రాజ్యసభ ఎన్నికలు: ఆ రాష్ట్రంలో ఒక స్థానానికే పరిమితమైన బీజేపీ | Rajya Sabha Election: Voting For 16 Seats In Four States | Sakshi
Sakshi News home page

రాజ్యసభ ఎన్నికలు: ఆ రాష్ట్రంలో ఒక స్థానానికే పరిమితమైన బీజేపీ

Published Fri, Jun 10 2022 8:53 AM | Last Updated on Fri, Jun 10 2022 9:34 PM

Rajya Sabha Election: Voting For 16 Seats In Four States - Sakshi

► కర్నాటకలో నాలుగు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ నుంచి నిర్మలా సీతారామన్‌, ఎమ్మెల్సీ లేహర్‌ సింగ్‌ సిరోయా, నటుడు జగ్గేశ్‌ విజయం సాధించగా.. కాంగ్రెస్‌ నుంచి జైరాం రమేష్‌ విజయాన్ని అందుకున్నారు. 

► రాజస్థాన్‌లో బీజేపీ నుంచి ఘనశ్యామ్‌ తివారీ గెలుపొందగా, కాంగ్రెస్‌ నుంచి రణ్‌దీప్‌ సుర్జేవాలా, ముకుల్‌ వాస్నిక్‌, ప్రమోద్‌ తివారీలు విజయం సాధించారు. 

► రాజ్యసభ ఎన్నికల్లో భాగంగా రాజస్థాన్‌ ఫలితాల్లో కాంగ్రెస్‌ మూడు స్థానాల్లో, బీజేపీ ఒక స్థానంలో గెలుపొందింది. జీ మీడియా అధినేత సుభాష్‌ చంద్ర పరాజయం చవిచూశారు.

►కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్తాన్, హరియాణాల నుంచి 16 రాజ్యసభ సీట్లకు జరిగిన ఎన్నికల ఓటింగ్‌ ముగిసింది. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు ఓటింగ్‌ ముగియగా, ఐదు గంటల నుంచి కౌంటిగ్‌ ప్రారంభమైంది. దాంతో ఫలితాలపై ఆసక్తి నెలకొంది.

►మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే ముక్తా తిలక్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా, ఆమె క్యాన్సర్‌తో బాధపడుతూ ఆసుప్రతిలో చికిత్స పొందుతోంది. మహారాష్ట్రలో రాజ్యసభ ఎన్నికల దృష్ట్యా ఆమె.. ఆసుపత్రి నుంచి అంబులెన్స్‌లో ఓటు వేసేందుకు వచ్చారు. ఆమె స్ట్రెచర్‌పై నుంచి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

► కర్ణాటకలో రాజ్యసభ ఎన్నిక‌ల్లో జేడీఎస్‌ ఎమ్మెల్యే కే శ్రీనివాస గౌడ కాంగ్రెస్‌కు ఓటు వేసినట్లు తెలిపారు. ఈ మేరకు ఓటింగ్‌లో పాల్గొని వస్తుండగా ఆయన మీడియాతో మాట్లాడారు. తాను కాంగ్రెస్‌కు ఓటు వేసినట్లు, ఆ పార్టీపై ఇష్టం, అభిమానంతోనే ఓటు వేశానని స్పష్టం చేశారు.

మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్‌, హర్యానా రాష్ట్రాల్లోని 16  రాజ్యసభ స్థానాలకు పోలింగ్‌ ప్రారంభమైంది.

► తమ 13 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌తో ఉన్నారని ఆ పార్టీలో చేరిన మాజీ బీఎస్పీ ఎమ్మెల్యే రాజేంద్ర గూడ తెలిపారు. తమకు 126 ఓట్లు ఉన్నాయని, ముగ్గురు కాంగ్రెస్ అభ్యర్థులు గెలుస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.

► మహా వికాస్ అఘాడికి చెందిన నలుగురు అభ్యర్థులు గెలుస్తారని, విజయంపై తమకు పూర్తి నమ్మకం ఉందని శివసేన నాయకుడు సంజయ్ రౌత్ తెలిపారు.

► అసదుద్దీన్ ఒవైసీకి చెందిన ఎంఐఎం ఎమ్మెల్యేలు మహారాష్ట్రలో కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయనున్నట్లు వెల్లడించారు. శుక్రవారం జరగనున్న మహారాష్ట్ర నంఉచి రాజ్యసభకు జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేయాలని ఆల్ ఇండియా మజ్లిస్-ఈ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) నిర్ణయించింది.

న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాల్లోని 16 రాజ్యసభ సీట్లకు జరగనున్న ఎన్నికల్లో ప్రలోభాల ఆరోపణలతో రిసార్టులు, హోటళ్లలో మకాం వేసిన వివిధ పార్టీల ఎమ్మెల్యేలు నేడు బయటకు రానున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌ ప్రత్యేక పరిశీలకులను నియమించి, పోలింగ్‌ ప్రక్రియను ఆసాంతం వీడియో రికార్డు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్తాన్, హరియాణాల నుంచి రాజ్యసభకు పోటీ చేస్తున్న ప్రముఖుల్లో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్‌ గోయెల్, కాంగ్రెస్‌ నేతలు రణ్‌దీప్‌ సూర్జేవాలా, జైరాం రమేశ్, ముకుల్‌ వాస్నిక్, శివసేన కీలక నేత సంజయ్‌ రౌత్‌ తదితరులున్నారు.

ఎన్నికల్లో వీరి గెలుపు ఖాయమని భావిస్తున్నారు. మొత్తం 57 రాజ్యసభ స్థానాలకు గాను ఉత్తరప్రదేశ్, తమిళనాడు, బిహార్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, చత్తీస్‌గఢ్, పంజాబ్, తెలంగాణ, జార్ఖండ్, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల నుంచి 41 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు గత వారం ఈసీ ప్రకటించింది. నాలుగు రాష్ట్రాల్లోని మిగతా 16 సీట్లకు గాను పోటీ తీవ్రంగా ఉంది.  ఓపెన్ బ్యాలెట్ విధానంలో ఓటింగ్ నిర్వహిస్తారు. రాజ్యసభ ఎన్నికల్లో నోటా ఆప్షన్ ఉండదు.

తీవ్ర పోటీ
ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న మహారాష్ట్ర, రాజస్థాన్‌లో 4 స్థానాలకు తీవ్ర పోటీ నెలకొంది. దీంతో ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీలు తమ ఎ‍మ్మెల్యేలను రిసార్ట్‌లకు తరలించారు. మహారాష్ట్రలో అత్యధికంగా 6 సీట్లకు, కర్ణాటకలో 5, రాజస్థాన్‌లో 5,  ఇక హర్యానాలో 2 సీట్లకు ఓటింగ్ జరగనుంది. కాగా జూలైలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో రాజ్యసభ ఎన్నికలు ప్రాధాన్యత సంతరించున్నాయి. ఇప్పుడు గెలుపొందిన వారు రాష్ట్రపతి ఎన్నికల్లోఓటు వేయనున్నారు. కాగా అత్యధికంగా 

చదవండి: రాజ్యసభ ఎన్నికల ఉత్కంఠ; రిసార్ట్‌కు ఎమ్మెల్యేల తరలింపు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement