
భాస్కరరావు మృతదేహం
గుమ్మలక్ష్మీపురం: కూతుర్నిచ్చి న మామనే అల్లుడు కత్తితో పొడిచి చంపిన ఘటన మండల కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ కాలనీలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఆర్టీసీ కాలనీలో నివాసముంటున్న మొది లి భాస్కరరావు తన కుమార్తె రత్నంను వరుస కు బంధువైన కొల్‌కత్తాకు చెందిన వెంకటరావుకు ఇచ్చి ఐదేళ్ల కిందట వివాహం చేశాడు.
కొల్‌కత్తాలో ఓ ప్రైవేటు కేబుల్ నెట్‌వర్క్‌లో పనిచేస్తూ కొంత కాలం ఆనందంగానే ఉన్నారు. ఇంతలో ఏమైందో ఇరువురి మధ్య తగాదాలు చోటుచేసుకోవడంతో రత్నం కొద్ది రోజుల కిందట కన్నవారింటికి వచ్చేసింది. నెల రోజుల కిందట రత్నం ఎల్విన్‌పేట పోలీస్‌స్టేషన్లో భర్త వెంకటరావుపై ఫిర్యాదు చేసింది.
మూడు రోజుల కిందట గుమ్మలక్ష్మీపురం వచ్చిన వెంక టరావు శుక్రవారం రాత్రి మద్యం సేవించి భార్య రత్నంతో తగాదా పడ్డాడు. మామ భాస్కరరావు అడ్డుపడడంతో తనతో పాటు తెచ్చుకున్న పదునైన కత్తితో బలంగా జబ్బ, మెడ, తలపై పొడిచాడు. భాస్కరరావు అక్కడికక్కడే మృతి చెందాడు.
కుటుంబీకులు గాయాలతో ఉన్న రత్నంతో పాటు, భాస్కరరావు మృతదేహా న్ని భద్రగిరి ఆసుపత్రికి తీసుకెళ్లారు. వెంకటరావును స్థానికులు పట్టుకొని ఎల్విన్‌పేట పోలీ స్‌స్టేషన్‌కు అప్పగించారు. ఎల్విన్‌పేట సీఐ రాము భద్రగిరి ఆసుపత్రికి వెళ్లి పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతునికి భార్య ఇందిర, కుమారులు గణేష్, ప్రతాప్ ఉన్నారు.