. పల్లెవెలుగు సర్వీసులకు కనీసం రూ.3,600 తగ్గకుండా, ఎక్స్‌ప్రెస్ సర్వీసులకు కిలోమీటర్ ఒక్కింటికి రూ.11.50 వం తున అద్దెచెల్లించే ప్రాతిపదిక సంస్థలో నడుస్తోంది. ప్రస్తుతం జిల్లాలో తిరుగుతున్న ప్రతి అద్దెబస్సుకు చెల్లించిన అద్దె కంటే ఆ సర్వీసు నుంచి వసూలవుతున్న రెవెన్యూ తక్కువగా ఉంటోంది. ప్రతి కిలోమీటర్‌కు 81పైసల వంతున నష్టం వస్తోందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. అద్దెబస్సు సర్వీసులు..సంస్థ ఆదాయానికి ఉపయోగపడడం లేదు కానీ వాటిని పోషించడానికి మాత్రం సంస్థ బాగానే వినియోగపడుతోందనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు ఈ డొక్కు బస్సులు ఏం చేస్తున్నాయంటే నాణ్యత లేని సేవలందించే సంస్థగా ప్రయాణికులకు అపనమ్మకం, అభద్రత భావాలను కలిగిస్తున్నాయి. అప్పనంగా చెల్లింపులు జిల్లాలో 135 అద్దెబస్సులు నెలలో సుమారు 18 లక్ష ల కిలోమీటర్లు తిరుగుతున్నాయి. కిలోమీటరుకు 81 పైసల వంతున 18 లక్షల కిలోమీటర్లకు సుమారు రూ.14లక్షలు అద్దెబస్సులకు సంస్థ అప్పనంగా చెల్లిస్తుంది. దీనికితోడు ఆదాయంలేని అద్దెబస్సుల సర్వీసుల్లో పనిచేస్తున్న కండక్టర్ జీతాలనూ సంస్థే చెల్లిస్తోంది. ప్రతి అద్దెబస్సుకు కనీసం ముగ్గురు కండక్టర్ల వంతున జీతాల రూపంలో సుమారు రూ.ఎనిమిది లక్షలు చెల్లిస్తోంది. వెరసి సంస్థ సుమారు రూ.25 లక్షల వరకు ఉత్తపుణ్యాన అద్దెబస్సులకు చెల్లిస్తోంది. ఇష్టానుసారం రద్దు రోడ్డు మీదకు వెళ్లే బస్సుల్లో అధికభాగం అద్దె బస్సు లే ఉంటున్నాయి. అయితే అద్దెబస్సుల యాజమాన్యాలు తమ ట్రిప్పులను ఇష్టానుసారం రద్దు చేసుకు ని సంస్థకు ఇబ్బందులు తెస్తున్నాయి. వాస్తవానికి సంస్థతో ఒప్పందం ప్రకారం నెలకు రెండుసార్లు సర్వీసులను రద్దు చేసుకోవచ్చు. ఆ సమయంలో ప్రత్యామ్నాయ బస్సులను సంస్థ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. అయినా ఈ పద్ధతి అమలు కావడం లేదు. అసలు ఆదాయంలేని అద్దెబస్సుల ప్రాతిపదిక విధానాన్ని సంస్థ రద్దు చేయాలని వివిధ కార్మిక సంఘాలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి. అయినా సంస్థకు ఇదేమీ పట్టడం లేదు. -
బొత్స రాజీనామా చేయాలి
వోల్వో బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యుల డిమాండ్ మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడి హైదరాబాద్, న్యూస్‌లైన్: మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన వోల్వో బస్సు ప్రమాదానికి బాధ్యత వహించి రవాణాశాఖమంత్రి బొత్స సత్యనారాయణ తన పదవికి రాజీనామా చేయాలని, బస్సు యజమాని జేసీ ప్రభాకర్‌రెడ్డిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యుల జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు శనివారం బంజారాహిల్స్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌ను ముట్టడించారు. మృతుల కుటుంబాలకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని, ఇటువ ంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. బస్సు ప్రమాదం జరిగి నెల రోజులు కావస్తున్నా ఇంత వరకూ మృతుల కుటుంబాలకు న్యాయం జరగలేదని, నష్టపరిహారం చెల్లించలేదని బాధితులు ఆరోపించారు. దీన్ని చాలా చిన్న విషయంగా బొత్స కొట్టిపారేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తంచేశారు. కాగా, జాయింట్ యాక్షన్ కమిటీ కో ఆర్డినేటర్ డాక్టర్ డి.సుధాకర్ ఆధ్వర్యంలో వారు బొత్స ఇంటిని ముట్టడించడానికి వెళుతుండగానే పోలీసులు బాధితులందరినీ అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు మంత్రుల క్వార్టర్స్‌లోనికి చొచ్చుకువెళ్లేందుకు యత్నించగా వారిని పోలీసులు దౌర్జన్యంగా ఈడ్చుకెళ్లి వ్యాన్‌లో పడేశారు. ఈ సమయంలో బాధితులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. బొత్స రాజీనామా చేయాలంటూ పలువురు మహిళలు ముళ్లకంచెను దాటుకొని ముందుకు వెళ్లడానికి ప్రయత్నించడంతో ఉద్రిక్తత ఏర్పడింది. అరెస్టు చేసినవారిని పోలీసులు గోల్కొండ స్టే షన్‌కు తరలించారు. కాగా, కుటుంబ సభ్యులను కోల్పోయి బాధ లో ఉన్న తాము న్యాయం కోసం వెళితే దొంగల్లాగా, దేశద్రోహుల్లా గా అరెస్టు చేసి దౌర్జన్యంగా తీసుకురావడం అన్యాయమని బాధితులు ఆవేదన వ్యక్తంచేశారు. బొత్సతీరుపై వారు మండిపడ్డారు. నా కుటుంబానికి దిక్కెవరు చట్టాలను తుంగలో తొక్కి ప్రభుత్వ అండతో రాష్ట్రంలో సమాంతర రవాణా వ్యవస్థ నడుస్తున్నది. దీనికి మంత్రి బొత్స సత్యనారాయణ అండదండలు ఉన్నాయి. మూడు నెలల పసికందును వెంటేసుకొని న్యాయం కోసం మంత్రి ఇంటికి వెళితే కనికరం లేకుండా, మహిళలనే విచక్షణా జ్ఞానం లేకుండా అరెస్టుచేసి జంతువులను రవాణా చేసే వ్యాన్లలో పొలీస్‌స్టేషన్‌కు తీసుకురావడం న్యాయమా? - ప్రతిభ, బస్సు ప్రమాదంలో మృతిచెందిన హరీష్ భార్య గూండాల రాజ్యం రాష్ట్రంలో గూండాల రాజ్యం నడుస్తున్నది. ఫిట్నెస్ లేని బస్సులు.., శిక్షణ లేని డ్రైవర్లతో బస్సులు నడిపిస్తూ ప్రజల ప్రాణాలతో ఆటలాడుకుంటున్నారు. మా కుటుంబానికి జరిగిన అన్యాయం ఇక ముందు మరెవరికి జరగకుండా చూడాలని వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లాను. రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశాలతో పోలీసులు మమ్మల్ని దొంగల్లా చూస్తూ అరెస్ట్ చేశారు. ప్రజాస్వామ్యంలో న్యాయం అడిగే స్వేచ్ఛ లేదా? - మహ్మద్, బస్సు ప్రమాదంలో మృతి చెందిన సర్దార్ సోదరుడు మృతుల కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లింపు సాక్షి, బెంగళూరు: కర్ణాటకలోని హావేరి వద్ద ఈ నెల 14న వోల్వో బస్సు దగ్ధం సంఘటనలో మృతుల కుటుంబాలకు బస్సు యాజమాన్యం నష్ట పరిహారం అందజేసింది. నేషనల్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు దగ్ధం దుర్ఘటనలో ఏడుగురు సజీవ దహనమైన సంగతి తెలిసిందే. స్థానిక చామరాజపేట స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న జేడీఎస్ ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ ఖాన్ ఆ ట్రావెల్స్ యజమాని. దుర్ఘటన జరిగిన రోజే ఆయన మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున నష్ట పరిహారం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం మరో రూ. లక్ష చొప్పున ప్రకటించింది. డీఎన్ఏ పరీక్షల అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించిన రోజు..జమీర్ నష్ట పరిహారం చెక్కులను కూడా పంపిణీ చేశారు. కాగా, ప్రభుత్వం ప్రకటించిన నష్ట పరిహారం అందాల్సి ఉంది. -
ఈ నెలాఖరులోగా అసెంబ్లీకి టి.బిల్లు: బొత్స
తెలంగాణ బిల్లు ఈ నెలాఖరుకల్లా అసెంబ్లీకి వస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్ తమకు తెలిపారని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వెల్లడించారు. మంగళవారం బొత్స హైదరాబాద్‌లో మాట్లాడుతూ... రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న రచ్చబండ కార్యక్రమం గ్రామాల్లో నిర్వహించాలని మొదట్లో తామంతా అనుకున్నామని తెలిపారు. అయితే రచ్చబండ కార్యక్రమం మండల కేంద్రాల్లో నిర్వహించాలని తమతో సీఎం కిరణ్ సూచించారని, దాంతో ఆ కార్యక్రమాన్ని మండల కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. సీఎం కార్యాలయానికి , గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పి.బాలరాజుల మధ్య సమాచారం లోపం ఉందని బొత్స అభిప్రాయపడ్డారు. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా సీఎం కిరణ్ విశాఖలో పలు గిరిజన సంక్షేమ కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఆ కార్యక్రమాలపై సీఎం కార్యాలయం తనకు సమాచారం అందించలేదని మంత్రి పి.బాలరాజు మీడియా సమావేశంలో ఆరోపించిన సంగతి తెలిసిందే. -
మీడియాపై కాంగ్రెసోళ్ల చిందులు
మీడియాలో కనిపించాలని నానా తంటాలు పడుతుంటారు రాజకీయ నాయకులు. రకరకాల వేషాలు వేసి, నాటకాలు ఆడైనా కూడా కాసేపు మీడియాలో ఏదో ఒక రకంగా ప్రచారంలో ఉంటే చాలనుకుంటారు. కానీ అదే మీడియాపై ఈ మధ్యకాలంలో మాత్రం పలువురు కాంగ్రెస్ నాయకులు మీడియా కనపడితే చాలు.. గయ్యిమని ఒంటికాలిమీద లేస్తున్నారు. పదే పదే మీడియామీద మండి పడటమే పనిగా పెట్టుకుంటున్నారు. నిన్నకాక మొన్న విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ విలేకరుల సమావేశం పెట్టి మరీ అందరినీ పిలిచి, సాక్షి మీడియా ప్రతినిధిపై విరుచుకుపడ్డారు. ఇప్పుడు ఆయన నుంచి స్ఫూర్తి పొందారో ఏంటో గానీ.. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా మీడియా మీద మండిపడ్డారు. నోటికి వచ్చినట్లల్లా మాట్లాడారు. అంతేకాదు వేలు చూపించి మరీ బెదిరించారు. ''అసలు వీళ్లతో మాట్లాడటం దండగ'' అని వ్యాఖ్యానించారు. అదేంటి అలా అంటున్నారు, మీరు ఇలా మాట్లాడటం సరికాదని కొంతమంది మీడియా ప్రతినిధులు అన్నా కూడా వేలు పెట్టి బెదిరించినట్లు చూపించి మరీ వ్యాఖ్యానాలు చేశారు. ''మేం మా ముఖ్యమంత్రితో ఏమైనా మాట్లాడతాం. నా నోరు.. నా ఇష్టం. మీకు ఇష్టం వచ్చినది రాసుకోండి'' అంటూ విసురుగా ప్రవర్తించారు. ఈనెల ఏడో తేదీన విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఢిల్లీలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజన జరిగితే హైదరాబాద్‌లో అల్లకల్లోలం జరుగుతుందని వ్యాఖ్యానించారు. ‘అల్లకల్లోలం ఎవరు చేస్తారు?’ అని ఇద్దరు విలేకరులు ప్రశ్నించారు. దీనికి సరైన సమాధానమివ్వని లగడపాటి.. సమావేశం తర్వాత వారితో వాగ్వాదానికి దిగారు. అవివేకంగా మాట్లాడొద్దంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ప్రశ్నలు అడిగితే అవివేకం అంటారేమిటి?’ అని విలేకరులు ప్రశ్నించారు. దీంతో లగడపాటి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ‘‘నోర్ముయ్... నీ పేరేంటి? నీ ఏరియా ఏంటి?’’ అంటూ ఊగి పోయారు. ‘‘అవసరమైతే చేతులు లేస్తాయి’’ అంటూ చిందులుతొక్కారు. తన వాహనం ఎక్కుతూ.. అసభ్య పదజాలంతో దూషిస్తూ.. ‘‘నా సంగతేంటో చూపిస్తా... మీ అంతు చూస్తా!’’ అని నిష్ర్కమించారు. తమకు అవసరమైనప్పుడు, తాము కావాలనుకున్నప్పుడల్లా విలేకరుల సమావేశాలు ఏర్పాటుచేసి అందరినీ పిలిచి మరీ గంటలకొద్దీ ఉపన్యాసాలు ఇచ్చే బొత్స, లగడపాటి లాంటి నాయకులు తమకు ఏమాత్రం కాస్త వ్యతిరేకంగా అనిపించినా ఇలా చిందులు తొక్కుతూ రచ్చరచ్చ చేస్తున్నారు. -
మీడియాపై బొత్స దురుసు ప్రవర్తన
పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మరోసారి తన నోటి దురుసును ప్రదర్శించారు. ఢిల్లీలో.. అసలు వీళ్లతో మాట్లాడటం దండగ అంటూ వ్యాఖ్యానించారు. గతంలో కూడా పలు మార్లు బొత్స తన నోటి దురుసును, అందునా మీడియా మీద అక్కసును ప్రదర్శించారు. వేలు చూపించి మరీ బెదిరించారు. -
వీళ్లతో మాట్లాడటం దండగ.. మీడియాపై బొత్స దురుసు ప్రవర్తన
పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మరోసారి తన నోటి దురుసును ప్రదర్శించారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతుండగా, అసలు వీళ్లతో మాట్లాడటం దండగ అంటూ వ్యాఖ్యానించారు. గతంలో కూడా పలు మార్లు బొత్స తన నోటి దురుసును, అందునా మీడియా మీద అక్కసును ప్రదర్శించారు. శనివారం నాడు మళ్లీ మీడియాపై విరుచుకుపడ్డారు. ఇలా మాట్లాడటం సరికాదని కొంతమంది మీడియా ప్రతినిధులు అన్నా కూడా వేలు పెట్టి బెదిరించినట్లు చూపించి మరీ వ్యాఖ్యానాలు చేశారు. తమ ముఖ్యమంత్రితో తాము ఏమైనా మాట్లాడతామని, నా నోరు.. నా ఇష్టమని అన్నారు. మీకు ఇష్టం వచ్చినది రాసుకోండి అంటూ విసురుగా ప్రవర్తించారు. -
దివాకర్ రోడ్ లైన్స్‌పై క్రిమినల్ కేసు: బొత్స
సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లా పాలెం శివారులో 45 మంది మృతికి కారణ మైన ఘోర దుర్ఘటనలో వోల్వో బస్సు యజమాని దివాకర్ రోడ్డు లైన్స్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసినట్టు రవాణాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ప్రమాదానికి కారణమైన బస్సును ఆపరేట్ చేస్తున్నవారితో తమకు సంబంధం లేదని, నిబంధనల ప్రకారం బస్సు యజమాని హోదాలో ఉన్న జేసీ ఉమారెడ్డిపై కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు. బుధవారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో రెండో డ్రైవర్ లేడని తేలిందని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలకు అవకాశం లేకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సిఫార్సులు చేసేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారులతో కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. ఈ ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని రవాణా శాఖ రాష్ట్రవ్యాప్తంగా బస్సులను తనిఖీ చేస్తోందని, లోపాలున్న వాటిని వెంటనే సీజ్ చేస్తోందని చెప్పారు. ఇప్పటి వరకు 601 బస్సులపై కేసులు నమోదు చేయగా, 346 బస్సులను సీజ్ చేశామని, నల్లగొండ జిల్లాలో రెండు ఆర్టీసీ బస్సులను కూడా సీజ్ చేసినట్టు వివరించారు. మరో 4 మృతదేహాల గుర్తింపు బస్సు దగ్ధం దుర్ఘటనలో సజీవదహనమైనవారి మృతదేహాలకు సంబంధించిన మూడో జాబితాను బుధవారం మధ్యాహ్నం అధికారులు ప్రకటించారు. డీఎన్ ఏ నివేదికల ఆధారంగా బుధవారం మరో 4 మృత దేహాలను గుర్తించినట్లు తెలిపారు. ఉస్మానియా మార్చురీ వద్ద బుధవారం 11 మృతదేహాలను అధికారులు మృతుల కుటుంబసభ్యులకు అప్పగించారు. ఇప్పటివరకూ డీఎన్ఏ నివేదికల ఆధారంగా 38 మృతదేహాలను గుర్తించగా.. గత మూడురోజులుగా 35 మృతదేహాలను సంబంధీకులకు అప్పగించారు. -
బోడి పెత్తనం...
విజయనగరం, సాక్షి ప్రతినిధి: పేనుకు పెత్తనం ఇస్తే బుర్రంతా గొరిగిపెట్టిందట. ప్రస్తుతం జిల్లాలో పోలీసుల తీరూ అలాగే ఉంది. జనం ఉద్యమాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరక్కుండా చూడండయ్యా అని పోలీసులకు ప్రభుత్వం నుంచి సూచనలు రాగా వాటిని వారు మరో విధంగా అర్థం చేసుకున్నట్లున్నారు. తాము చేయాల్సిన అసలు పనులను పక్కనబెట్టి పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్తిబాబు ప్రతిష్టను కాపాడే బాధ్యతను వారు భుజానికెత్తుకున్నారు. మంత్రిపై ఈగవాలకుండా చూసుకునేందుకు యత్నిస్తున్నారు. విభజన నేపథ్యంలో సీమాంధ్ర జిల్లాల్లోని యువత భవిష్యత్ అయోమయంలో పడింది. హైదరాబాద్ వెళ్లి ఉద్యోగం వెతుక్కుందామంటే అది మనది కాకుండా పోయింది. దీంతో యువత, కూలీనాలీ చేసుకునే జనం ఆవేదనతో రోడ్లెక్కారు. ఈ తరుణంలోనే అసలు ఇంత అల్లకల్లోలం కావడానికి కారకులెవరు...? ఈ దారుణాన్ని ప్రతిఘటించాల్సిన వారు కనీసం నోరు మెదపకుంటే మరి వారు ఎందుకుఉన్నట్టు..? ఇలాంటి నీచ రాజకీయ నేతలను తాము ఎందుకు ఎన్నుకున్నామా?? అని జనం నెత్తీ నోరూ బాదుకుంటున్నారు. ఇదే క్రమంలో వారి ఉక్రోషం ఉద్యమంగా మారి రోడ్డెకింది. బాధ్యులను నిందించకుంటే ఎలా?? ప్రజలను ఏదైనా కష్టం కలిగితే దానికి కారకులైనవారిపై ఆగ్రహం వ్యక్తం చేయడం, తమకు తోచిన విధంగా నిరసనలు వ్య క్తం చేయడం సహజం. తమ దౌర్భాగ్యానికి పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్తిబాబే కారణమని కేవలం ఆయన పదవీ కాంక్ష కారణంగానే రాష్ట్ర విభజన జరిగిందని ప్రజలు గాఢంగా విశ్వసిస్తున్నారు. సత్తిబాబు ఇంట్లో నలుగురికి ఓట్లేసి పదవులిచ్చి నెత్తినబెట్టుకున్నందుకు తమకు బాగానే బుద్ధి చెప్పారని ప్రజలు భావిస్తున్నారు. వారు పదవులు, వాటితోబాటు డబ్బూపరపతి సంపాదించారని, ఇప్పుడు వారికి రాష్ట్రం ఏమైపోయినా ఫర్వాలేదని , అందుకే రాష్ట్ర విభజనకు సంబంధించి ఏమీ మాట్లాడడం లేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే వారి ఆగ్రహాన్ని ఉద్యమ రూపంలో వెళ్లగక్కుతున్నారు. ఏ ఊళ్లో ..ఏ సంఘం ఉద్యమం చేస్తున్నా వారి టార్గెట్ మాత్రం సత్తిబాబు కుటుంబమే. వేలాదిగా వీధుల్లోకి వస్తున్న ఉద్యమకారులంతా సత్తిబాబును, ఆయన పదవీ కాంక్షను, అవకాశవాదాన్ని దుమ్మెత్తిపోస్తున్నారు. బాబును ఏమీ అనొద్దు.. అయితే మన పోలీసులు మాత్రం సత్తిబాబుకు, ఆయన అధికారానికి లొంగిపోయి ‘మీరు ఉద్యమం చేసుకోండి...సత్తిబాబును మాత్రం ఏమీ అనకండి... సమైక్యగళం మాత్రమే వినిపించుకోండి’ అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అంతేకాకుండా రెండ్రోజుల కిందట బొబ్బిలిలో బొత్సకు వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేయగా వారిని పోలీసులు అడ్డగించి ఆ కార్డులను లాక్కుని ధ్వంసం చేశారు. ఈ ఉదంతం ఉద్యమకారుల్లో మరింత ఆగ్రహానికి కలిగించింది. రాష్ట్ర వినాశనానికి కారకులైన వారిని నిందించకుండా ఎలా ఉంటామని, అసలు తమ ఉద్యమంపై పోలీసుల పెత్తనమేమిటని వారు నిలదీస్తున్నారు. మధ్యలో వీళ్లకెందుకట.....? కడుపుమండి.. జీవితాలు అగమ్యగోచరమైన పరిస్థితుల్లో తాము రోడ్లెక్కి ఉద్యమిస్తుంటే మధ్యలో పోలీసుల బాధ ఏమిటన్న ప్రశ్న ఉదయిస్తోంది. సత్తిబాబు ప్రాపకం కోసం పోలీసులు పాకులాడి, ఆయన ప్రతిష్టను కాపాడాల్సిన అవసరం ఏమొచ్చిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.