
పదవుల కోసం ఎలాంటి అడ్డదారులు తొక్కడానికైనా ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. పంచాయతీలు పార్టీలకు అతీతంగా ఉండి అభివృద్ధి చెందాలనీ, ఊరంతా ఒక్కమాట మీద, ఒక్క తాటిమీద నడిచేలా అక్కడి వాతావరణం ఉండాలన్న పాలకుల సంకల్పానికి విరుద్ధంగా టీడీపీ–జనసేన నాయకులు వ్యవహరిస్తున్నారు. తెరవెనుక మంతనాలు చేస్తూ.. పావులు కదుపుతూ పచ్చని పల్లెసీమల్లో మనుషుల మధ్య పొగ రాజేస్తున్నారు.
సాక్షి, విజయవాడ: ఎన్నికల నేపథ్యంలో గ్రామాలలో రాజకీయం వేడెక్కుతోంది. తొలివిడత ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు చివరకు రావడంతో ఆఖరు ప్రయత్నాలుగా బుజ్జగింపులు కొనసాగుతున్నాయి. రాజకీయ పార్టీలకు అతీతంగా జరగాల్సిన ఎన్నికల్లోనూ తెలుగుదేశం, జనసేన పార్టీల నాయకులు తెరవెనుక సర్దుబాట్లకు ఆరాటపడుతున్నారు. వద్దంటున్నా నామినేషన్ దాఖలు చేయించడంతో పోటీలో తాము కొనసాగలేమని పలువురు మొత్తుకుంటున్నా, తప్పనిసరిగా బరిలో ఉండేలా చూడాలని ఆయా పారీ్టల అధిష్టానాలు సూచిస్తున్నాయి. చివరి వరకు పోటీలో కొనసాగించేదెలాగో తెలియక ద్వితీయ శ్రేణి నాయకులు తలలు పట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో లోపాయికారీ పొత్తులకు ఇరు పార్టీలు తెర వెనుక మంతనాలు చేస్తున్నాయి. (చదవండి: ‘దొంగ’దెబ్బ.. ఇది టీడీపీ పనేనా?)
సామాజిక వర్గాల వారీగా మద్దతు..
సామాజిక వర్గాల వారీగా మద్దతు పొందే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా కంకిపాడులో వార్డు అభ్యర్ధులకు మద్దతు విషయంలో టీడీపీ, జనసేనల మధ్య అంతర్గత ఒప్పందం జరుగుతోందని సమాచారం. ఇబ్రహీంపట్నం మండలం చిలుకూరులో టీడీపీ, కాంగ్రెస్, జనసేనలు కలిసి ఒక అభ్యర్థిని నిలబెట్టారు. తుమ్మలపాలెంలోనూ టీడీపీ. జనసేనలు కలిసి పోటీకి ఎన్నికల బరిలో దింపారు. జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల్లోనూ టీడీపీకి మద్దతుగా పనిచేయడానికి జనసేన నాయకులు ప్రయత్నిస్తున్నారని సమాచారం.(చదవండి: సర్పంచ్ బరిలో బామ్మ!)
బలమైన వార్డులలో సహకారం!
గత ఎన్నికల్లో ఓటమి అనంతరం జిల్లా టీడీపీ నాయ కులు సొంత వ్యాపారాలకు పరిమితమయ్యారు. రాష్ట్ర స్థాయి కార్యక్రమాలు, చంద్రబాబు పర్యటనల సందర్భంగా మొక్కుబడిగా హాజరవుతున్నారు. అయితే పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ మ్యానిఫెస్టో విడుదల చేయడంతో పాటు అన్ని పంచాయతీల్లోనూ అభ్యర్ధులను నిలపాలని అదిష్టానం ఆదేశించడంతో స్థానిక నాయకులు మల్లుగుల్లాలు పడుతున్నారు. పలు చోట్ల అభ్యర్ధులు దొరకని పంచాయతీల్లో జనసేన పార్టీ సానుభూతిపరులను బలపరుస్తూ వారితో నామినేషన్ లు వేయించారని, తరువాత దశ ఎన్నికల్లోనూ ఇదే పంథాను కొనసాగించడానికి అవగాహనతో ఆ రెండు పార్టీల నాయకులు వ్యవహరిస్తున్నారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment