
విజయభాస్కరరాజు-పద్మరేఖ-రాజ్యలక్ష్మి
మునగపాక/బుచ్చెయ్యపేట/కశింకోట (విశాఖ జిల్లా) : ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేస్తూ వారి మనసులు గెలుచుకున్న గ్రామ వలంటీర్లు చివరికి ఆ గ్రామాల పాలనా పగ్గాలే చేపట్టారు. వారు చేస్తున్న కృషికి మెచ్చిన ఆయా గ్రామాల ప్రజలు వారిని ఏకంగా సర్పంచ్ పీఠంపై కూర్చోబెట్టారు. ఈ విధంగా విశాఖ జిల్లాలో ముగ్గురు వలంటీర్లు సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు. మునగపాక మండలం మెలిపాకలో అయినంపూడి విజయభాస్కరరాజు, బుచ్చెయ్యపేట మండలం మంగళాపురానికి చెందిన పద్మరేఖ, కశింకోట మండలం జమాదులపాలేనికి చెందిన కరక రాజ్యలక్ష్మిలు గ్రామస్తుల కోరిక మేరకు సర్పంచ్ స్థానానికి పోటీచేసి గెలుపొందారు. వలంటీర్లుగా ప్రజాభిమానం పొందడం వల్లే ఈ గెలుపు సాధ్యమైందని వారంటున్నారు.
(చదవండి: ఏపీ ప్రభుత్వం మరో విప్లవాత్మక నిర్ణయం)
274 పంచాయతీల్లో ఎన్నికల్లేవు!
Comments
Please login to add a commentAdd a comment