
విజయనగరం క్రైం: నిద్రలో నడిచే అలవాటు వల్ల ఓ వ్యక్తి ప్రాణాలు పోయాయి. ఈ సంఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకోగా.. వన్‌టౌన్ పోలీసులు శనివారం అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక చైతన్య పబ్లిక్ స్కూల్ దగ్గరలో ఉన్న రత్నం మోజో అపార్ట్‌మెంట్ ఐదో ఫ్లోర్‌లో జి.పవన్‌కుమార్ (25) నివాసముంటున్నాడు. ఇతనికి నిద్రలో నడిచే అలవాటు ఉంది. శుక్రవారం రాత్రి అపార్ట్‌మెంట్‌లో పడుకున్న ఈయన అర్ధరాత్రి తర్వాత నిద్రలోనే పెద్దగా కేకలు వేసుకుంటూ ఐదో ఫ్లోర్ నుంచి కిందకు పడి సంఘటనా స్థలంలోనే కన్నుమూశాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఏఎస్సై వి. శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.