Kallur Village
-
54 ఏళ్ల చరిత్రలో.. ఒకే ఒక్కడు
ఆ పంచాయతీ ఏర్పడినప్పటి నుంచి ప్రతిసారి ఎన్నికలు జరుగుతున్నాయి. 54 ఏళ్ల చరిత్రలో ప్రస్తుతం తొలిసారి సర్పంచ్ పదవి ఏకగ్రీవం అయ్యింది. ఒకేఒక ఏకగ్రీవ సర్పంచ్‌గా ఎస్ఎ షుకూర్ చరిత్ర సృష్టించారు. కాగా అక్కడ ఆది నుంచి ముస్లిం మైనారిటీల హవానే కొనసాగుతోంది. పులిచెర్ల(కల్లూరు): మండలంలోని మేజర్ పంచాయతీ అయిన కల్లూరు 1965లో పంచాయతీగా ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటివరకు అన్నిసార్లు ఎన్నికలు జరుగుతూ వచ్చాయి. ఆ ఎన్నికల్లో ముస్లిం మైనారిటీలే ఆ గ్రామ సర్పంచ్‌లుగా ఎన్నిక అవుతున్నారు. ఇప్పుడు తొలిసారిగా ఈ గ్రామ సర్పంచ్‌గా వైఎస్సార్ సీపీ అభిమాని ఎస్ఎ షుకూర్ ఏకగ్రీవంగా ఎన్నికై రికార్డు సృష్టించారు. తొలి ఏకగ్రీవ సర్పంచ్‌గా ఆ పంచాయతీ చరిత్రలో ఆయన నిలి చిపోయారు. తొలిసారిగా 1967లో జరిగి న ఎన్నికల్లో నన్నే సాహెబ్ మొదటి సర్పంచ్‌గా గెలిచారు. అనంతరం హెచ్ఎస్ గఫూ ర్ 19 ఏళ్లు సర్పంచ్‌గా పనిచేశారు. ఆ తరువాత టీఎస్. గఫర్, ఎస్ఏ జుబేర్‌సాహెబ్, పీఎస్ నజీర్, హెచ్ఎస్ పర్విన్, పీ ఎస్ నజీర్, హెచ్ఎస్ షబానా సర్పంచ్‌లుగా పనిచేశారు. ప్రస్తుతం ఎస్ఎ షు కూర్ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యా రు. ఈ పంచాయతీకి 54 ఏళ్ల తరువాత ప్రస్తుతం తొలిసారిగా పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి. కాగా ఆది నుంచి ఇప్పటివరకు ముస్లిం మైనారిటీలే సర్పంచ్‌లుగా కొనసాగుతున్నారు. చదవండి: తండ్రి ఎమ్మెల్సీ.. తనయుడు సర్పంచ్.. ఇవేం పాడు పనులు.. కానిస్టేబుల్‌కు దేహశుద్ధి -
‘ముస్లింలకు సబ్ ప్లాన్ తీసుకొస్తాం’
సాక్షి, చిత్తూరు : నవరత్నాల ద్వారా పేదలందరికీ సంక్షేమ పథకాల లబ్ధిని అందజేయటమే తన లక్ష్యమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్ఘాటించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా శనివారం పుంగనూర్ నియోజకవర్గం కల్లూరులో నిర్వహించిన మైనార్టీల సదస్సులో ఆయన పాల్గొన్నారు. రాబోయే ప్రజా ప్రభుత్వంలో ముస్లింల కోసం సబ్ ప్లాన్ తీసుకొస్తామన్నారు. ‘ఇవాళ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ఒక్కటే చెప్పదల్చుకున్నా. నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో రాష్ట్ర అభివృద్ధి మరుగున పడిపోయింది. ఇలాంటి సమయంలో మనకు కావాల్సింది సమర్థవంతమైన పాలన. రాజకీయాలంటే విశ్వసనీయత కోల్పోయేలా చేసిన వ్యక్తి చంద్రబాబు. నాయకుడు అంటే ఎలా ఉండాలి అంటే గుర్తొచ్చేది దివంగత నేత రాజశేఖర్ రెడ్డి. మహానేత వారసుడిగా ప్రజల శ్రేయస్సు కోసం ఎందాకైనా వెళ్తా. అదే నా అంతిమ లక్ష్యం’ అని జగన్ పేర్కొన్నారు. చంద్రబాబు తన ఎన్నికల మేనిఫెస్టోలో ఒక్కో పేజీలో.. ఒక్కో కులానికి హామీలు ఇచ్చారు. అన్ని వర్గాల ప్రజలను ఎలా దగా చేయాలో రీసెర్చ్ చేసిన వ్యక్తి చంద్రబాబు. హామీలు నెరవేర్చకపోగా పైగా ప్రశ్నించిన వారిని ఓ వ్యక్తి తోలు తీస్తా.. తాట తీస్తా అని బెదిరిస్తున్నారు. ఇక్కడే చంద్రబాబు అసలు స్వరూపం బయటపడిందని వైఎస్ జగన్ చెప్పారు. ఇంకా వైఎస్ జగన్ ఏమన్నారంటే... చంద్రబాబు మైనార్టీలకు ఇచ్చిన హామీలను ఒక్కసారి పరిశీలిద్దాం. నిరుద్యోగ యువకులకు వడ్డీ లేని రుణాలు 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. మైనార్టీ కార్పొరేషన్ ద్వారా రుణ సదుపాయమన్నారు. వడ్డీ లేని ఇస్లామిక్ బ్యాంక్ ద్వారా ఆర్థిక పరిపుష్టి కల్పిస్తానని చెప్పారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్నారు. వీటిల్లో ఏ ఒక్కటైనా నెరవేర్చాడా? అని జగన్ ప్రశ్నించారు. (జనాల నుంచి లేదు అన్న సమాధానం వినిపించింది) ప్రతీ దాంట్లోనూ చంద్రబాబు మోసం స్పష్టంగా కనిపిస్తోంది. దేవుడి దీవెనలు, మీ ఆశీర్వాదంతో మన ప్రభుత్వం వస్తే ఏం చేయాలో సలహాలు, సూచనలు తీసుకుంటా. అంతకు ముందు నవరత్నాల ద్వారా వైఎస్సాఆర్సీపీ ఏం ఏం చేయదల్చుకుందో వివరిస్తానని వైఎస్ జగన్ అన్నారు. పేదరికంలో ఉన్న వాళ్ల ప్రధాన సమస్యల్లో ఒకటి. పిల్లలు చదువు. లక్షల్లో ఫీజులు ఉంటే రీఎంబర్స్మెంట్ పేరిట చంద్రబాబు ప్రభుత్వం ముష్టి వేస్తోంది. పండగలు వస్తే ఆయా మతాల మీద చంద్రబాబు ప్రేమ కురిపిస్తారు. కానీ, నిజమైన ప్రేమంటో నేను చెబుతున్నా విను చంద్రబాబు.. ఎంత ఖర్చైనా సరే పిల్లల చదువులకు భరోసా ఇవ్వటమే అసలైన ప్రేమ. అది నేను అందిస్తా. చదివించటమే కాదు.. వారికి ఖర్చుల కోసం 20 వేల రూపాయలను కూడా అందజేస్తానని జగన్ పేర్కొన్నారు. పేదలు అప్పులపాలు కాకుండా ఉండేందుకు సాయం చేస్తాం. ఆరోగ్యశ్రీలో అవసరమైన మార్పులు తీసుకొస్తా. ఏపీలోనే కాదు.. చుట్టుపక్కల ప్రాంతాల్లో వైద్యం చేయించుకున్న ఆరోగ్యశ్రీ కిందకు వర్తింపజేస్తాం. ఆపరేషన్ తర్వాత రెస్ట్ పీరియడ్‌లో డబ్బులు అందజేస్తాం. దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారికి 10 వేల రూపాయల పెన్షన్ అందజేస్తాం అని జగన్ వివరించారు. గతంలో అనంతపురంలో చెప్పిన విధంగా ఇమామ్‌లకు 5 వేల రూపాయలకు బదులు 10 వేల రూపాయలు.. మౌసమ్‌లకు 3 వేల రూపాయలకు బదులు.. 5 వేల రూపాయలు అందజేస్తామని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఇక ముస్లిం సోదరులకు ఎంత చేసినా తక్కువేనన్న జగన్.. తన తండ్రి ఆశయాలకు అనుగుణంగా సబ్ ఫ్లాన్‌ను తీసుకొస్తానని హామీనిచ్చారు. నవరత్నాలకు అవసరమైన మార్పులను సూచించాల్సిందిగా అక్కడ హాజరైన ముస్లిం ప్రజానీకాన్ని ఆయన కోరారు. ‘మీ కష్టాలను పక్కన పెట్టి చెరగని చిరునవ్వులతో ప్రేమానురాగాలు చూపిస్తూ.. నా భుజాన్ని తడుతూ వెంట నడుస్తున్నా ప్రతీ ఒక్కరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా’’ అని ముస్లిం సోదరులను ఉద్దేశించి వైఎస్ జగన్ తన ప్రసంగాన్ని ముగించారు. -
ఐదు కుటుంబాలు సాంఘిక బహిష్కరణ
కల్లూరు: తమనే ప్రశ్నిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన కుల పెద్దలు గ్రామంలోని ఐదు కుటుంబాలను సాంఘిక బహిష్కరణ చేస్తూ.. పంచాయితీలో తీర్మానం చేశారు. ఖమ్మం జిల్లా కల్లూరులోని శాంతినగర్‌కు చెందిన గుర్రాల సుధీర్, కొత్తపల్లి వెంకటేశ్వర్లు, ఖమ్మంపాటి శ్రీనివాసరావు, కంటెపూడి సురేష్, వంగూరి ప్రవీణ్‌కుమార్‌ల కుటుంబాలను సాంఘికంగా బహిష్క రించారు. దసరా పండుగ సందర్భంగా కబడ్డీ పోటీలు నిర్వహించారు. పోటీలు అనంతరం పెద్దల వద్ద ఉన్న డబ్బుల లెక్క చెప్పాలని ఈ ఐదుగురు డిమాండ్ చేశారు. దీంతో స్థానికుల సమక్షంలో లెక్కలు చెప్పారు. ఆ తర్వాత ‘మమ్మల్నే ప్రశ్నించి లెక్కలు అడుగుతారా’ అంటూ పంచాయితీ పెట్టి వారి కుటుంబాలను సాంఘిక బహిష్కణ చేస్తున్నట్లు తీర్మానం చేశారు. ఈ సంఘటన 28 రోజుల క్రితం జరగగా, కొందరు కుల పెద్దల జోక్యంతో బాధితులు ఇన్నిరోజులు వేచి ఉన్నారు. ఈ క్రమంలో ఆదివారం బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కులపెద్దలు సైతం వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశా రు. క్షమాపణలు చెప్పాలని పెద్ద మను షులకు సూచించారు. అయితే పంచా యితీ నిర్వహించి అందరి సమక్షంలోనే క్షమాపణ చెప్పాలని కోరుతున్నారు. -
మహిళ అదృశ్యం
ప్రొద్దుటూరు క్రైం: కల్లూరు గ్రామానికి చెందిన వెంకటలక్షుమ్మ(26) కనిపించడం లేదని భర్త ప్రతాప్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆయన తన భార్యను తీసుకొని ఈ నెల 10న కర్నూలు జిల్లాలోని సంజామల మండలం పేరుసోములలో ఉన్న కంబగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వెళ్లాడు. ఆమె 11న ప్రొద్దుటూరు వెళ్లడానికి రోడ్డుపైకి వచ్చింది. భర్త లగేజి బ్యాగు తీసుకొని వచ్చేలోపే కనిపించలేదు. ఇంటికి వెళ్లిందేమోనని కల్లూరుకు వచ్చాడు. ఇంటికి రాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. బం«ధువుల ఊళ్లలోనూ గాలించాడు. ఆమె జాడ ఇంత వరకు తెలియలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమె ఆచూకీ తెలిసిన వారు నంబర్: 8897335364కు ఫోన్ చేయాలని అతను కోరారు.