
తూర్పు గోదావరి జిల్లా- 366 పంచాయతీలకు 28 ఏకగ్రీవం
సాక్షి, అమరావతి: పంచాయితీ ఎన్నికల తొలి విడత నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగిసింది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పలు నియోజవర్గాల్లో ఏకగ్రీవాలు ఊపందుకున్నాయి. కాగా ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు దశల్లో 659 మండలాల్లో పంచాయతీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. మొదటి దశలో 173, రెండో దశలో 169, మూడో దశలో 171, నాలుగో దశలో 146 మండలాల్లో ఎన్నికలు జరుగనున్నాయి.(చదవండి: చిత్తూరు జిల్లా: ఏకగ్రీవ సర్పంచ్‌లు వీరే! )
ఇక తొలి విడతలో భాగంగా ఇప్పటి వరకు జిల్లాల వారీగా ఏకగ్రీవాలైన గ్రామ పంచాయతీల వివరాలు ఇలా ఉన్నాయి.
►చిత్తూరు జిల్లా- 454 పంచాయతీలకు 96 ఏకగ్రీవం
►గుంటూరు జిల్లా- 337 పంచాయతీలకు 67 ఏకగ్రీవం
►కర్నూలు జిల్లా- 193 పంచాయతీలకు 54 ఏకగ్రీవం
►వైఎస్‌ఆర్ జిల్లా- 206 పంచాయతీలకు 46 ఏకగ్రీవం
►పశ్చిమ గోదావరి జిల్లా- 239 పంచాయతీలకు 40 ఏకగ్రీవం
►శ్రీకాకుళం జిల్లా- 321 పంచాయతీలకు 34 ఏకగ్రీవం
►విశాఖ జిల్లా- 340 పంచాయతీలకు 32 ఏకగ్రీవం
►తూర్పు గోదావరి జిల్లా- 366 పంచాయతీలకు 28 ఏకగ్రీవం
►కృష్ణా జిల్లా- 234 పంచాయతీలకు 20 ఏకగ్రీవం
►ప్రకాశం జిల్లా- 229 పంచాయతీలకు 16 ఏకగ్రీవం
►నెల్లూరు జిల్లా- 163 పంచాయతీలకు 14 ఏకగ్రీవం
►అనంతపురం జిల్లా- 169 పంచాయతీలకు 6 ఏకగ్రీవం