వి.కోట(చిత్తూరు జిల్లా): పార్టీలకు రహితంగా జరగాల్సిన పంచాయతీ ఎన్నికలను టీడీపీ నాయకులు అపహాస్యం చేస్తున్నారు. పార్టీ రంగులతో కూడిన కండువాలు ధరించి, పార్టీ పతాకాలను చేతబట్టి ఓటర్లను ప్రలోభపెట్టేలా వ్యవహరించడంపై ప్రజలు మండిపడుతున్నారు. మండలంలో వి.కోట మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా లావణ్య పేరు ఖరారైంది. దీంతో గురువారం మాజీ మంత్రి అమరనాథరెడ్డి, టీడీపీ మండల నేతలు టీడీపీ రంగుతో కూడిన కండువాలు ధరించి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గతంలో బాధ్యతాయుత పదవి చేపట్టిన ఓ మాజీ మంత్రి ఇలా రాజ్యాంగ విలువలకు తిలోదకాలివ్వడాన్ని చూసి ప్రజలు విస్తుబోతున్నారు.(చదవండి: డబ్బులిస్తాం.. మా వెంట రండహో!)
Comments
Please login to add a commentAdd a comment