Panchayat Elections in AP: ఎన్నికల నిర్వహణకు భద్రత ఏర్పాట్లు | DGP Gautam Sawang - Sakshi
Sakshi News home page

పంచాయతీ ఎన్నికలకు కట్టుదిట్ట ఏర్పాట్లు

Published Sat, Feb 6 2021 1:08 PM | Last Updated on Sat, Feb 6 2021 2:21 PM

DGP Gautam Sawang Press Meet On Panchayat Elections - Sakshi

సాక్షి, విజయవాడ: పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, నాలుగు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారని పేర్కొన్నారు. ఎక్కడా ఇబ్బంది లేకుండా పోలీసు సిబ్బందిని నియమించామని, 13 వేల పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు భద్రత ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా పెంచామన్నారు. రాష్ట్రంలో ఏ ఘటన జరిగినా పోలీసులు వెంటనే స్పందిస్తున్నారని, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.(చదవండి: ఏకగ్రీవాలు జరిగితే తప్పేంటి: వైఎస్సార్‌సీపీ నేతలు)

‘‘షాడో, నిఘా టీమ్‌లు ఏర్పాటు చేశాం. చెక్‌పోస్టుల వద్ద మద్యం, డబ్బు తరలింపుపై తనిఖీలు చేస్తున్నాం. ఫ్యాక్షన్‌ ఉన్న గ్రామాల్లో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేస్తాం.మొదటి విడతలో పోలింగ్ బాక్స్‌ల భద్రతకు 61 స్ట్రాంగ్‌ రూమ్‌ల ఏర్పాటు చేశాం.1122 రూట్‌ మొబైల్స్‌, 199 మొబైల్ చెక్‌పోస్టులు, 9 ఎస్సీ రిజర్వు, 9 అడిషనల్ ఎస్సీ రిజర్వ్‌ పార్టీలు సిద్ధం చేశాం. ఇప్పటివరకు 9,199 ఆయుధాలు డిపాజిట్ అయ్యాయి. 1,47,931 బైండోవర్‌,12,779 సెక్యూరిటీ కేసులు నమోదు చేశాం. అనధికారిక, అధికారిక ఆయుధాలు సీజ్ చేస్తాం.కోడ్ అఫ్ కండక్ట్ తప్పినవారిపై ఫ్లైయింగ్ స్క్వాడ్‌లు ఉంటాయని’’ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ వెల్లడించారు. (చదవండి: టీడీపీ కుటిల యత్నం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement