సాక్షి, విజయవాడ: తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 90 శాతం విజయం సాధించిందని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. గురువారం ఆయన విజయవాడ 49వ డివిజన్‌లో పాదయాత్ర ప్రారంభించారు. గడపగడపకు వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా మంచి నీటి, డ్రైనేజి సమస్యల త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల కమిషన్, చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసిన వైఎస్సార్‌సీపీదే విజయమన్నారు. చంద్రబాబు ఇప్పటికైనా బుది తెచ్చుకోవాలన్నారు. అబద్దాలకు కేరాఫ్ అడ్రస్‌గా చంద్రబాబును ఆయన అభివర్ణించారు. రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైపు చూస్తున్నారని తెలిపారు.
ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని నీచ రాజకీయాలు..
నగరంలోని గాంధీనగర్ 36వ డివిజన్‌లో నిర్వహించిన గుడ్ మార్నింగ్ విజయవాడ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు. ఆయన గడపగడపకు వెళ్లి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో ఇతర రాజకీయ పార్టీలను ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించారని తెలిపారు. టీడీపీ నేతలు.. ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకొని నీచ రాజకీయాలు చేశారని దుయ్యబట్టారు. వారికి ప్రజలు ఓటు ద్వారా బుద్ది చెప్పారన్నారు. చంద్రబాబు, ఎన్నికల కమిషన్.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై ఎన్ని విమర్శలు చేసిన ప్రజలంతా సీఎం జగన్ వైపు ఉన్నారని పేర్కొన్నారు. దేశానికే ఆదర్శంగా సీఎం వైఎస్ జగన్ పాలన సాగుతుందన్నారు. ‘‘చంద్రబాబు, దేవినేని ఉమా, అచ్చం నాయుడు నీచ రాజకీయలకు కేరాఫ్ అడ్రస్. స్థానిక సంస్థల ఎన్నికలలో వైస్సార్సీపీ విజయ ఢంకా మోగిస్తుంది. ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు అందిస్తున్నాం. గాంధీనగర్‌లో 2 కోట్లు అభివృద్ధి పనులు చేస్తున్నాం. రాష్ట్రంలో 30 లక్షల ఇళ్ల పట్టాలు పేదలకు మంజూరు చేశాం. నగరంలో రూ.600 కోట్లు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని’’మల్లాది విష్ణు అన్నారు.
(చదవండి: కోరి తెచ్చుకుంటే కొంప ముంచాయి!)
పేట్రేగిన టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు..
Comments
Please login to add a commentAdd a comment