రాష్ట్రంలో ప్రభుత్వం డిగ్రీ కళాశాల లేని ఏకైక జిల్లా కేంద్రం విజయనగరమని ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి విమర్శించారు. గత ముప్పై ఏళ్లుగా జిల్లాలో టీడీపీ అధికారంలో ఉందని, మంత్రులుగా, కేంద్ర మంత్రులుగా పదవులు అనుభవిస్తూ కనీసం డిగ్రీ కళాశాల కూడా కట్టలేక పోయారని జగన్ మండిపడ్డారు.