
ఖాదర్‌బీ
శ్రీకాళహస్తి రూరల్: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం జగ్గరాజుపల్లి పంచాయతీ సర్పంచ్‌గా ఖాదర్‌బీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ గ్రామంలో అన్నీ ఎస్సీ కుటుంబాలే నివసిస్తున్నాయి. 677 మంది ఓటర్లున్న ఈ పంచాయతీ సర్పంచ్ పదవిని బీసీలకు కేటాయించారు. ఓటర్లంతా ఎస్సీలే కావడంతో మొదట్లో సందిగ్ధానికి గురయ్యారు. వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదరి దామతోటి ముని మైనార్టీ వర్గానికి చెందిన ఖాదర్‌బీని వివాహం చేసుకున్నారు. ఆమెది బీసీ వర్గం కావడంతో సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. పోటీలేకపో వడంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
చదవండి: విశాఖ ఘటనలో ఏపీ సర్కార్ పనితీరు భేష్
మా జాబితా తప్పని నిరూపించగలవా!
Comments
Please login to add a commentAdd a comment