సాక్షి, తిరుపతి: ఏకగ్రీవాలను అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని వైఎస్సార్ సీపీ నేతలు అన్నారు. శనివారం తిరుపతిలో మీడియా సమావేశంలో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణ స్వామి, ఎమ్మెల్యే ఆర్‌కే రోజా తదితరులు మాట్లాడారు. రాజ్యాంగబద్దంగా పనిచేయాలని ఎస్‌ఈసీని కోరుతున్నామని నేతలు అన్నారు. ఎస్‌ఈసీ ఏకగ్రీవాలను ప్రోత్సహించాలన్నారు. (చదవండి: విశాఖపై మాట్లాడే హక్కు టీడీపీకి లేదు)
చంద్రబాబు మొదటి నుంచి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని, చంద్రబాబుకు నమ్మినబంటుగా ఎస్‌ఈసీ పనిచేస్తున్నారని వైఎస్సార్ సీపీ నేతలు ధ్వజమెత్తారు.ఎస్‌ఈసీ నిబద్ధత లేని వ్యక్తి అని నిప్పులు చెరిగారు. నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తలతిక్క పనులు చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణపై బీజేపీ నేతలను ప్రశ్నించాలని వైఎస్సార్‌సీపీ నేతలు కోరారు.(చదవండి: నిమ్మగడ్డకు ఆ అధికారం ఎక్కడిది?)
Comments
Please login to add a commentAdd a comment