
సాక్షి, విజయవాడ: ఏపీలో సంక్షేమ పథకాలకు వాలంటీర్లతో డబ్బు పంపిణీ చేయవద్దని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల కోడ్ ముగిసేవరకు వాలంటీర్లకు ఇచ్చిన ఫోన్లు, పరికరాలు స్వాధీనం చేసుకోవాలని ఆదేశాల్లో పేర్కొంది.
ప్రభుత్వ పథకాల లబ్ధిదారులపై చంద్రబాబు కుట్రలు
ఏపీలో ప్రభుత్వం పథకాల లబ్ధిదారులపై చంద్రబాబు కుట్రలకు తెరలేపారు. అవ్వాతాతాలపై కసి తీర్చుకుంటున్న చంద్రబాబు.. నిమ్మగడ్డ రమేష్ ద్వారా వాలంటీర్లపై ఫిర్యాదు చేయిచారు. చంద్రబాబు కుట్రలతో వాలంటీర్ల సేవలకు ఈసీ బ్రేక్ వేసింది.
వాలంటీర్లు పెన్షన్లు, ఇతర సంక్షేమ పథకాలు ఇవ్వకూడదంటూ నిమ్మగడ్డ ఫిర్యాదుతో వాలంటీర్లపై ఈసీ ఆంక్షలు పెట్టింది. పెన్షన్లు వాలంటీర్లు ఇవ్వకూడదంటూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఫోన్లు, ట్యాబ్‌లు ఉన్నతాధికారులకు అందించాలని ఆదేశించింది. కోడ్ ముగిసేవరకు పెన్షన్లు, ఇతర సంక్షేమ పథకాల పంపిణీకి ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని ఎన్నికల సంఘం పేర్కొంది.
ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులుగా.. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులో క్షేత్రస్థాయిలో పైరవీలు, అవినీతి అన్న వాటికి తావేలేకుండా.. కుల, మత, ప్రాంత, వర్గ తారతమ్యాలకు అతీతంగా.. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పథకాలను అందజేయడంలో కీలకంగా పనిచేస్తున్న వలంటీర్లపై కుట్రకు ఎల్లో బ్యాచ్ బరితెగించింది.
Comments
Please login to add a commentAdd a comment