jc brother
-
తాడిపత్రిలో వైఎస్సార్సీపీ హవా.. జేసీ బ్రదర్స్‌కు ఎదురుదెబ్బ
సాక్షి, అనంతపురం జిల్లా: తాడిపత్రిలో జేసీ బ్రదర్స్‌కు ఎదురుదెబ్బ తగిలింది. జేసీ సొంత మండలం పెద్దపప్పూరులో టీడీపీ ఓటమి చెందింది. దేవునుప్పలపాడు పంచాయతీలో వైఎస్సార్ సీపీ మద్దతుదారు కాటమయ్య గెలుపొందారు.తాడిపత్రి నియోజకవర్గంలో ఐదు వార్డుల్లో వైఎస్సార్ సీపీ మద్దతుదారుల ఘన విజయం సాధించారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో జరిగిన పంచాయితీ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఒక్కొక్కటిగా ఫలితాలు వెలువడుతున్నాయి. మెజార్టీ స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు.. బలపర్చిన అభ్యర్థులే జయకేతనం ఎగరేస్తున్నారు. మొత్తం 35 సర్పంచ్, 245 వార్డు మెంబర్ల స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. -
కారుపై ‘జేసీ బద్రర్స్’ స్టిక్కర్ మాయం
అనంతపురం సెంట్రల్ : విశ్రాంత ఉపాధ్యాయురాలు భాగ్యలక్ష్మి కిడ్నాప్ కేసులో జేసీ బ్రదర్స్(ఎంపీ ధివాకర్రెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి) అనుచరులను ఆదివారం ఆరెస్ట్ చేశారు. అయితే ఎక్కడా జేసీ బ్రదర్స్ పేరు వినిపించకుండా పోలీసులు జాగ్రత్తలు పడ్డారు. విశ్రాంత ఉపాధ్యాయురాలు భాగ్యలక్ష్మి కిడ్నాప్‌కు ఉపయోగించిన ‘జేసీ బ్రదర్స్’ స్టిక్కర్ ఉన్న బొలెరో వాహనం ఫొటో శనివారం ‘సాక్షి’లో ప్రచురితమైంది. అయితే సదరు బొలెరో వాహనాన్ని నిందితులతో సహా హాజరుపర్చినా దానిపై ఉన్న జేసీ బ్రదర్స్ స్టిక్కర్ మాయమైంది. పోలీసులే సదరు స్టిక్కర్‌ను తొలగించినట్లు తెలుస్తోంది. కిడ్నాప్‌కేసులో ప్రధాన నిందితుడు రమేష్‌రెడ్డి జేసీ బ్రదర్స్ అనుచరుడు. ఈయనది తాడిపత్రి నియోజకవర్గంలోని పెద్దవడుగూరు మండలం, తెలికి స్వగ్రామం. దీంతో జేసీ బ్రదర్స్‌కు ఎక్కడ చెడ్డపేరు వస్తుందోనని బొలెరో వాహనంపై జేసీ స్టిక్కర్ పేరును తొలగించి విలేకరుల ఎదుట చూపించారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.