సాక్షి, విజయవాడ: ధర్నా పేరుతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో డ్రామాలు ఆడుతున్నారని వైఎస్సార్‌సీపీ సీనియర్‌నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. హోదాతో ఏం వస్తాయని గతంలో ఎద్దేవా చేసిన వ్యక్తే నేడు ధర్నా చేయడం హాస్యాస్పదమన్నారు. హోదా ఉన్న రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయని గతంలో చంద్రబాబు అనలేదా? అని ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ పోరాటం కారణంగానే ప్రత్యేక హోదా నేటికీ సజీవంగా ఉందన్నారు.
సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎన్నికలు ఉన్నందునే హోదా పేరుతో చంద్రబాబు కొత్త డ్రామాలు ఆడుతున్నారని బొత్స మండిపడ్డారు. నాలుగున్నరేళ్లు బీజేపీతో అంటకాగి.. ఇప్పుడు కాంగ్రెస్‌తో జతకట్టారని విమర్శించారు. దీక్షల పేరుతో చంద్రబాబు నాయుడు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితోనే సాధ్యమని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment