కదిరి అర్బన్: నిన్నటి దాకా ఆమె ఓ వలంటీర్. తన పరిధిలోని ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేశారు. అయితే ఇప్పుడు ఆమె వలంటీర్లు, అధికారుల భాగస్వామ్యంతో ఊరు మొత్తానికి సేవ చేసే అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. ఊరందరి సహకారంతో సర్పంచిగా ఏకగ్రీవమయ్యారు. అనంతపురం జిల్లా కదిరి మండలం ముత్యాలచెరువు పంచాయతీ సర్పంచ్ స్థానం బీసీ మహిళకు రిజర్వ్ అయింది. (చదవండి: తొలి దెబ్బ అదిరింది)
వలంటీర్‌గా నారికే శుభలేఖ తన ఉద్యోగాన్ని వదిలి సర్పంచి బరిలో నిలిచారు. ఆమెతో పాటు మరో ముగ్గురు కూడా నామినేషన్‌లు వేశారు. అయితే శుభలేఖ ఉత్తమ సేవలు అందించి ఉండటం, గ్రామస్తుల నిర్ణయం మేరకు మిగతా ముగ్గురు గురువారం నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో శుభలేక సర్పంచిగా ఏకగ్రీవమయ్యారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే డాక్టర్ పెడబల్లి వెంకటసిద్ధారెడ్డిని ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా ఆమె కలవగా, పూలమాలతో సన్మానించారు.(చదవండి: 523 పంచాయతీల్లో సర్పంచ్‌లు ఏకగ్రీవం)
Comments
Please login to add a commentAdd a comment