Tadipatri JC Brothers: YSRCP Supporter Wins In Devanuppalapadu Panchayat - Sakshi
Sakshi News home page

తాడిపత్రిలో వైఎస్సార్‌సీపీ హవా.. జేసీ బ్రదర్స్‌కు ఎదురుదెబ్బ

Published Sat, Aug 19 2023 5:56 PM | Last Updated on Sat, Aug 19 2023 6:30 PM

Tadipatri JC Brothers: Ysrcp Supporter Wins In Devanuppalapadu - Sakshi

సాక్షి, అనంతపురం జిల్లా: తాడిపత్రిలో జేసీ బ్రదర్స్‌కు ఎదురుదెబ్బ తగిలింది. జేసీ సొంత మండలం పెద్దపప్పూరులో టీడీపీ ఓటమి చెందింది. దేవునుప్పలపాడు పంచాయతీలో వైఎస్సార్ సీపీ మద్దతుదారు కాటమయ్య గెలుపొందారు.తాడిపత్రి నియోజకవర్గంలో ఐదు వార్డుల్లో వైఎస్సార్ సీపీ మద్దతుదారుల ఘన విజయం సాధించారు.

రాష్ట్రంలో పలు జిల్లాల్లో జరిగిన పంచాయితీ ఉప ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ఒక్కొక్కటిగా ఫలితాలు వెలువడుతున్నాయి. మెజార్టీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు.. బలపర్చిన అభ్యర్థులే జయకేతనం ఎగరేస్తున్నారు. మొత్తం 35 సర్పంచ్‌, 245 వార్డు మెంబర్ల స్థానాలకు  ఉప ఎన్నికలు జరిగాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement