హైదరాబాద్ : కాంగ్రెస్, టీడీపీలు ఎస్సీ, ఎస్టీలను రాజ్యసభ అభ్యర్థులుగా ప్రకటించకపోవడం దారుణమని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు విశ్వరూప్, బాబూరావు, శ్రీనివాసులు, బాలరాజు మండిపడ్డారు. దళితులు, గిరిజనులు అంటే కాంగ్రెస్, టీడీపీలకున్న చిత్తశుద్ధి ఇదేనా అని వారు ప్రశ్నించారు.
కోట్లు ఖర్చు పెట్టేవారికే టికెట్లిస్తారా అంటూ వారు మంగళవారమిక్కడ సూటిగా ప్రశ్నలు సంధించారు. ఎస్సీ, ఎస్టీల ఓట్లు కావాలి కాని.. పెద్దల సభలో వారికి ప్రాతినిథ్యం వద్దా అన్న వైఎస్‌ఆర్‌సీపీ.. కాంగ్రెస్, టీడీపీల వ్యవహారశైలి సిగ్గు చేటన్నారు.