
సాక్షి, అనంతపురం: పంచాయతీ ఎన్నికల్లో ఎమ్మెల్యే బాలకృష్ణకు ఘోర పరాభవం ఎదురైంది. హిందూపురం నియోజకవర్గంలో ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. హిందూపురంలోని 38 స్థానాల్లో 30 చోట్ల వైఎస్సార్ సీపీ మద్దతుదారుల విజయం సాధించారు. పెనుకొండ మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారధికి షాక్ తగిలింది. ఆయన సొంత పంచాయతీ రొద్దంలో టీడీపీ ఓటమి పాలైంది. బీకే పార్థసారధి సొంత వార్డు మరువపల్లిలోనూ టీడీపీకి పరాభవం ఎదురైంది.
పెనుకొండలోని 80 స్థానాల్లో 71 చోట్ల వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు విజయకేతనం ఎగరవేశారు. హిందూపురం మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్పకు చేదు అనుభవం ఎదురైంది. నిమ్మల కిష్టప్ప సొంత పంచాయతీ వెంకటరమణపల్లిలో టీడీపీ ఓటమి చెందింది. మడకశిర మాజీ ఎమ్మెల్యే ఈరన్నకు పరాభవం ఎదురైంది. సొంత పంచాయతీ మద్దనకుంటలో టీడీపీ ఓటమి పాలైంది.
చదవండి: పులివెందుల ‘పంచ్’ అదిరింది
మాజీ మంత్రి ‘బండారు’కు ఘోర పరాభవం
Comments
Please login to add a commentAdd a comment