సీమలో బీసీలకు ఒక్క ఎమ్మెల్సీ సీటు ఇవ్వలేదు
నా తమ్ముడికి సమాధానం చెప్పలేకపోతున్నా: కేఈ
సాక్షి, అమరావతి: ఎమ్మెల్సీగా రాయలసీమ లో ఒక్క బీసీ నాయకుడికీ టీడీపీ అవకాశం ఇవ్వలేదని ఆ పార్టీ నేత, డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఆవేదన వ్యక్తంచేశారు. తన సోదరుడు కేఈ ప్రభాకర్‌కు ఎమ్మెల్సీ సీటు ఇవ్వలే దని, దీనిపై తాను అతనికి సర్దిచెప్పలేక పోతున్నానని తెలిపారు. మంగళవారం వెలగపూడి అసెంబ్లీలోని తన కార్యాలయంలో కేఈ విలేకరులతో మాట్లాడారు. పరోక్షంగా అనంతపురంలో జేసీ దివాకర్‌రెడ్డి కుటుంబాన్ని ప్రస్తావిస్తూ వారికి ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవి ఇచ్చినప్పుడు తమకు ఒక ఎమ్మెల్సీ ఎందుకివ్వరని ప్రభాకర్ వాదిస్తు న్నట్లు తెలిపారు. స్థానిక సంస్థల కోటాలో ఐదుగురు రెడ్టిలకు, ఎమ్మెల్యేల కోటాలో ఇద్దరు కమ్మవారికి ఎమ్మెల్సీ సీట్లిచ్చారని, సీమలో ఓ బీసీకి అవ కాశముంటుందని అను కున్నా అది జరగలేదన్నారు. కర్నూలు ఎంపీ సీటు తమ కుటుంబానికి ఇస్తేనే గెలుస్తామ న్నారు. గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఎంపీ సీటును బీసీలకే ఇచ్చిందని గుర్తు చేశారు.
సీఎం మూడ్ బాగోలేదు..!
కర్నూలు రాజధానిగా ఉండగా అసెంబ్లీ జరి గినప్పుడు మంత్రివర్గంలో ఎవరున్నారు, తదితర వివరాలతో నోట్ సీఎంకిచ్చినా పట్టించుకోలేదని కేఈ తెలిపారు. సుప్రీం కోర్టు ఓటుకు కోట్లు కేసును విచారణకు స్వీక రించడంతో సీఎం మూడ్ బాగోలేదన్నారు.