
సాక్షి, అనంతపురం: అనంతపురం మున్సిపల్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ సత్తా చాటింది. ఐదుగురు వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
మునిసిపల్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో పోటీకి టీడీపీ దూరం కాగా, వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు మాత్రమే నామినేషన్లు దాఖలు చేయడంతో ఐదు స్టాండింగ్ కమిటీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు అనీల్ కుమార్ రెడ్డి, సుజాత, రహంతుల్లా, నాగవినూత, నర్సింహులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల స్క్రూటినీ తర్వాత అధికారికంగా ప్రకటించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment