నాలుగో దశ: పెనుగొలనులో టీడీపీకి ఎదురుదెబ్బ | Penugolanu Village TDP President Kota Haribabu Resigned | Sakshi
Sakshi News home page

ఎన్నికలను బహిష్కరించిన టీడీపీ బలపరిచిన అభ్యర్థి

Published Sun, Feb 21 2021 8:46 AM | Last Updated on Sun, Feb 21 2021 1:12 PM

Penugolanu Village TDP President Kota Haribabu Resigned - Sakshi

సాక్షి, కృష్ణా జిల్లా: నాలుగో దశ (తుది విడత) పంచాయతీ ఎన్నికల్లో గంపలగూడెం మండలంలోని పెనుగొలను గ్రామంలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ అధిష్టానం తీరుపై ఆ పార్టీ మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఆర్థిక సాయం చేస్తామని పార్టీ నాయకులు తమను పట్టించుకోలేదని మండిపడ్డారు. టీడీపీ వైఖరిని నిరసిస్తూ పార్టీ గ్రామ అధ్యక్షుడు కోటా హరిబాబు రాజీనామా చేశారు. ఈ నేపథ‍్యంలో టీడీపీ బలపరిచిన అభ్యర్థి జ్యోతి ఎన్నికలను బహిష్కరించారు.

కాగా, పంచాయతీ ఎన్నికల్లో ప్రజాతీర్పు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా రావడంతో ఓటమిని జీర్ణించుకోలేక టీడీపీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారు. ఆ పార్టీ కార్యకర్తలపై దాడులకు దిగుతున్నారు. ఇప్పటివరకు జరిగిన మూడు దశల పంచాయతీ ఎన్నికల్లోనూ వైఎస్సార్‌సీపీ అభిమానులు పెద్ద ఎత్తున విజయం సాధించారు. టీడీపీ ముఖ్య నేతల నియోజకవర్గాల్లో సహా అన్నింటా ఆ పార్టీ కుదేలైంది. బీజేపీ, జనసేన పార్టీలు బలపరిచిన అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి.
చదవండి: జెడ్పీ అధికారులపై టీడీపీ నేతల దౌర్జన్యం 
టీడీపీకి పరాభవం: నాటి పాపాలే.. నేటి శాపాలు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement