
సాక్షి, గుంటూరు : మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పశు సంవర్థక శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ముస్తఫా, శనివారం గుంటూరు నగరంలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ నగరంలోని డ్రైనేజీ పనులను పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అస్తవ్యస్తంగా పనులు నిర్వహిస్తున్న అధికారులపై ఆయన ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి చెందుతున్న నగరం గుంటూరు అని, అలాంటి నగర అభివృద్ధి పనులలో నిర్లక్ష్యం వహించడం దారుణమన్నారు. వర్షం పడితే నగరం దుర్వాసన వస్తోందని, త్వరితగతిన మార్పులు చేయాల్సిన అవసరం ఉందని మంత్రి అధికారులను ఆదేశించారు. అలాగే నగరంలోని ఇసుక సమస్యపై కూలీలు మంత్రుల దృష్టికి తీసుకెళ్లగా.. త్వరలోనే ఇసుక సమస్య పరిష్కారం అవుతుందని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment