టీడీపీ ప్రలోభాలపై చర్యలు తీసుకోవాలి: వైఎస్సార్సీపీ | YSRCP complaints to Election Commission on TDP politics | Sakshi
Sakshi News home page

గ్రామాల్లో మద్యం, డబ్బులు పంచుతున్నారని ఆరోపణ

Published Mon, Feb 15 2021 9:55 PM | Last Updated on Mon, Feb 15 2021 10:01 PM

YSRCP complaints to Election Commission on TDP politics - Sakshi

విజయవాడ: పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అక్రమాలకు పాల్పడుతున్నారని.. వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా విజయవాడలో ఎన్నికల‌ సంఘం కార్యదర్శి కన్నబాబును సోమవారం వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధులు నారాయణమూర్తి, రాజశేఖర్ రెడ్డి కలిసి వినతిపత్రం సమర్పించారు. టీడీపీ అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కార్యదర్శికి విజ్ఞప్తి చేశారు.

తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం గోవిందాపురం, వెల్లంక పంచాయతీలలో రీకౌంటింగ్ నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. పంచాయతీ ఎన్నికల్లో డబ్బు, మద్యం పంచుతూ ప్రలోభాలకు టీడీపీ మద్దతుదారులు గురి చేస్తున్నారని ఆరోపించారు. అలా చేస్తున్న తెలుగు దేశం పార్టీ మద్దతుదారులపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఎన్నికల సంఘాన్ని కోరారు. చిత్తూరు జిల్లా తిమ్మాపురం వడ్డేపల్లి గ్రామాల్లో వైఎస్సార్సీపీ కార్యకర్తల కుటుంబాలపై టీడీపీ చేసిన దాడులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement