మాస్కో: పుతిన్ విమర్శకుడు, రష్యా ప్రతిపక్షనేత అలెక్సీ నావల్ని(47) శుక్రవారం దేశంలోని ఆర్కిటిక్ జైలులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు అనుమానాస్పద స్థితిలో మరణించిన,జైలు శిక్షలు పడిన, దేశ బహిష్కరణకు గురైన రష్యా ప్రతిపక్షనేతల ఉదంతాలు మళ్లీ చర్చనీయాంశమయ్యాయి.
పుతిన్ తీవ్ర విమర్శకుడిగా పేరొందిన మాజీ డిప్యూటీ సీఎం బొరిస్ నెమ్‌సోవ్ 2015లో మాస్కోలోని క్రెమ్లిన్ భవనం సమీపంలోని బ్రిడ్జిపై నడుస్తూ వెళుతుండగా దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. ఈ కేసులో ఐదుగురికి శిక్ష పడినప్పటికీ వీరి వెనుక ఉన్న మాస్టర్‌మైండ్ ఎవరన్నది ఇప్పటికీ తెలియలేదు. నెమ్‌సోవ్ మంచి వక్త. పుతిన్ విధానాలను తీవ్రంగా విమర్శించడమే కాక ఎప్పటికప్పుడు ఆందోళనలు నిర్వహించేవారు.
రష్యా ప్రతిపక్ష నేతల్లో ఒకరైనా వ్లాదిమిర్ కరాముర్జా(42)కు 2023 ఏప్రిల్‌లో సుదీర్ఘంగా 23 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఈ జైలు శిక్షను కేవలం రష్యా ఉక్రెయిన్, యుద్ధంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగాను దేశద్రోహం కేసులో విధించారు. ఉక్రెయిన్‌పై రష్యా చేసిన దాడి మీద విమర్శలు చేసినందుకుగాను మరో ప్రతిపక్ష నేత ఇల్యా యాషిన్‌కు 2022 డిసెంబర్‌లో ఎనిమిదిన్నర సంవత్సరాల జైలు శిక్ష పడింది. తాజాగా జైలులో మరణించిన నావల్ని అనుచరుడు లిలియా చన్యాషెవాకు 2023లో ఏడున్నరేళ్ల జైలు శిక్ష విధించారు.
పుతిన్‌ను విమర్శించి దేశ బహిష్కరణకు గురైన వారు కూడా చాలా మందే ఉన్నారు. ఆయిల్ రంగంలో వ్యాపార దిగ్గజం మిఖాలీ పదేళ్ల జైలు శిక్ష తర్వాత లండన్ వెళ్లిపోయారు. ఉక్రెయిన్‌తో యుద్ధం ప్రారంభమైన తర్వాత విమర్శలు గుప్పించిన వారందరూ ఇప్పుడు ప్రపంచంలోని పలు దేశాలకు వెళ్లి బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. పుతిన్‌కు వ్యతిరేకంగా వార్తలు రాసిన ఇండిపెండెంట్ మీడియా జర్నలిస్టులపై చాలా మంది మీద ఫారెన్ ఏజెంట్లుగా ముద్ర వేశారు.
ఇదీ చదవండి.. జైలులోనే మృతి చెందిన పుతిన్ ప్రత్యర్థి నావల్ని
Comments
Please login to add a commentAdd a comment