గుంటూరు: గుంటూరు అర్బన్ బ్యాంకు వద్ద బుధవారం ఉద్రిక్తత నెలకొంది. బ్యాంకుకు సంబంధించిన రెండు డైరెక్టర్ల పదవులకు తాజాగా పదవీ కాలం ముగియడంతో తిరిగి ఎన్నికలకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ వేయడానికి వెళ్లిన వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ముస్తఫా, పలువురు నేతలు వెళ్లారు.
నామినేషన్ వేయడానికి వెళ్తున్న నేతలను టీడీపీ, బీజీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో బ్యాంకు పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ, బీజేపీ నేతలను ప్రతిఘటించిన వైఎస్సాఆర్ సీపీ నేతలతో వారు వాగ్వాదానికి దిగారు. కొద్దిపాటి తోపులాట జరిగింది. చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు ఎన్నికలు జరగనుండటంతో వాటిని టీడీపీ, బీజేపీ పంచుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.