
జామిలో వృద్ధుడిని పోలింగ్ కేంద్రానికి మోసుకెళుతున్న ఎస్‌ఐ సుదర్శన్
జామి(శృంగవరపుకోట): ఓ వైపు భార్య ప్రసవ వేదన అనుభవిస్తూ ఆస్పత్రిలో సతమతమవుతోంది.. అదే సమయంలో భర్త మాత్రం విధి నిర్వహణలో తలమునకలై ఉన్నారు. విజయనగరం జిల్లా జామి ఎస్‌ఐ ఎస్.సుదర్శన్ భార్య గౌతమి ఆదివారం పురిటి నొప్పులతో ఆస్పత్రిలో చేరారు. అయితే ఎస్‌ఐ మాత్రం పంచాయతీ ఎన్నికల విధుల్లో భాగంగా వృద్ధులను మోసుకుని మరీ పోలింగ్ కేంద్రం వద్దకు తీసుకెళ్లే పనిలో నిమగ్నమయ్యారు. చివరకు తన భార్య పాపకు జన్మనిచ్చినట్టు సమాచారం అందగానే ఆయన ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.
చదవండి:
ముక్కు మూసుకున్న అధికారులు: ‘నారాయణ’పై సీరియస్
ఎమ్మెల్యే బాలకృష్ణకు ఎదురుదెబ్బ