
కొత్త జాబితాలో ఓటరు పేర్లపై డిలేషన్ అని రాసి ఉన్న దృశ్యం
పాలకొండ: ఎన్నికల్లో ఓటమి భయంతో టీడీపీ నాయకులు కుఠిల రాజకీయాలు చేస్తున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీకి కనీస మద్దతుదారులు లేక అవస్థలు పడుతున్న టీడీపీ నాయకులు.. ఓట్లు తొలగింపును మాత్రం పక్కా ప్రణాళికతో చేపట్టారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాలకొండ మండలం లుంబూరు గ్రామంలో ఓటర్ల జాబితాను ఇష్టారాజ్యంగా మార్చిన సంఘటన గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకులు గుర్తించారు.
ఏకంగా 29 మంది వైఎస్సార్ సీపీ మద్దతుదారుల ఓట్లను తొలగించారు. ఓటర్లకు తెలియకుండా ఫారం–7లు అందించి ఓట్లు తొలగించే ప్రయత్నం చేశారు. వీరంతా 2019 ఎన్నికల్లో ఓట్లు వేసిన వారే కావడంతో బాధితులంతా ఎంపీడీవో జె.ఆనందరావు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన డీఎల్‌పీవో కార్యాలయం నుంచి వచ్చిన జాబితానే అందించామని, ఫారం– 7 ఆధారంగానే డిలేషన్ జరిగిందని వివరించారు. అయితే ఆ ఫారం ఓటర్లు కాకుండా ఎవరు ఇచ్చారన్నది విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment