ఇరువర్గాల వారిని తరుముతున్న పోలీసులు
ముప్పాళ్ల(సత్తెనపల్లి): ఎన్నికల ప్రచారం ముగియడంతో గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం దమ్మాలపాడు గ్రామంలో శనివారం వైఎస్సార్‌సీపీ అభిమానులు ఏడో వార్డు మీదుగా నడిచి వెళుతున్నారు. అక్కడే ఉన్న జనసేన పార్టీ శ్రేణులు వచ్చి వాదనకు దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇదే సమయంలో జనసేన శ్రేణులు రాళ్లతో దాడికి దిగారు. దీంతో ఇరు వర్గాల వారు ఒకరిపై ఒకరు రాళ్లతో దాడులు చేసుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు వచ్చి ఇరువర్గాల వారిని తరిమివేశారు.
దాడిలో వైఎస్సార్‌సీపీకి చెందిన శ్యామల చిననాగిరెడ్డి, బద్దిగం శ్రీనివాసరెడ్డి, గంజి శ్రీను, తమ్మినేని పిచ్చిరెడ్డి, వెన్నా శివారెడ్డి, చల్లా వీరారెడ్డి, మంచికంటి మోహన్‌రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. జనసేనకు చెందిన సూరంశెట్టి సతీష్, నల్లపునేని వెంకటేశ్వర్లు, యర్రంశెట్టి శివ, కోడె భుజంగనాయుడు, శిరిగిరి రాజు, కుమ్మరి శ్రీను, సువారపు గోవిందరావుకు గాయాలయ్యాయి. రూరల్ సీఐ బి.నరసింహారావు గ్రామంలో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. పరస్పరం ఫిర్యాదులు చేíసుకున్నట్లు ఎస్‌ఐ ఎం.నజీర్‌బేగ్ తెలిపారు.
బరితెగిస్తున్న టీడీపీ నేతలు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో ఓటమిని తట్టుకోలేక టీడీపీ నేతలు హద్దు మీరుతున్నారు. ఎచ్చెర్ల మండలంలోని కుప్పిలి పంచాయతీ నుంచి టీడీపీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అలుపున భారతి భర్త అలుపన నాగిరెడ్డి కుప్పిలి గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త మింది రామప్పడును ఫోన్‌లో తీవ్ర పదజాలంతో దూషించడమే కాకుండా చంపేస్తానంటూ బెదిరించారు. అలాగే పోలాకి మండలం బెలమర పంచాయతీ పరిధిలో టీడీపీకి చెందిన చింతు గోవిందరావు ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తుంటే ఫొటోలు తీశాడని ‘సాక్షి’ విలేకరి షణ్ముఖరావుపై టీడీపీ నాయకులు దాడి చేశారు. మొబైల్ లాక్కోవడమే కాకుండా బుడ్డా రాంబాబు అనే వ్యక్తి ఏకంగా చంపేస్తానంటూ బెదిరించారు.
చదవండి: ప్రలోభాలతో ఓటర్లకు టీడీపీ ఎర
నాలుగో దశ: పెనుగొలనులో టీడీపీకి ఎదురుదెబ్బ
Comments
Please login to add a commentAdd a comment