రెడ్డిచెర్ల వెంకటేశ్వరరాజు - రెడ్డిచెర్ల అంజనమ్మ
కొమరోలు: అక్కడ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 8 పర్యాయాల పాటు ఒక్క కుటుంబం వారే సర్పంచ్‌గా ఉంటున్నారు. పార్టీలు ఏవైనా సర్పంచ్ పదవి ఆ కుటుంబాన్ని వరిస్తుంది. 1956 నుంచి గత స్థానిక సంస్థల ఎన్నికల వరకు ఎన్నికలు జరిగిన ప్రతిసారీ ఆ కుటుంబానికి గ్రామపంచాయతీ ప్రజలు పట్టం కడుతున్నారు. కొమరోలు మండలం రెడ్డిచెర్ల పంచాయతీలో ఈ ఆనవాయితీ కొనసాగుతోంది. 1956లో మొదటగా రెడ్డిచెర్ల బాలవీరంరాజు సర్పంచ్‌గా గెలిచారు. అనంతరం బాలవీరంరాజు కుమారుడు లక్ష్మీనరసరాజు ఎన్నికయ్యారు. అనంతరం 5 పర్యాయాలు వారి కుటుంబంలోని రెడ్డిచెర్ల వెంకటేశ్వరరాజు సర్పంచ్‌గా ఉన్నారు.
1970 నుంచి 1976 వరకు వెంకటేశ్వరరాజు సర్పంచ్‌గా ఉండగా, 1983–87 వరకు మళ్లీ ఆయనే ఏకగ్రీవ సర్పంచ్‌గా ఉన్నారు. తరువాత 1987–1992 వరకు కూడా ఆయనే ఉన్నారు. 1995–2000 వరకు వెంకటేశ్వరరాజు భార్య అంజనమ్మ సర్పంచ్‌గా ఉన్నారు. అనంతరం రిజర్వేషన్ల ప్రాతిపదిక రావడంతో రెండు దఫాలు ఓసీ, ఎస్సీలకు వచ్చాయి. దీంతో పోటీలో నిలువలేదు. 2006–2011, 2014–2019లో వెంకటేశ్వరరాజు సర్పంచ్‌గా గెలుపొందారు. ఇప్పటి వరకు వీరి కుటుంబం గ్రామసర్పంచ్ ఎన్నికల్లో ఓటమి పాలు కాలేదు. వెంకటేశ్వరరాజు ఈమధ్య అనారోగ్యంతో మృతిచెందడంతో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల్లో రెడ్డిచెర్ల గ్రామపంచాయతీకి బీసీ రాగా వెంకటేశ్వరరాజు కోడలు రెడ్డిచెర్ల ఉమాదేవి వైఎస్సార్‌సీపీ బలపరిచిన అభ్యరి్థగా పోటీలో నిలిచారు.
(చదవండి: హతవిధీ.. ‘గుర్తు’ తప్పింది!)
ఓటమిని జీర్ణించుకోలేక రోడ్డును తవ్వేశారు!
Comments
Please login to add a commentAdd a comment