
ఢిల్లీ: ప్రస్తుతం భారత్ ఎదుర్కొంటున్న అతిపెద్ద ముప్పులలో డీప్‌ఫేక్‌లు ఒకటని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇవి సమాజంలో గందరగోళానికి కారణమవుతాయని అన్నారు. ఈ సమస్యపై ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రధాని కోరారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ మేరకు మాట్లాడారు. ఈ అంశంపై పౌరులు, మీడియా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.
‘‘డీప్‌ఫేక్ వీడియోలు మన వ్యవస్థకు పెనుముప్పుగా మారుతున్నాయి. ఇవి సమాజంలో గందరగోళానికి కారణమవుతున్నాయి. ఇటీవల నేను పాట పాడినట్లుగా ఓ వీడియో వైరల్ అయ్యింది. ఈ డీప్‌ఫేక్ వీడియోలపై మీడియా, సోషల్ మీడియా ప్రజలకు అవగాహన కల్పించాలి’’ అని ప్రధాని మోదీ అన్నారు.
ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలలో డీప్‌ఫేక్‌లు ప్రజాస్వామ్య సమగ్రతకు సవాళ్లను విసురుతున్నాయి. నకిలీ, నిజమైన క్లిప్‌ల మధ్య తేడాను గుర్తించడం కష్టతరం చేస్తుంది. రాజకీయ నాయకులను లక్ష్యంగా చేసుకుని చిత్రాలు, నకిలీ వీడియోలను సృష్టిస్తుంది.
ఇదీ చదవండి: