
మెజార్టీ ఎందుకు తగ్గిందో అర్థంకావట్లేదు: కేఈ
అమరావతి: కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుకున్నంత మెజార్టీ రాలేదని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అన్నారు. ఆయన బుధవారం మీడియాతో చిట్‌చాట్ చేస్తూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరకముందు ఎక్కువ మెజార్టీ సాధించామన్నారు. అయితే ఇప్పుడు ఎందుకు మెజార్టీ తగ్గిందో అర్థం కావడం లేదని డిప్యూటీ సీఎం అన్నారు.
కాగా బలం లేకపోయినా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నెగ్గడానికి టీడీపీ ఆంధ్రప్రదేశ్‌లోనూ ‘ఓటుకు కోట్లు’ తంత్రాన్ని విజయంతంగా అమలు చేసింది. అడ్డగోలుగా సంపాదించిన అవినీతి డబ్బును విచ్చలవిడిగా వెదజల్లి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందింది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గౌరు వెంకటరెడ్డిపై టీడీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డి 62 ఓట్ల మెజారిటీతో గెలిచిన విషయం విదితమే.