same family
-
వరంగల్‌లో దారుణం.. అన్న కుటుంబంపై కత్తులతో దాడి
సాక్షి, వరంగల్: వరంగల్ ఎల్బీనగర్లో దారుణం చోటు చేసుకుంది. అన్న కుటుంబంపై తమ్ముడు కత్తులతో దాడి చేశాడు. ఈ ఘటనలో అన్న సహా ముగ్గురు మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. మృతులను బాంద్‌పాషా, ఖలీల్, సబీరాగా గుర్తించారు. ఆస్తి తగాదాలే హత్యలకు కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తెల్లవారు జామున మూడు గంటల సమయంలో దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో తొమ్మిది మంది పాల్గొన్నట్లు సమాచారం. ఇవీ చదవండి: యువతికి ఇటీవలే నిశ్చితార్థం.. కన్నీటిసంద్రంలో కుటుంబం భర్తతో విడిపోయి, మరొకరితో సహజీవనం.. బాలికపై అత్యాచారం -
ప్రేమానురాగాలు మరిచి..అయినవారినే హతమార్చి..
నవమాసాలు మోసి కనీ పెంచిన తల్లి అని కూడా చూడలేదు.. తన చేతుల్లో అల్లారు ముద్దుగా పెరిగిన ఒక్కగానొక్క సోదరి పట్ల కనికరం చూపలేదు.. కలిసి పెరిగిన సోదరుడిపై కాస్తంత ప్రేమ చూపించలేదు. సైకో అవతారం ఎత్తిన అతను కన్న తల్లిని.. తోడబుట్టిన చెల్లిని.. తమ్ముడిని పొట్టన పెట్టుకున్నాడు. బంధాలను మరచిన అతను క్షణాల వ్యవధిలో ముగ్గురినీ రోకలి బండతో కొట్టి దారుణంగా హత్య చేశాడు. ప్రొద్దుటూరులో సోమవారం ఉదయం ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రొద్దుటూరు క్రైం (వైఎస్సార్ జిల్లా): ప్రొద్దుటూరు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ ఎదురుగా ఉన్న హైదర్‌ఖాన్ వీధిలో గుల్జార్‌బేగం (51), కరీమున్నీసా(27), మహమ్మద్‌రఫి (23) దారుణ హత్యకు గురయ్యారు.పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. చాంద్‌బాషా ప్రొద్దుటూరులోని హైదర్‌ఖాన్ వీధిలో నివాసం ఉంటున్నాడు. అతనికి భార్య గుల్జార్‌బేగం, కరీముల్లా, మహబూబ్‌బాషా, మహమ్మద్‌రఫి అనే కుమారులు, కరీమున్నీసా అనే కుమార్తె ఉన్నారు. అతను బొంగుబజార్‌లో మెకానిక్‌గా పని చేస్తున్నాడు. మహ్మద్‌రఫి తండ్రితో పాటు పని చేస్తుండగా మిగతా ఇద్దరూ బీరువాల తయారీ పని చేస్తుంటారు. వీళ్లిద్దరికీ పెళ్లిళ్లు అయ్యాయి. మహబూబ్‌బాషా తల్లిదండ్రులు ఉంటున్న ఇంటిపైనే బాడుగకు ఉంటున్నాడు. కరీముల్లా మాత్రం తల్లిదండ్రుల వద్ద ఉండేవాడు. కుమార్తె కరీమున్నీసాకు భగత్‌సింగ్ కాలనీకి చెందిన రహిముల్లాతో ఐదేళ్ల క్రితం వివాహమైంది. కరీముల్లా కొన్ని రోజుల నుంచి కుటుంబాన్ని పట్టించుకోలేదు. కుటుంబ ఖర్చులకు డబ్బు కూడా సరిగా ఇచ్చేవాడు కాదు. దీంతో తల్లిదండ్రులు అతన్ని పిలిచి మందలించారు. ఈ క్రమంలో ఏడాది క్రితం హైదర్‌ఖాన్ పక్కనే ఉన్న వీధిలో కరీముల్లాతో వేరు కాపురం పెట్టించారు. వారికి ఒక కుమార్తె ఉంది. వేరుకాపురం పెట్టిన నాటి నుంచి గొడవలు మొదలయ్యాయి.ఈ క్రమంలో భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఒక రోజు భార్యను నిలదీశాడు. ‘మీ వాళ్లు కావాలనే నాపై నిందలు వేస్తున్నారు.. వాళ్లు నీకు చేతబడి చేసి ఉంటారు’ అని చెప్పింది. ఆ రోజు నుంచి తల్లిదండ్రులతో నిత్యం గొడవ పడుతున్నాడు. అటు భార్యపై అనుమానం, ఇటు తల్లిదండ్రులపై కోపం అతన్ని రాక్షసుడిగా మార్చాయి. నాకు సుఖం లేనప్పుడు మిమ్మల్ని బతకనీయను.. తనకు సుఖం లేనప్పుడు ఇంట్లో ఎవ్వరినీ బతకనీయనని కరీముల్లా ఎప్పుడూ చెప్పేవాడు. అయినా అతని మాటలను కుటుంబ సభ్యులు పట్టించుకోలేదు.చెప్పినట్లు గానే తల్లి,చెల్లి, తమ్ముడిని హతమార్చాడు. నా కుమారుడ్ని ఉరి తీయండి సార్.. అమ్మను,తమ్ముడిని, చెల్లెల్ని చంపినఆ రాక్షసుడు భూమ్మీద ఉండొద్దు.. మీరు ఏం చేస్తారో మాకు తెలియదు.. వాడిని ఉరి తీయండి’అంటూ తండ్రి చాంద్‌బాషా రోదించ సాగాడు. నా భార్య ఏ పాపం చేసింది.. కరీమున్నీసా ఆరు నెలల గర్భిణీ. 3 నెలల నుంచి అమ్మగారింట్లోనే ఉంటోంది. 2రోజుల క్రితం భర్త రహీముల్లా అత్తగారింటికి వెళ్లి భార్యను పంపమని అడిగాడు. కొన్ని రోజులుండి పంపుతామని కరిమున్నీసా తల్లిదండ్రులు చెప్పారు. ఇంతలోనే అన్న చేతిలో ప్రాణాలు కోల్పోయింది. ఏ పాపం చేసిందని నా భార్యను చంపాడు.. అంటూ అతను రోదిస్తున్నాడు. చదవండి: మాయా జలం: మంచి నీటి పేరిట మహా మోసం సాక్షి ఎఫెక్ట్: అక్రమాల కోటలు కూలుతున్నాయ్.. -
అదే ఆనవాయితీ.. వారే సర్పంచ్‌లు..
మార్కాపురం: ఆ గ్రామంలో పంచాయతీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా సర్పంచిగా ఎన్నికయ్యేది మాత్రం ఆ ఒక్క కుటుంబ సభ్యులే. 1965 నుంచీ రిజర్వేషన్లు మారినప్పుడు మినహా జనరల్‌కు కేటాయించిన ప్రతిసారీ వారే విజయం సాధించారు. మార్కాపురం నియోజకవర్గం తర్లుపాడు మండలం గొల్లపల్లి పంచాయతీకి చెందిన యక్కంటి వారిది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. 1965లో యక్కంటి రామిరెడ్డి సర్పంచిగా ఎన్నికయ్యారు. 1967లో ఆయన మరణంతో వచ్చిన బై ఎలక్షన్స్‌లో ఆయన కుమారుడు యక్కంటి వెంకటరెడ్డి సర్పంచిగా ఎన్నికై 1987 వరకు 20 ఏళ్లపాటు పదవీ బాధ్యతలు నిర్వర్తించాడు. ఆ తర్వాత 1995 నుంచి 2000 సంవత్సరం వరకు వెంకటరెడ్డి కుమారుడు యక్కంటి రామిరెడ్డి సర్పంచిగా పని చేశారు. ఆ పదవీ కాలం ముగిసిన వెంటనే 2001 నుంచి 2005 వరకు ఆయనే ఎంపీటీటీగా పనిచేశారు. 2005 నుంచి 2010 వరకు రామిరెడ్డి భార్య వెంకట లక్ష్మమ్మ ఎంపీటీసీగా పని చేశారు. మధ్యలో ఒక దఫా రిజర్వేషన్లు మరడంతో విరామం రాగా మళ్లీ 2014లో జనరల్ మహిళగా రిజర్వ్ అయిన పంచాయతీ ఎన్నికల్లో యక్కంటి వెంకట లక్ష్మమ్మ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పదవీ కాలం ముగుస్తున్న దశలో ఆమె అనారోగ్యంతో మృతి చెందారు. తాజా పంచాయతీ ఎన్నికల్లోనూ పంచాయతీ గొల్లపల్లి జనరల్ మహిళకు రిజర్వ్ కావడతో రామిరెడ్డి, వెంకటలక్ష్మమ్మ దంపతుల కుమార్తె శ్రావణిని సర్పంచ్ అభ్యర్థిగా వైఎస్సార్ సీపీ మద్దతుతో పోటీలో నిలిపారు. బీటెక్ చదివిన శ్రావణి 21 ఏళ్ల వయసులోనే గొల్లపల్లి గ్రామ సర్పంచిగా ఎన్నికై ఆ కుటుంబ ఆనవాయితీని కాపాడింది. చదవండి: 54 ఏళ్ల చరిత్రలో.. ఒకే ఒక్కడు ఇవేం పాడు పనులు.. కానిస్టేబుల్‌కు దేహశుద్ధి -
ఓటమి ఎరుగని ‘సర్పంచ్’ ఫ్యామిలీ అది!
కొమరోలు: అక్కడ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 8 పర్యాయాల పాటు ఒక్క కుటుంబం వారే సర్పంచ్‌గా ఉంటున్నారు. పార్టీలు ఏవైనా సర్పంచ్ పదవి ఆ కుటుంబాన్ని వరిస్తుంది. 1956 నుంచి గత స్థానిక సంస్థల ఎన్నికల వరకు ఎన్నికలు జరిగిన ప్రతిసారీ ఆ కుటుంబానికి గ్రామపంచాయతీ ప్రజలు పట్టం కడుతున్నారు. కొమరోలు మండలం రెడ్డిచెర్ల పంచాయతీలో ఈ ఆనవాయితీ కొనసాగుతోంది. 1956లో మొదటగా రెడ్డిచెర్ల బాలవీరంరాజు సర్పంచ్‌గా గెలిచారు. అనంతరం బాలవీరంరాజు కుమారుడు లక్ష్మీనరసరాజు ఎన్నికయ్యారు. అనంతరం 5 పర్యాయాలు వారి కుటుంబంలోని రెడ్డిచెర్ల వెంకటేశ్వరరాజు సర్పంచ్‌గా ఉన్నారు. 1970 నుంచి 1976 వరకు వెంకటేశ్వరరాజు సర్పంచ్‌గా ఉండగా, 1983–87 వరకు మళ్లీ ఆయనే ఏకగ్రీవ సర్పంచ్‌గా ఉన్నారు. తరువాత 1987–1992 వరకు కూడా ఆయనే ఉన్నారు. 1995–2000 వరకు వెంకటేశ్వరరాజు భార్య అంజనమ్మ సర్పంచ్‌గా ఉన్నారు. అనంతరం రిజర్వేషన్ల ప్రాతిపదిక రావడంతో రెండు దఫాలు ఓసీ, ఎస్సీలకు వచ్చాయి. దీంతో పోటీలో నిలువలేదు. 2006–2011, 2014–2019లో వెంకటేశ్వరరాజు సర్పంచ్‌గా గెలుపొందారు. ఇప్పటి వరకు వీరి కుటుంబం గ్రామసర్పంచ్ ఎన్నికల్లో ఓటమి పాలు కాలేదు. వెంకటేశ్వరరాజు ఈమధ్య అనారోగ్యంతో మృతిచెందడంతో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల్లో రెడ్డిచెర్ల గ్రామపంచాయతీకి బీసీ రాగా వెంకటేశ్వరరాజు కోడలు రెడ్డిచెర్ల ఉమాదేవి వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యరి్థగా పోటీలో నిలిచారు. (చదవండి: హతవిధీ.. ‘గుర్తు’ తప్పింది!) ఓటమిని జీర్ణించుకోలేక రోడ్డును తవ్వేశారు! -
ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి
చిత్తూరు (తిరుపతి రూరల్): ప్రమాదవశాత్తూ కుంటలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందారు. వివరాలు..తిరుపతి రూరల్ మండలం పేరూరులోని వకుళమాత ఆలయ సమీపంలో చిన్న చిన్న కుంటలు ఉన్నాయి. పేరూరు గ్రామానికి చెందిన ఆదిలక్ష్మీ(30) బట్టలు ఉతకడానికి తన పిల్లలతో కలిసి వెళ్లింది. పిల్లలు నాచు వల్ల ప్రమాదవశాత్తూ కుంటలోకి జారిపడ్డారు. పిల్లల్ని కాపాడటానికి దూకిన ఆదిలక్ష్మీ కూడా చనిపోయింది. ఈ ఘటనలో ఆదిలక్ష్మి(30), భార్గవి(10), సురేష్(8)లు మృతిచెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కారు ఢీకొని వివాహిత దుర్మరణం
భీమడోలు: జాతీయ రహదారిపై భీమడోలు కనకదుర్గమ్మ ఆలయం వద్ద సోమవారం సాయంత్రం మోటార్ సైకిల్‌ను కారు ఢీకొట్టిన ప్రమాదంలో వివాహిత దుర్మరణం పాలైంది. టి.నరసాపురం గ్రామానికి చెందిన వివాహిత పుట్టాల జ్యోతి (32) మృత్యువాత పడగా భర్త, ముగ్గురు పిల్లలు గాయాలపాలయ్యారు. వివరాలిలా ఉన్నాయి.. టి.నరసాపురం గ్రామానికి చెందిన దంపతులు పుట్టాల సతీష్, జ్యోతి ముగ్గురు పిల్లలతో కలిసి ఆదివారం మండలంలోని పూళ్ల పంచాయతీ ఎం ఎం పురంలోని బంధువుల ఇంటికి వ చ్చారు. పెద్దింట్లమ్మ తీర్థానికి వెళ్లి సరదాగా గడిపారు. సోమవారం సాయంత్రం ఎంఎం పురం నుంచి టి.నరసాపురం మోటార్‌సైకిల్‌పై బయలుదేరారు. ఈ క్రమంలో జాతీయ రహదారిపై భీమడోలు కనకదుర్గమ్మ ఆలయం వద్ద డివైడర్ వైపు నుంచి గేటు వైపు వెళుతుండగా తాడేపల్లిగూడెం నుంచి ఏలూరు వైపు వెళ్తున్న కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో మోటార్‌సైకిల్‌పై ఉన్న వారంతా ఎగిరి రోడ్డుపై పడ్డారు. జ్యోతి తలకు తీవ్రగాయమైంది. సతీష్, పిల్లలు చాందిని, రాజేశ్వరి, వెంకట ఫణీంద్రకు గాయాలయ్యాయి. స్థానికులు వారిని చికిత్స నిమిత్తం ఏలూరు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ జ్యోతి కన్నుమూసింది. తల్లిని కోల్పోయిన పిల్లల రోదనలు మిన్నంటాయి. భీమడోలు ఎస్సై బి.వెంకటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.