
సాక్షి, వరంగల్: వరంగల్ ఎల్బీనగర్‌లో దారుణం చోటు చేసుకుంది. అన్న కుటుంబంపై తమ్ముడు కత్తులతో దాడి చేశాడు. ఈ ఘటనలో అన్న సహా ముగ్గురు మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. మృతులను బాంద్‌పాషా, ఖలీల్, సబీరాగా గుర్తించారు. ఆస్తి తగాదాలే హత్యలకు కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తెల్లవారు జామున మూడు గంటల సమయంలో దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో తొమ్మిది మంది పాల్గొన్నట్లు సమాచారం.
ఇవీ చదవండి:
యువతికి ఇటీవలే నిశ్చితార్థం.. కన్నీటిసంద్రంలో కుటుంబం
భర్తతో విడిపోయి, మరొకరితో సహజీవనం.. బాలికపై అత్యాచారం
Comments
Please login to add a commentAdd a comment