
జామి: సెల్ ఫోన్‌లో ఆటలాడొద్దని తండ్రి మందలించాడని కుమారుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సోమవారం జామిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. జామి మంగలవీధికి చెందిన లగుడు సింహాచలంనాయుడు(14) విద్యార్థి స్థానిక జెడ్పీ ఉన్నతపాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. సెల్‌ఫోన్లో ఆటలాడొద్దని తండ్రి కృష్ణ మందలించి పొలం పనులకు వెళ్లాడు. దీంతో సింహాచలంనాయుడు ఇంటివద్ద ఉన్న పురుగుల మందు తాగాడు. నోటిలో నుంచి నురగలు రావడంతో తల్లి కేకలు వేసి భర్తకు సమాచారం అందించింది. విద్యారి్థని స్థానిక పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అక్కడ ప్రథమ చికిత్స అందించిన అనంతరం విజయనగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ మృతిచెందాడు. ఘటనపై జామి ఏఎస్సై గోపి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment