
ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా పనిచేసిందన్నారు. 90 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 50 వేల మంది పోలీసులు విధుల్లో పాల్గొన్నారని పేర్కొన్నారు.
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ అన్నారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా పనిచేసిందన్నారు. 90 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 50 వేల మంది పోలీసులు విధుల్లో పాల్గొన్నారని పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ పక్కనపెట్టి ఉద్యోగులు పనిచేశారని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ పూర్తిగా సహకరించారని ఆయన తెలిపారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు సమన్వయంతో పనిచేశారని పేర్కొన్నారు. ప్రతి విడతలో 80 శాతం మంది ఓటింగ్‌లో పాల్గొన్నారని ఎస్‌ఈసీ వెల్లడించారు.
చదవండి:
పంచాయతీల్లో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం
పులివెందుల ‘పంచ్’ అదిరింది