jami
-
సెల్ ఫోన్లో గేమ్స్ ఆడొద్దని మందలించడంతో..
జామి: సెల్ ఫోన్లో ఆటలాడొద్దని తండ్రి మందలించాడని కుమారుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సోమవారం జామిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. జామి మంగలవీధికి చెందిన లగుడు సింహాచలంనాయుడు(14) విద్యార్థి స్థానిక జెడ్పీ ఉన్నతపాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. సెల్ఫోన్లో ఆటలాడొద్దని తండ్రి కృష్ణ మందలించి పొలం పనులకు వెళ్లాడు. దీంతో సింహాచలంనాయుడు ఇంటివద్ద ఉన్న పురుగుల మందు తాగాడు. నోటిలో నుంచి నురగలు రావడంతో తల్లి కేకలు వేసి భర్తకు సమాచారం అందించింది. విద్యారి్థని స్థానిక పీహెచ్సీకి తీసుకెళ్లారు. అక్కడ ప్రథమ చికిత్స అందించిన అనంతరం విజయనగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ మృతిచెందాడు. ఘటనపై జామి ఏఎస్సై గోపి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
భార్యకు ప్రసవ వేదన.. భర్తకు విధి నిర్వహణ!
జామి(శృంగవరపుకోట): ఓ వైపు భార్య ప్రసవ వేదన అనుభవిస్తూ ఆస్పత్రిలో సతమతమవుతోంది.. అదే సమయంలో భర్త మాత్రం విధి నిర్వహణలో తలమునకలై ఉన్నారు. విజయనగరం జిల్లా జామి ఎస్ఐ ఎస్.సుదర్శన్ భార్య గౌతమి ఆదివారం పురిటి నొప్పులతో ఆస్పత్రిలో చేరారు. అయితే ఎస్ఐ మాత్రం పంచాయతీ ఎన్నికల విధుల్లో భాగంగా వృద్ధులను మోసుకుని మరీ పోలింగ్ కేంద్రం వద్దకు తీసుకెళ్లే పనిలో నిమగ్నమయ్యారు. చివరకు తన భార్య పాపకు జన్మనిచ్చినట్టు సమాచారం అందగానే ఆయన ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. చదవండి: ముక్కు మూసుకున్న అధికారులు: ‘నారాయణ’పై సీరియస్ ఎమ్మెల్యే బాలకృష్ణకు ఎదురుదెబ్బ -
ఏనాడు విడిపోని ముడి వేసెనే..!!
పెళ్లి సంబంధాలు వస్తే చాలు.. అమెరికా.. సింగపూరా.. చూసుకోకుండా.. మంచిదైతే చాలు కుదుర్చుకునే రోజులివి. ఇక పొరుగు రాష్ట్రమైతే ఎలాంటి అభ్యంతరం లేనేలేదు. ఓ గ్రామంలో మాత్రం ఊరు ఊరంతా కూడా అదే గ్రామానికి చెందిన వారిని మాత్రమే వివాహాలు చేసుకుంటున్నారు. అమ్మాయిలు.. అబ్బాయిలు గ్రామం దాటి బయటికి వెళ్లకుండా.. అదే గ్రామానికి చెందిన వారితోనే జీవితం పంచుకుంటున్నారు. పూర్వీకుల నుంచి ఇదే సంప్రదాయాన్ని నేటికీ కొనసాగిస్తున్న ఆ గ్రామం జామి మండలం లొట్లపల్లి. విజయనగరం జిల్లా జామి మండలం లొట్లపల్లి గ్రామంలో సుమారు వెయ్యిమంది జనాభా ఉంది. గ్రామస్తులంతా ఆ గ్రామస్తులనే వివాహం చేసుకోవడం ఆనవాయితీ. తాతల కాలం నుంచి ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఇతర గ్రామాలు, ప్రాంతాల సంబంధాలు చేసుకోవడానికి ఇష్టపడరు. ఆడపిల్లకు, మగ పిల్లలకు వివాహ వయసు వచ్చేసరికి కుటుంబ పెద్దలు, గ్రామ పెద్దలు కూర్చొని ఇద్దరినీ ఒప్పించి పెళ్లిళ్లు జరిపిస్తారు. వివాహలు చేసుకున్న వారు కూడా పెద్దల మాటల జవదాటరు. మేనత్త కూతుళ్లు, అక్క కూతుళ్లను ఎక్కువ శాతం వివాహాలు చేసుకుంటారు. అక్క కూతుళ్లు, మేనత్త కూతుళ్లు లేకపోతే ఇతర కుటుంబాల్లో వరసకు అయ్యే వారిని చేసుకుంటారు. బయటి సంబంధాలు మాత్రం చూసుకోరు. అక్క కూతుళ్లు, మేనత్త కూతుళ్లు లేదా గ్రామంలో వివాహాలు చేసుకోవడానికి ఎవరూ లేకపోతే.. తప్పనిసరి పరిస్థితిలో బయటి సంబంధాలు చేసుకుంటారు. లొట్లపల్లి గ్రామం కష్టసుఖాల్లో తోడుగా ఉంటారని.. గ్రామస్తుల్ని, అక్క లేదా మేనత్త కూతుళ్లని వివాహం చేసుకుంటే కుటుంబాలు బలపడతాయని, వ్యవసాయం లేదా ఇతరత్రా పనులు చేసుకోవడానికి వీలుంటుందని వారి నమ్మకం. గ్రామంలో అయితే ఒకరికొకరు కష్ట సుఖాల్లో తోడుగా ఉంటారని గ్రామస్తులు చెబుతున్నారు. ఆస్తులు కూడా బయటి వారికి పోకుండా అవే కుటుంబాల మధ్య ఉంటాయని.. పిల్లలు బయట కాకుండా కళ్ల ముందుంటారని.. రాజకీయంగా కూడా కుటుంబాలు కలిసి వస్తాయని వారి ఉద్దేశం. గ్రామంలో దగ్గర సంబంధాలు చేసుకున్న వారికి పుట్టిన పిల్లలు కూడా ఎంతో ఆరోగ్యవంతంగా ఉండటం విశేషం. మేనమామ కూతుర్ని పెళ్లాడా మాగ్రామంలోనే ఉన్న మేనమామ కుమార్తెను వివాహం చేసుకున్నాను. నాకు ఇద్దరు పాపలు ఉన్నారు. ఇద్దరూ చదువుకుంటున్నారు. మా పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నాను. చాలా ఆనందంగా ఉన్నాం. మా పిల్లలను కూడా గ్రామంలో దగ్గర వారికి ఇమ్మని ఇప్పటి నుంచే అడుగుతున్నారు. – శిడగ శ్రీను, మాజీ ఉప సర్పంచ్, లొట్లపల్లి గ్రామం అత్త కూతురితో వివాహం మా అత్త కూతుర్ని పెళ్లి చేసుకున్నాను. మాకు ఇద్దరు సంతానం. ఇద్దరు ఆరోగ్యంతో ఉన్నారు. వారిద్దరినీ చదివిస్తున్నాను. కష్ట సుఖాల్లో మా అత్తవారు అండగా ఉంటారు. – పిల్లల ఎర్నాయుడు, లొట్లపల్లి గ్రామం ఇక్కడే పెళ్లి నా కొడుకు, కూతురికి కూడా గ్రామస్తులతోనే పెళ్లిళ్లు చేశారు. మా మేనత్త కూతురినే చేసుకున్నాను. గ్రామంలో వారిని చేసుకుంటే మా కుటుంబాలు అన్ని కలిసి మెలిసి ఉంటాయి. – బమ్మిడి గురువులు, లొట్లపల్లి బలమైన కుటుంబాలు గ్రామంలోని వారినే చేసుకుంటే కుటుంబాలు బలంగా ఉంటాయి. కష్ట సుఖాల్లో ఒకరి కొకరం తోడుగా ఉంటాం. నేను కూడా మా గ్రామానికి చెందిన అమ్మాయినే వివాహం చేసుకున్నాను. – జన్నేల గంగునాయుడు, లొట్లపల్లి పూర్వం నుండి అదే పద్ధతి తప్పనిసరి పరిస్థితిలో తప్ప బయట సంబంధాలు చేసుకోం. నేను కూడా మేనమామ కూతుర్ని చేసుకున్నాను. ఆస్తుల విషయంలో లేదా వ్యవసాయ పనులకు గ్రామంలో అయితే ఒకరి కొకరు సహాయం చేసుకుంటాం. – జన్నేల ముత్యాలు, లొట్లపల్లి గ్రామం. -
273వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్
సాక్షి, ఎస్.కోట: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 273వ రోజు షెడ్యూల్ ఖరారైంది. శనివారం ఉదయం వైఎస్ జగన్ ఎస్. కోట నియోజకవర్గంలోని జామి మండలంలో నైట్ క్యాంప్ శిబిరం నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి జిడ్డేటి వలస క్రాస్ రోడ్డు, గోడికొమ్ము, అలమంద క్రాస్ రోడ్డు, అలమంద సంత, లోట్లపల్లి క్రాస్ రోడ్డు వరకు పాదయాత్ర కొనసాగుతుంది. అక్కడ వైఎస్ జగన్ మధ్యాహ్నా భోజన విరామం తీసుకుంటారు. తిరిగి మధ్యాహ్నం 2.45 గంటలకు పాదయాత్ర ప్రారంభమౌతుంది. అక్కడి నుంచి యాతపాలెం, కొత్త భీమసింగి, పాత భీమసింగి మీదుగా పాదయాత్ర కొనసాగనుంది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ తలశిల రఘురాం ప్రకటనలో తెలిపారు. -
బైక్ ప్రమాదం.. ముగ్గురు మైనర్లు మృతి
-
బైక్ ప్రమాదం.. ముగ్గురు మైనర్లు మృతి
జామి: విజయనగరం జిల్లాలో జామి మండలంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగం ముగ్గురు మైనర్ బాలుర ప్రాణాలను బలిగొంది. విజనిగిరి వద్ద చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఇంటర్ విద్యార్థి నాగమజ్జి(16), టెన్త్ విద్యార్థి కోటి(14), ఆరో తరగతి చదువుతున్న లక్ష్మణ్ ప్రాణాలు కోల్పోయారు. కొట్టాంకు చెందిన వీరు జామి వెళ్లి ఒకే బైక్పై తిరిగి వస్తుండగా అదుపుతప్పి చెట్టును ఢీకొని గోతిలో పడిపోయింది. అతివేగంగా బైక్ నడపడమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు వెల్లడించారు. ముగ్గురు విద్యార్థుల మృతితో స్థానికంగా తీవ్ర విషాదం చోటు చేసుకుంది.