సాక్షి, విజయనగరం: ఎన్నికల తర్వాత దాడులు పెరిగాయని.. ప్రజాస్వామ్యంలో ఇటువంటివి ఉండకూడదని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, 20 రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే బాధేస్తుందన్నారు.
ప్రజాస్వామ్యంలో సామాన్య ప్రజలకు హక్కులున్నాయి. విజయనగరంలో మా పార్టీ ఆఫీసులోకి టీడీపీ నాయకులు చోరబడ్డారు. ఇటువంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదు. చట్టబద్ధంగా మా పార్టీ ఆఫీసులు నిర్మాణాలు జరుగుతున్నాయి. యూనివర్శిటీల వీసీలపై కూడా దౌర్జన్యానికి దిగుతున్నారు’’ అని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.
‘విజయనగరం జిల్లా లో విష సంస్కృతి వచ్చింది. ప్రతిపక్ష వైస్సార్సీపీ పార్టీ కార్యాలయానికి వెళ్లి అధికార పార్టీ ఎమ్మెల్యే పరిశీలించడం ఏమిటి?. ఏదయిన పొరపాట్లు జరిగితే నోటీస్ ఇవ్వవచ్చు. ప్రభుత్వ కార్యాలయాలను పరిశీలించవచ్చు. యూనివర్సిటీల్లో వీసీలను నామినేట్ చేయడం ఒక విధానం. ఆ వీసీ కార్యాచరణ నచ్చకపోతే నోటీస్ ఇవ్వవచ్చు. వీసీ ఆఫీస్‌లకు వెళ్లి బెదిరించడం, తొలగించడం తప్పు. అవినీతి పై ఎంక్వయిరీ కోరడం తప్పు కాదు. అధికారం వాళ్ల చేతుల్లో వుంది. విద్యాశాఖ లో నాపై వచ్చిన ఆరోపణలు పై నో కామెంట్. ఫైల్స్ వాళ్ళ దగ్గర వున్నాయి. పరిశీలించుకోవాలి. కొందరు రిటైర్ అయిన అధికార్లు అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడరు. అధికారం పోయాక వచ్చి చెప్తారు. అది ఎంత వరకు సమంజసం.’’ అంటూ బొత్స మండిపడ్డారు
‘‘అనుభవం ఉన్న పార్టీ కాబట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వాళ్లకు తెలుసు. పథకాలు ఇస్తారో ఇవ్వరో వాళ్లకే తెలియాలి. రేపు ఏప్రిల్ నెలలో రిటైర్మెంట్‌తో కలుపుకొని 6 వేలు టీచర్ ఖాళీలు ఉన్నాయని అంచనా. ఈ ప్రభుత్వం 50వేలు అంచనా వేసి 16వేలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. కేంద్రం పార్లమెంట్ లో 30వేలు పోస్ట్‌లు ఖాళీ ఉన్నాయని అన్నారు. 117జీవోని రద్దు చేస్తే ప్రభుత్వం ఆర్ధిక పరిస్థితిని బట్టి ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వవచ్చు’’ అని బొత్స పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment