ఆది Vs జేసీ.. ముదిరిన వివాదం.. ఎస్పీకి ప్రభాకర్‌రెడ్డి ఘాటు లేఖ | Jc Prabhakar Reddy Letter To Kadapa Sp | Sakshi

ఆది Vs జేసీ.. ముదిరిన వివాదం.. ఎస్పీకి ప్రభాకర్‌రెడ్డి ఘాటు లేఖ

Nov 26 2024 6:03 PM | Updated on Nov 26 2024 6:39 PM

Jc Prabhakar Reddy Letter To Kadapa Sp

ఆదినారాయణరెడ్డి, జేసీ ప్రభాకర్‌రెడ్డిల మధ్య వివాదం ముదిరింది. ఈ క్రమంలో కడప ఎస్పీకి జేసీ ప్రభాకర్‌రెడ్డి ఘాటు లేఖ రాశారు.

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: ఆదినారాయణరెడ్డి, జేసీ ప్రభాకర్‌రెడ్డిల మధ్య వివాదం ముదిరింది. ఈ క్రమంలో కడప ఎస్పీకి జేసీ ప్రభాకర్‌రెడ్డి ఘాటు లేఖ రాశారు. ‘‘ఆర్టీపీపీలో ఫ్లైయాష్‌ తీసుకెళ్లేందుకు మా వాహనాలను ఆదినారాయణరెడ్డి అన్న కుమారుడు భూపేష్‌రెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు. అయినా మేం సంయమనం పాటించాం..వాళ్లు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. అందుకే వైఎస్సార్‌ జిల్లా నుంచి వచ్చే సిమెంట్, ఇసుక వాహనాలను మేమూ అడ్డుకున్నాం.’’ అంటూ లేఖలో పేర్కొన్నారు.

‘‘మీరు కోరిన మీదట వాటిని నడవడానికి అనుమతించాం. మా వాహనాలను అడ్డుకోకూడదని మేం కోరాం.. అయినా పరిస్థితి మారలేదు. రేపు మేం ఆర్టీపీపీకి వాహనాలను పంపుతున్నాం.. వాళ్లు ఆపితే మేం అంత ఈజీగా తీసుకోం. ఇటీవల వారు అదానీ సంస్థపై కూడా ఎటాక్‌ చేశారు. మేం అలాంటి వాళ్లం కాదు.  రేపు మా వాహనాలను అడ్డుకుంటే మాత్రం వారి వేధింపులను సహించేది లేదు. తప్పకుండా సరైన సమాధానం చెప్తాం’’ అంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డి హెచ్చరించారు.

ఇదీ చదవండి: కొత్త దుష్ట సంస్కృతికి తెరలేపిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి!

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement