మేయర్‌కు చెక్..!
→ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఎదురుదెబ్బ
→ డిప్యూటీ మేయర్ వర్గం ఆధిపత్యం
→ ఎన్నికలను బహిష్కరించిన వైఎస్సార్సీపీ
→ ప్రశాంతంగా ముగిసిన స్టాండింగ్ కమిటీ ఎన్నికలు
అనంతపురం న్యూసిటీ : స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో మేయర్ స్వరూప వర్గానికి ఎదురుదెబ్బ తగిలింది. ఊహించిన విధంగానే మేయర్‌పై ఉన్న అసమ్మతిని కార్పొరేటర్లు ఓటుతో బుద్ధి చెప్పారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డిప్యూటీ మేయర్ గంపన్న వర్గం ఎన్నికల్లో ఆధిపత్యం సాధించడంతో ఇక మేయర్‌కు చెక్ పెట్టేందుకు రంగం సిద్ధమైందన్న ప్రచారం జరుగుతోంది. నగరపాలక సంస్థలోని పింఛన్ గదిలో బుధవారం స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో డిప్యూటీ మేయర్ వర్గం నటేష్ చౌదరి, విజయశ్రీ, లక్ష్మిరెడ్డి, మేయర్ వర్గం నుంచి రాజారావు, రెబెల్ కార్పొరేటర్ ఉమామహేశ్వర్ గెలుపొందారు.
సజావుగా ఎన్నికలు : స్టాండింగ్ కమిటీ ఎన్నికలు సజావుగా జరిగాయి. కమిషనర్ చల్లా ఓబులేసు పర్యవేక్షణలోఉదయం 11 నుంచి 1 గంట వరకు ఎన్నికల పోలింగ్ జరిగింది. సాయంత్రం 4 గంటలకు ఓట్లను కమిషనర్ చల్లా ఓబులేసు లెక్కించారు. 50 డివిజన్లకుగానూ 11 మంది వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు బహిష్కరించగా, మేయర్, డిప్యూటీ మేయర్, 26వ డివిజన్ కార్పొరేటర్ ఆదినారాయణ ఎన్నికలకు గైర్హాజరయ్యారు. దీంతో మొత్తం 36 మంది కార్పొరేటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికల్లో నటేష్ చౌదరికి 20, రాజారావుకు 20, విజయశ్రీ 19, లక్ష్మిరెడ్డి 19, ఉమామహేశ్వర్‌కు 18 ఓట్లతో మొదటి ఐదు స్థానాల్లో నిలిచి గెలుపొందారు.
ఎన్నికలను బహిష్కరించిన వైఎస్సార్సీపీ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు గంగన హిమబిందు, గిరిజమ్మ, చింతకుంట సుశీలమ్మ, బోయ సరోజమ్మ, వెంకట్రమణమ్మ, బోయ పక్కీరమ్మ, జానకి, బాలాంజినేయులు, షుకూర్, గూడూరు మల్లికార్జున, సాకే పోతులయ్య స్టాండింగ్ కమిటీ ఎన్నికలను బíß ష్కరించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గంగన హిమబిందు, బోయగిరిజమ్మ, జానకి, షుకూర్ మాట్లాడుతూ పాలకవర్గం ప్రజల కనీస అవసరాలైన మంచినీరు, పారిశుద్ధ్యం, మురికి వాడల్లో నివసిస్తున్న పేద ప్రజల పింఛన్ అందించడంలో పాలకులు ఘోరంగా వైఫల్యం చెందారన్నారు. పాలకవర్గంలో అవినీతి చోటు చేసుకోయిందని సాక్షాత్తు ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి చెప్పారని గుర్తు చేశారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం స్టాండింగ్ కమిటీను ఎన్నుకుంటున్నారని ఆరోపించారు. అవినీతిని ప్రోత్సహించకూడదనే ఎన్నికలను బహిష్కరిస్తున్నామన్నారు. అనంతరం కమిషనర్ చల్లా ఓబులేసుకు వినతిపత్రం అందించి వెళ్లిపోయారు.
మేయర్‌కు చెక్ : మేయర్ స్వరూపకు చెక్ పెట్టేందుకే ఎన్నికల్లో డిప్యూటీ మేయర్ వర్గానికి కార్పొరేటర్లు ఓట్లేశారని ఆ పార్టీకు చెందిన నేతలే అంటున్నారు. పాలకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇష్టానుసారంగా అభివద్ధి పనులు చేపట్టారని, పలు డివిజన్లను విస్మరించడం కారణంగానే మేయర్‌కు వ్యతిరేకంగా ఓటేశారని చెబుతున్నారు. ఇదిలా ఉండగా అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి మేయర్ దూకుడుకు కళ్లెం వేయాలనే ఎన్నికల్లో ప్రే„ý కపాత్ర పోషించారన్న వాదనా ఉంది.
నగరాభివద్ధికి కషి
– స్టాండింగ్ కమిటీ సభ్యులు
నగరాభివద్ధి కోసం కషి చేస్తామంటూ స్టాండింగ్ కమిటీ సభ్యులు లక్ష్మిరెడ్డి, విజయశ్రీ, ఉమామహేశ్వర్ తెలిపారు. సమస్యలపై పోరాడే వారినే కార్పొరేటర్లు గెలిపించారని, అందుకు కతజ్ఞతలు తెలిపారు.