తాత్కాలిక అసెంబ్లీ భవన సముదాయంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి సరైన చాంబర్, పేషీ లేకపోవడం దారుణమని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ముస్తఫా మండిపడ్డారు.
అసెంబ్లీ కార్యదర్శికి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ముస్తఫా వినతి
సాక్షి, అమరావతి: తాత్కాలిక అసెంబ్లీ భవన సముదాయంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి సరైన చాంబర్, పేషీ లేకపోవడం దారుణమని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ముస్తఫా మండిపడ్డారు. దీనిపై మంగళవారం అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణను కలసి వినతిపత్రం అందించారు.
తాత్కాలిక అసెంబ్లీ భవన సముదాయంలో అన్ని విభాగాలు, వాటి బాధ్యులకు చాంబర్‌లు కేటాయిస్తూ నేమ్‌బోర్డులు డిస్‌ప్లే చేశారని, కానీ ప్రతిపక్ష నేతకు చాంబర్, పేషీ ఎక్కడ కేటాయించారో ఇంతవరకు చెప్పలేదని మండిపడ్డారు. స్పీకర్ కోడెల వెంటనే స్పందించి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌కు సరైన చాంబర్, పేషీ.. ప్రతిపక్ష విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేరుతో శాసనసభాపక్ష కార్యాలయం కేటాయించేలా చర్యలు తీసుకోవాలని ముస్తఫా కోరారు.