MLA Mustafa
-
అల్లర్లు సృష్టించేందుకు చంద్రబాబు కుట్రపన్నారు: గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా
-
సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి మరింత శక్తినివ్వాలని ప్రార్థించా
-
గుంటూరులో మంత్రుల పర్యటన
సాక్షి, గుంటూరు : మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పశు సంవర్థక శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ముస్తఫా, శనివారం గుంటూరు నగరంలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ నగరంలోని డ్రైనేజీ పనులను పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అస్తవ్యస్తంగా పనులు నిర్వహిస్తున్న అధికారులపై ఆయన ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి చెందుతున్న నగరం గుంటూరు అని, అలాంటి నగర అభివృద్ధి పనులలో నిర్లక్ష్యం వహించడం దారుణమన్నారు. వర్షం పడితే నగరం దుర్వాసన వస్తోందని, త్వరితగతిన మార్పులు చేయాల్సిన అవసరం ఉందని మంత్రి అధికారులను ఆదేశించారు. అలాగే నగరంలోని ఇసుక సమస్యపై కూలీలు మంత్రుల దృష్టికి తీసుకెళ్లగా.. త్వరలోనే ఇసుక సమస్య పరిష్కారం అవుతుందని హామీ ఇచ్చారు. -
వైఎస్సార్సీపీ అంటే ఓటు తొలగింపే!
సాక్షి, గుంటూరు/మంగళగిరి/గుంటూరు ఈస్ట్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల ఓట్లు గల్లంతు చేసే ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా జోరుగా సాగుతోంది. సర్వేల పేరుతో కొందరు యువకులు బృందాలుగా వైఎస్సార్సీపీకి పట్టున్న నియోజకవర్గాల్లో సంచరిస్తూ వారి ఓట్లను మాయం చేస్తున్నారు. ఈ విధంగా సర్వే చేస్తున్న 12 మందిని మంగళవారం గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా ఆధ్వర్యంలో పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు బాలాజీ నగర్‌కు చెందిన పి.వెంకటేశ్వర్లు నివాసం వద్దకు మంగళవారం సా.5 గంటల ప్రాంతంలో ఓ యువకుడు వచ్చాడు. సర్వే పేరుతో వెంకటేశ్వర్లు ఓటర్ ఐడీ నంబర్, ఫోన్ నంబర్, ఏ పార్టీకి ఓటు వేస్తావు అంటూ వివరాలు సేకరించడం మొదలుపెట్టాడు. ఈ ప్రశ్నలన్నీ ఎందుకు అడుగుతున్నావని వెంకటేశ్వర్లు ఆ యువకుడిని ప్రశ్నించగా స్పా (సెంటర్ ఫర్ సోషియో పొలిటికల్ ఎనాలసిస్) అనే సంస్థ ద్వారా 2019 ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీకి ఓటేయబోతున్నారో అనే అంశంపై ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నామని ఆ యువకుడు సమాధానం ఇచ్చాడు. ప్రజాభిప్రాయ సేకరణ చేసే వారికి ఓటర్ ఐడీ నంబర్‌తో ఏం పని ఉందని వెంకటేశ్వర్లు ప్రశ్నించగా ఆ యువకుడు తడబడుతూ సమాధానం చెప్పాడు. దీంతో అనుమానం వచ్చిన స్థానికులు ఆ యువకుడిని గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మహ్మద్ ముస్తఫా కార్యాలయానికి తీసుకువెళ్లారు. ఎమ్మెల్యే అతనిని ఆరా తీయగా తనతోపాటు ఇంకా 11 మంది ఉన్నారని, వారందరూ కొత్తపేటలోని నటరాజ లాడ్జిలో ఉన్నారని చెప్పాడు. దీంతో మిగిలిన యువకుల వద్దకు వెళ్లి వారినీ విచారించారు. ఇదంతా బెంగళూరు కేంద్రంగా జరుగుతున్నట్లు వారు చెప్పారు. కాగా, పోలీసులకు పట్టుబడిన స్పా బృందం 76 మందితో వాట్సాప్ గ్రూప్ కూడా నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. వాట్సాప్ గ్రూప్‌లో ఉన్న వారిలో చాలామంది ప్రొఫైల్ పిక్‌లలో టీడీపీ ఫొటోలు, లోకేష్‌తో దిగిన ఫొటోలు ఉండటం గమనార్హం. మరోవైపు.. ఇదే విధంగా ఈ నెల 17న ఇదే జిల్లా కృష్ణాయపాలెంలో కూడా ఇలాగే సర్వే నిర్వహించారు. అన్ని నియోజకవర్గాల్లో సర్వే సాధారణంగా సర్వే నిర్వహించే వారు కేవలం వ్యక్తి పేరు.. ఏ నియోజకవర్గం.. ఎవరికి ఓటు వేస్తారు అనే అంశాలపై మాత్రమే ప్రజలను అడిగి తెలుసుకుంటారు. అయితే, ఈ సంస్థ సభ్యులు నిర్వహించే సర్వే మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఓటరు పేరు, మొబైల్ నంబర్‌తో పాటు ఓటర్ ఐడీ నంబర్, ఏమైనా ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరిందా అనే అంశాలను ఆరా తీస్తున్నారు. ఈ సంస్థ తరఫున అన్ని నియోజకవర్గాల్లో సర్వే నిర్వహిస్తున్నట్టు వారు తెలిపారు. వైఎస్సార్ సీపీ ఓటర్లే లక్ష్యం.. స్పా సంస్థ సభ్యులను విచారించగా.. అధికశాతం వైఎస్సార్సీపీ ఓటర్లే లక్ష్యంగా ఈ సర్వే నిర్వహించారని తెలుస్తోంది. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో దాదాపు 25 పోలింగ్ కేంద్రాల పరిధిలో మంగళవారం వీరు సర్వే నిర్వహించినట్లు సమాచారం. వీరు వివరాలు సేకరించిన అరగంట లోపే తమ ఓటు రద్దయిందని పలువురు బాధితులు తెలిపారు. సర్వేల పేరుతో ఓట్లు గల్లంతు చేస్తున్నారని అనుమానం వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ విషయాన్ని ఎమ్మెల్యే ముస్తఫా కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు సర్వేకు సంబంధించిన సూపర్వైజర్లు ఉమామహేశ్, రవి సహా 10 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. వివరాలిచ్చాక చూస్తే ఓట్లు గల్లంతయ్యాయి సోమవారం ఇద్దరు యువకులు మా ఇంటికి వచ్చి కార్పొరేషన్ అధికారులు పంపించారని చెప్పి నమ్మించారు. ఓటర్ల జాబితా సవరణ చేస్తున్నామంటూ మా ఇంట్లోని ఓటర్ల వివరాలు అడిగారు. చివరగా వారి చేతిలోని ట్యాబ్‌లో ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారో ఆ గుర్తుపై వేలిముద్ర వేయాలన్నారు. నేను, మా అమ్మ వెంకట లక్ష్మమ్మ.. వైఎస్సార్సీపీ గుర్తు అయిన ఫ్యాన్‌పై వేలిముద్రలు వేశాం. వారి ప్రవర్తనపై అనుమానం వచ్చి గట్టిగా ప్రశ్నించడంతో పారిపోయారు. మంగళవారం ఓటర్ల జాబితా పరిశీలించగా నా ఓటు, మా అమ్మ ఓటు గల్లంతయ్యాయి. – సానికొమ్ము వెంకటేశ్వరరెడ్డి, ఎల్ఆర్ కాలనీ 6వ లైను, గుంటూరు వెంటనే ఓట్లు సరిచూసుకోండి ఓటర్లందరూ తమ ఓట్లను జాబితాలో సరిచూసుకోవాలి. తొలగించి ఉంటే వెంటనే నమోదు చేయించుకోవాలి. రానున్న ఎన్నికలలో విజయం సాధించలేమనే టీడీపీ ప్రభుత్వం అడ్డదారులు తొక్కుతోంది. ఓట్లను తొలగించారని నిర్ధారణ జరిగితే ఎన్నికల కమిషన్ దృష్టికి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. – ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్కే), ఎమ్మెల్యే, మంగళగిరి 36వేల ఓట్ల గల్లంతు గుంటూరు నగరంలో వైఎస్సార్సీపీకి చెందిన 36వేల ఓట్లు తొలగించారు. నాలుగు నెలలుగా కష్టపడి మేం ఓటర్లను చేర్పిస్తుంటే.. సర్వేల పేరుతో టీడీపీ వాటిని తొలగిస్తోంది. సర్వేలు చేసే వారికి ఓటర్ ఐడీ నంబర్లు, ఇతర వివరాలతో ఏం పని? ఇది ముమ్మాటికీ వైఎస్సార్సీపీ ఓట్లు తొలగించడానికి చేస్తున్న పనే. – మహ్మద్ ముస్తఫా, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే పావుగంటలో ఓటు గల్లంతు స్పా ప్రతినిధులమంటూ మంగళవారం కొందరు నా వద్దకు వచ్చి స్థానిక సమస్యలు అడిగారు. అనంతరం ఓటు ఎవరికి వేస్తున్నారో తెలపాలంటూ ప్రశ్నించారు. జనసేనకు వేస్తానని చెప్పా. అనంతరం వారి వద్ద ఉన్న టాబ్‌పై నా వేలి ముద్ర తీసుకున్నారు. నా ఓటు ఐడీ కార్డు నంబరు అడిగారు. వారి ప్రవర్తనపై అనుమానం వచ్చి ఎలక్షన్ కమిషన్ టోల్ ఫ్రీ నెంబర్ 1905కు ఫోన్‌చేయగా 15 నిమిషాల క్రితం నా ఓటు తొలగించబడిందని సమాధానం వచ్చింది. – తోట కార్తీక్, బాలాజీనగర్, 9వ లైను, గుంటూరు -
కఠిన శిక్షలు అమలు చేయండి
-
చంద్రబాబు కొత్త డ్రామా మొదలుపెట్టారు
-
గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం!
సాక్షి, గుంటూరు/ గుంటూరు మెడికల్: గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన ఎం.జోషిబాబుకు ఈ నెల 12న జరిగిన ఓ ప్రమాదంలో కుడిచేయి నుజ్జునుజ్జయింది. దీంతో కుటుంబసభ్యులు అతడిని గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. చేతి వేళ్లు పూర్తిగా దెబ్బతినడంతో బుధవారం సర్జికల్ ఆపరేషన్ థియేటర్ (ఎస్ఓటీ)లో శస్త్ర చికిత్స చేసేందుకు వైద్యులు సిద్ధమయ్యారు. అయితే ఆపరేషన్ మధ్యలో ఉండగా హ్యాండ్ డ్రిల్ మిషన్ పనిచేయలేదు. దీంతో వెంటనే అతడిని ఆర్థోపెడిక్ విభాగంలోని ఆపరేషన్ థియేటర్‌కు తరలించి శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. సరిగ్గా గత బుధవారం కూడా ఇలాంటి సమస్యే తలెత్తింది. పల్నాడు ప్రాంతంలోని ఓ గ్రామానికి చెందిన వెంకమ్మకు రోడ్డు ప్రమాదంలో తలకు బలమైన గాయాలయ్యాయి. ఈ నెల 7న ఎస్ఓటీలో శస్త్రచికిత్స చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఆపరేషన్ మధ్యలో ఉన్న సమయంలో ఓటీ లైట్లు ఆరిపోయాయి. దీంతో వైద్యులు సెల్‌ఫోన్ లైట్ల మధ్య ఆపరేషన్ పూర్తి చేశారు. గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలోని ఎస్ఓటీలో తరచూ జరుగుతున్న ఇలాంటి ఘటనలు రోగులను, వారి కుటుంబ సభ్యులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఆస్పత్రి అధికారుల నిర్లక్ష్యం జీజీహెచ్‌లోని చిన్న పిల్లల శస్త్రచికిత్స వైద్య విభాగంలో వెంటిలేటర్‌పై ఉన్న ఓ పసికందును ఎలుకలు కొరికి చంపిన సంఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఆ సమయంలో జీజీహెచ్‌ను ప్రక్షాళన చేస్తామంటూ ప్రభుత్వ పెద్దలు హడావుడి చేశారు. ఆ తర్వాత షరామామూలే. జీజీహెచ్‌లో జరిగే ఆపరేషన్ల వల్ల ఆరోగ్యశ్రీ ద్వారా రూ.కోట్ల ఆదాయం వస్తున్నా ఆపరేషన్ థియేటర్లలో వైద్య పరికరాలు, వసతుల కల్పనను మాత్రం ఆస్పత్రి అధికారులు పట్టించుకోవడం లేదు. ఒకవేళ నిధులు మంజూరు చేసినా కాంట్రాక్టర్లు నాణ్యత లేని వైద్య పరికరాలు సరఫరా చేస్తుండడంతో అవి ఆపరేషన్ల మధ్యలో మొరాయిస్తున్నాయి. థియేటర్లు లేక నిలిచిన ఆపరేషన్లు జీజీహెచ్‌లోని ఎస్ఓటీలలో ఇన్ఫెక్షన్లు ఎక్కువగా ఉన్నాయంటూ వైద్యులు ఆస్పత్రి అధికారులకు లిఖితపూర్వకంగా తెలియజేసి ఆపరేషన్లు నిలిపివేశారు. మూడు పర్యాయాలు ఆపరేషన్లు నిలిపివేయడంతో అధికారులు మరమ్మతుల కోసం రూ.20 లక్షలు మంజూరు చేశారు. మరమ్మతులు పూర్తయినా సరిపడా వైద్య పరికరాలు లేకపోవడంతో తాజాగా బుధవారం శస్త్రచికిత్స నిలిచిపోయింది. ఎస్ఓటీలో ముఖ్యమైన వైద్య పరికరాలు లేకపోవడంతో ఆపరేషన్లు చేయలేక అవస్థలు పడాల్సి వస్తోందంటూ వైద్య సిబ్బంది వాపోతున్నారు. న్యూరోసర్జరీ వైద్య విభాగంలో రోగుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో వారికి తగ్గట్టుగా ఆపరేషన్ థియేటర్లు లేక పలుమార్లు ఆపరేషన్లు వాయిదా పడుతున్నాయి. ఆర్థోపెడిక్ వైద్య విభాగానికి ప్రత్యేకంగా మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేసేందుకు థియేటర్ కేటాయించకపోవడం వల్ల ఏడాది పాటు ఆపరేషన్లు నిలిచిపోయాయి. అత్యంత ఖరీదైన కిడ్నీ మార్పిడి ఆపరేషన్లకూ ప్రత్యేకంగా థియేటర్ కేటాయించకపోవడంతో ఆర్నెల్లుగా ఆపరేషన్లు నిలిపివేశారు. దీంతో రూ.లక్షలు ఖర్చు పెట్టి ఆపరేషన్ చేయించుకునే స్థోమత లేక ఎంతోమంది పేదలు జీజీహెచ్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. జీజీహెచ్ ఎదుట ఎమ్మెల్యే ముస్తఫా ఆందోళన గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట గురువారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ముస్తఫా ఆందోళనకు దిగారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ నిర్లక్ష్యం వల్లే జీజీహెచ్‌లో అధ్వాన పరిస్థితులు నెలకొన్నాయని ఆయన మండిపడ్డారు. గతంలో ఆస్పత్రిలో ఎలుకలు చిన్నారిపై దాడి చేశాయని, పాములు కూడా వచ్చాయని ఆయన మండిపడ్డారు. సూపరింటెండెంట్ ఛాంబర్ వద్ద ముస్తఫా బైఠాయించిన నిరసన తెలిపారు. విచారణకు ఆదేశించిన ఉన్నతాధికారులు టార్చ్‌లైట్ వెలుగులో ఆపరేషన్లు చేస్తున్న ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. మరోవైపు వీడియో ఎలా బయటకు వచ్చింది, ఎవరు తీశారనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. కాగా గత మూడు నెలలుగా సెల్‌ఫోన్, టార్చ్లైట్ల వెలుగులోనే వైద్యులు ఆపరేషన్లు చేస్తున్నట్లు సమాచారం. -
ప్రాణం ఉన్నంత వరకు వైఎస్ జగన్ వెంటే ఉంటా
-
ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిపై అనర్హత వేటు వేయండి..
సాక్షి, విజయవాడ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచి ... పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిపై అనర్హత వేటు వేయాలని ఆ పార్టీ పిటిషన్ ఇచ్చింది. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ సెక్రటరీకి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, ముస్తాఫాలు బుధవారం పిటిషన్‌ను అందచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ...‘ వైఎస్ఆర్ సీపీ గుర్తుపై గెలిచి ఫిరాయింపులకు పాల్పడ్డ ఎమ్మెల్యే ఈశ్వరిపై అనర్హత వేటు వేయాలి. చంద్రబాబు నాయుడు పోలవంరం నుంచి రాజధాని వరకూ అన్నింటా అవినీతి చేస్తూ దోచుకున్న డబ్బుతో ఎమ్మెల్యేలను కొంటున్నారు. 23మందిపై అనర్హత పిటిషన్ ఇచ్చాం, స్పీకర్ చర్యలు తీసుకోవాలి. రాజ్యసభలో ఒక ఎంపీ వేరో పార్టీ ర్యాలీలో పాల్గొంటేనే చర్యలు తీసుకున్నారు. కానీ ఇక్కడ స్వయంగా చంద్రబాబు కండువాలు కప్పి పార్టీలో చేర్చుకుంటున్నా చర్యలు తీసుకోవడం లేదు. రాష్ట్రంలో అసలు రాజ్యాంగమే అమలు కావడం లేదు. అసెంబ్లీ స్పీకర్ ధృతరాష్ట్రుడిలా పాలిస్తున్నారు. అన్ని పక్షాలను సమంతరంగా చూడాల్సిన స్పీకర్ చంద్రబాబుకు తొత్తులా వ్యవహరిస్తున్నారు. తక్షణమే గిడ్డి ఈశ్వరితో సహా ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు. -
కన్నీటి కష్టాలు పట్టవా?
► 24 గంటల నీటి సరఫరా ఏమైంది? ► వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి అప్పిరెడ్డి, ఎమ్మెల్యే ముస్తఫా ప్రశ్న ► పోరాటాలకు వెనుకాడబోమని హెచ్చరిక పట్నంబజారు(గుంటూరు): ‘ఎండలు మండుతున్నాయి..నగర ప్రజల గొంతులు ఎండిపోతున్నాయి..వేసవిలో తాగునీటి కష్టాలను పట్టించుకోని దుస్థితిలో ప్రభుత్వం, అధికారులు ఉన్నారు. దీనిపై ప్రజల పక్షాన చూస్తూ ఉరుకోం..ప్రజలకు నీరు ఇచ్చే దాకా..ఎంతటి పోరాటాలకైనా వెనుకాడబోం’ అని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి చెప్పారు. 24/7 సమగ్ర నీటి సరఫరా అని ఆకాశమే హద్దుగా ప్రచారాలు చేశారని, అయినా ఇప్పటి వరకు కనీసం పనులు కూడా మొదలు పెట్టని పరిస్థితులు కనపడుతున్నాయని విమర్శించారు. రూ.460 కోట్లు ప్రపంచ బ్యాంకు నిధులతో ప్రారంభించిన సమగ్ర తాగునీటి పథక నిర్మాణ పనులు నత్తనడక సాగుతుంటే, మే 31లోపు సమగ్ర తాగునీటి ప్రాజెక్టు ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నించారు. అరండల్‌పేటలోని పార్టీ నగర కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకర్ల సమావేశంలోమాట్లాడారు. అధికారుల గణాంకాల ప్రకారమే నిత్యం ప్రతి మనిషికి 14 లీటర్ల నీరు కావాలని, నగర జనాభా ప్రకారం 140 ఎంఎల్డీల నీరు కావాల్సి ఉంటే, కేవలం 80 నుంచి 90 ఎంఎల్డీల నీరు మాత్రమే అందజేస్తున్నారని ధ్వజమెత్తారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్‌పై నిర్లక్ష్యం.. వేసవి కాలం సమీపిస్తున్న తరుణంలో అధికార యంత్రాంగం ముందుగానే సమ్మర్ యాక్షన్ ప్లాన్‌తో సిద్ధంగా ఉండి, జనవరిలో చెరువులు నింపే కార్యక్రమాన్ని కూడా పూర్తిస్థాయిలో నిర్లక్ష్యం చేశారని అప్పిరెడ్డి మండిపడ్డారు. రూ.5కోట్లతో ప్రతి సంవత్సరం సమ్మర్‌యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తారని, ప్రస్తుతం రూ.2కోట్లు మాత్రమే కేటాయించటం హాస్యాస్పదంగా ఉందన్నారు. గుంటూరు నగరానికి ఉండవల్లి నుంచి నులకపేట మీదుగా తక్కెళ్ళపాడు వరకు ప్రత్యేకంగా పైపు లైను నిర్మించే పనులు నత్తే నయం అన్న చదంగా నడుస్తున్నాయన్నారు. భూగర్భ జలాలు వేల అడుగుల్లోతుకు అడుగంటి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం నీటి ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయకుండా దారి మళ్లిస్తున్నారని ఆరోపించారు. నీటి ఎద్దడిని పరిష్కరించకపోతే ఎంతటి పోరాటాలకైనా వెనుకాడబోమని హెచ్చరించారు. ప్రణాళికలు ఏవీ.. గుంటూరుతూర్పు ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫా మాట్లాడుతూ ప్రణాళికలు లేకుండా అధికారులు వ్యవహరించటం సిగ్గుచేటన్నారు. ప్రజ లు గొంతెండుతోంది మహాప్రభో అన్నా పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడని మండిపడ్డారు. కేవలం ధనార్జన కోసమే కాకుండా, కొద్ది మేర కు ప్రజాభివృద్ధికి కావాల్సిన పనులు కూడా చేయాలని సూచించారు. కనీసం ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నియోజవర్గానికి నిధులు కూడా కేటాయించలేని నీఛ సంస్కృతికి చంద్రబాబు సర్కార్ నాంది పలికిందని మండిపడ్డారు. ఆనాడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతి పక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు సైతం ని«ధులు కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రజల కోసం పోరుబాట పట్టేందుకు వెనుకాడబోమన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పోరేటర్లు ఉడతా కృష్ణ, తుమ్మేటి శారదా శ్రీని వాస్, పూనూరి నాగేశ్వరరావు, ఆబీద్‌బాషా, అగ్గిపెట్టల రాజు, బత్తుల దేవా నంద్, పార్టీ నేతలు చదలవాడ రవీంద్రనా«థ్, పానుగంటి చైతన్య, షేక్ రబ్బా ని, షేక్ గౌస్, నరాలశెట్టి అర్జున్, విఠ ల్, వినోద్, సంతోష్, రామ్, లక్ష్మీనారా యణ, మస్తాన్‌వలి పాల్గొన్నారు. -
ప్రతిపక్ష నేత జగన్‌కు పేషీ కేటాయించాలి
అసెంబ్లీ కార్యదర్శికి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ముస్తఫా వినతి సాక్షి, అమరావతి: తాత్కాలిక అసెంబ్లీ భవన సముదాయంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి సరైన చాంబర్, పేషీ లేకపోవడం దారుణమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ముస్తఫా మండిపడ్డారు. దీనిపై మంగళవారం అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణను కలసి వినతిపత్రం అందించారు. తాత్కాలిక అసెంబ్లీ భవన సముదాయంలో అన్ని విభాగాలు, వాటి బాధ్యులకు చాంబర్లు కేటాయిస్తూ నేమ్‌బోర్డులు డిస్ప్లే చేశారని, కానీ ప్రతిపక్ష నేతకు చాంబర్, పేషీ ఎక్కడ కేటాయించారో ఇంతవరకు చెప్పలేదని మండిపడ్డారు. స్పీకర్ కోడెల వెంటనే స్పందించి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌కు సరైన చాంబర్, పేషీ.. ప్రతిపక్ష విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేరుతో శాసనసభాపక్ష కార్యాలయం కేటాయించేలా చర్యలు తీసుకోవాలని ముస్తఫా కోరారు. -
అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో టీడీపీ దౌర్జన్యం
గుంటూరు: గుంటూరు అర్బన్ బ్యాంకు వద్ద బుధవారం ఉద్రిక్తత నెలకొంది. బ్యాంకుకు సంబంధించిన రెండు డైరెక్టర్ల పదవులకు తాజాగా పదవీ కాలం ముగియడంతో తిరిగి ఎన్నికలకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ వేయడానికి వెళ్లిన వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ముస్తఫా, పలువురు నేతలు వెళ్లారు. నామినేషన్ వేయడానికి వెళ్తున్న నేతలను టీడీపీ, బీజీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో బ్యాంకు పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ, బీజేపీ నేతలను ప్రతిఘటించిన వైఎస్సాఆర్ సీపీ నేతలతో వారు వాగ్వాదానికి దిగారు. కొద్దిపాటి తోపులాట జరిగింది. చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు ఎన్నికలు జరగనుండటంతో వాటిని టీడీపీ, బీజేపీ పంచుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. -
పోలీసుల తీరును తప్పుపట్టిన హైకోర్టు
గుంటూరు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అంబటి రాంబాబు, ముస్తఫాలపై దాడి ఘటనకు సంబంధించి శుక్రవారం హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. వైఎస్ఆర్సీపీ నేతలపై దాడిచేసి నలుగురు ఎంపీటీసీలను ఎత్తుకెళ్లిన ఘటనపై త్వరితగతిన విచారణ పూర్తి చేయటం లేదంటూ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి పిటిషన్లో పేర్కొన్నారు. ప్రతివాదులుగా ఆంధ్రప్రదేశ్ డీజీపీ, గుంటూరు రూరల్ ఎస్పీ, ఏపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శిలను చేర్చారు. రెండు నెలల క్రితం గుంటూరు జిల్లా మేడికొండురూ సమీపంలో ఎమ్మెల్యే ముస్తఫాతో పాటు ప్రయాణిస్తున్న అంబటిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకూ నిందితులను గుర్తించలేదు. పోలీసులు కావాలనే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన తన పిటిషన్లో ఆరోపించారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం త్వరిగతగతిన విచారణ పూర్తి చేయాలని పోలీసులను ఆదేశించింది. పోలీసుల తీరును తప్పుబట్టిన న్యాయస్థానం ఇందుకు సంబంధించి నాలుగు వారాల్లో నివేదిక సమర్పించాలని సూచించింది. -
సభపై విశ్వాసం ఎలా?
→ మైనార్టీ ఎమ్మెల్యేకే రక్షణ లేకుంటే ఎలా ? → సభ్యుడు దాడికి గురైనా స్పీకర్ పరామర్శించరా ? → ఎంపీటీసీల కిడ్నాప్, ఎమ్మెల్యే ముస్తఫాపై దాడిపై విచారణకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల డిమాండ్ → స్పీకర్ నియోజక వర్గంలోనే దాడి జరగడం దారుణం : జ్యోతుల నెహ్రూ → సభ్యుని హక్కులుకాపాడాల్సిన బాధ్యత స్పీకర్‌పై ఉంది : ఉమ్మారెడ్డి → ఎమ్మెల్యే అని చెప్పినా దాడి చేశారు : ముస్తఫా → జగన్ నేతృత్వంలో ప్రజలకు అండగా నిలుస్తాం : అంబటి సాక్షి, గుంటూరు: శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు నియోజకవర్గంలోనే మైనార్టీ ఎమ్మెల్యేకు రక్షణ లేకుంటే ఎలా, ఒక మైనార్టీ ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో దాడికి గురైతే స్పీకర్ పరామర్శించకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, శాసనసభపై ఎమ్మెల్యేలకు ఎలా విశ్వాసం కలుగుతుందంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ముప్పాళ్ల ఎంపీపీ ఎన్నిక సందర్భంగా ఆదివారం మేడికొండూరు వద్ద ఎంపీటీసీల కిడ్నాప్, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫాపై చేసిన దాడులపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం గుంటూరులో సమావేశమైన ఆ పార్టీ నాయకులు ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. ఇలాంటి దాడులు జరగకుండా ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో కార్యకర్తలకు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. తొలుత వైఎస్సార్సీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ శాసనసభను పరిరక్షించాల్సిన స్పీకర్ నియోజక వర్గంలోనే ఇలాంటి సంఘటన జరగడం దారుణమన్నారు. ైమైనార్టీ ఎమ్మెల్యే ముస్తఫాపై దాడి జరిగితే విచారించకపోవడం మరింత దురదృష్టకరమన్నారు. ఈ విషయాన్ని సభ దృష్టికి తీసుకువెళ్లి నిలదీస్తామన్నారు. శాసనసభలోకి నమ్మకంతో అడుగు పెట్టాలంటే స్పీకర్ స్వచ్ఛందంగా విచారణ జరిపి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, చంద్రబాబు హయాంలో దుష్ట సంప్రదాయానికి తెరతీస్తున్నారన్నారు. జిల్లాలో ఇంతదారుణం జరిగినా చంద్రబాబు స్పందించక పోవడానికి కారణమేమిటని ప్రశ్నించారు. తాము బలమైన ప్రతిపక్షంగా ఉన్నామని ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదంటూ. జరిగిన సంఘటనపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మైనార్టీ ఎమ్మెల్యేపై దాడి జరిగితే ఆ సభ్యుని హక్కులను కాపాడాల్సిన బాధ్యత స్పీకర్‌పై ఉందని గుర్తు చేశారు. జీవితంలో ఎన్నడూ చూడలేదు... ముస్తఫా, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ముఖానికి ముసుగులు వేసుకున్న కొంతమంది దాడి చేసేందుకు రాగా తన గన్మెన్లు ఎమ్మెల్యే అని చెప్పినా వినకుండా ఘోరంగా సినీ తరహాలో రాళ్లు, కర్రలతో దాడిచేశారు. ఈప్రభుత్వానికి న్యాయమెక్కడుంది. వాళ్లే ఈ విధంగా వ్యవహరిస్తే ప్రజలకు ఎలా న్యాయం జరుగుతుంది. పట్టపగలు సంఘటన జరిగితే రక్షణ ఇవ్వలేకపోతే వారు ప్రజలకు ఏంన్యాయం చేస్తారు. రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారు. ఆటవిక పాలనలో ఉన్నామా... అంబటిరాంబాబు, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి ప్రజాస్వామ్య పాలనలో ఉన్నామా, ఆటవిక పాలనలో ఉన్నామా, అనే అనుమానం కలుగుతోంది. ముప్పాళ్లలో 12 మంది ఎంపీటీసీల్లో 7 మంది వైఎస్సార్ సీపీ వైపు ఉన్నారు. స్పష్టమైన మెజార్టీ ఉంది. 4వ తేదీ ఎన్నికను బలవంతంగా వాయిదా వేయించారు. 13వ తేదీ వరకు ఎంపీటీసీలు అనేక చోట్ల తలదాచుకున్నారు. చివరకు మా వద్దకు వస్తే వారిని వెంట తీసుకెళ్తుండగా, దాడిచేసి వారిని కిడ్నాప్ చేశారు. శాసనసభ స్పీకర్, సీఎంలకు ముప్పాళ్ల ఎంపీపీ పీఠమే కావాల్సి వచ్చిందా, ఈ దౌర్జన్యాన్ని చూస్తూ ఊరుకోం. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో ప్రజలకు అండగా నిలుస్తాం. ప్రజలను రక్షించాల్సిన పోలీసులే భక్షకులుగా మారితే న్యాయం ఎక్కడ జరుగుతుంది. -
'ఎమ్మెల్యేపై దాడి సీఎం కార్యాలయమే ప్రోత్సహిస్తోంది'
గుంటూరు నగర తూర్పు ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ముస్తాఫాపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ నాయకుడు ధర్మాన ప్రసాదరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేపై దాడి వ్యవహరంలో జోక్యం చేసుకోవాలని ధర్మాన ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావుకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం శ్రీకాకుళంలో ధర్మాన మాట్లాడుతూ... స్థానిక ఎన్నికల్లో అక్రమాలు, దౌర్జన్యాలు వ్యూహత్మక నేరమని ఆయన ఆభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ సీఎం కార్యాలయం ఇటువంటి వాటిని ప్రోత్సహిస్తోందని ఆయన ఆరోపించారు. ముప్పాళ్ల ఎంపీపీ అధ్యక్షుడి ఎన్నికల సందర్భంగా వైఎస్ఆర్ సీపీ నాయకుడు అంబటి రాంబాబు, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తాఫా ఎంపీటీసీ సభ్యులతో కలసి వాహనాలలో బయలుదేరారు. ఆ వాహనాలు మేడికొండూరు సమీపంలోనికి రాగానే వారిపై దాదాపు 200 మంది టీడీపీ కార్యకర్తలు కర్రలు, రాళ్లతో దాడికి చేశారు. అనంతరం వైఎస్ఆర్ సీపీ నాయకుల వాహనాలలో ఉన్న ముగ్గురు ఎంపీటీసీ సభ్యులను కిడ్నాప్ చేశారు. టీడీపీ కార్యకర్తల దాడిలో వైఎస్ఆర్ సీపీ నాయకుల వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఎమ్మెల్యే ముస్తాఫాకు స్వల్పంగా గాయపడ్డారు. -
కన్నీళ్లు పెట్టుకున్న ఎమ్మెల్యే
-
కన్నీళ్లు పెట్టుకున్న ఎమ్మెల్యే
గుంటూరు: ఇలాంటి దారుణం తానెప్పుడూ చూడలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తాఫా కన్నీళ్లు పెట్టుకున్నారు. మేడికొండూరు వద్ద టీడీపీ కార్యకర్తలు తమపై దాడి చేసి నలుగురు మహిళా ఎంపీటీసీలను కిడ్నాప్ చేసిన ఘటనపై ఆయన చలించిపోయారు. ఎమ్మెల్యే అయిన తనపైనే దాడి చేశారంటే సామాన్యుడి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. టీడీపీ కార్యకర్తలు తనను విచక్షణారహితంగా కొట్టారని వాపోయారు. మహిళా ఎంపీటీసీలను దౌర్జన్యంగా లాక్కెళ్లారని తెలిపారు. కన్నీళ్లు పెట్టుకున్నా, ఫ్యామిలీ ఉందని చెప్పినా వినిపించుకోలేదన్నారు. చిన్నపిల్లలు ఉన్నారు వదలమని చెప్పినా పట్టించుకోలేదని చెప్పారు. ఇలా చేయడం చాలా తప్పు, చాలా దారుణమని పేర్కొన్నారు. సినిమాల్లో తప్ప బయట ఇలాంటి దౌర్జన్యాలు చూడలేదంటూ కన్నీళ్ల పర్యంతమయ్యారు. దాడిపై తాము సమాచారం అందించినా పోలీసులు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.