వర్చువల్‌గా శిక్షణలో పాల్గొన్న అరుణాచల ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అధికారులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో త్వరలో జరుగనున్న సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల నిర్వహణ (EVM Management System-EMS 2.0) వాటి వినియోగంలో నోడల్ అధికారులు ఎదుర్కొంటున్న సందేహాలను, సమస్యలను హైదరాబాద్ నుంచి ఆన్‌లైన్ ఈసీఐఎల్ అధికారుల బృందం సభ్యులు సీనియర్ డి.జి.ఎం. ఎ.పి.రాజు, ఇంజనీర్ సి జి ఆదిత్య నివృత్తి చేశారు.
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ఆధ్వర్యంలో మంగళవారం రాష్ట్ర సచివాలయంలో రెండో రౌండ్ శిక్షణ కార్యక్రమం జరిగింది. అదనపు ప్రధాన ఎన్నికల అధికారి ఎమ్.ఎన్. హరెంధిర ప్రసాద్ నేతృత్వంలో జరిగి ఈ శిక్షణా కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన ఈవీఎం నోడల్ అధికారులు, సాంకేతిక సహాయకులు ప్రత్యక్షంగాను ,అరుణాచల ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాలకు చెందిన అధికారులు ఆన్ లైన్ ద్వారా పాల్గొన్నారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 9న జరిగిన మొదటి రౌండ్ శిక్షణా కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల నిర్వహణ మరియు వాటి వినియోగంపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఈవీఎం నోడల్ అధికారులకు, సాంకేతిక సహాయకులకు ఈసీఐఎల్ అధికారుల బృందం సమగ్ర అవగాహన కల్పించడం జరిగింది. అయితే క్షేత్ర స్థాయిలో ఈవీఎంల వినియోగంలో అధికారులకు, సాంకేతిక సహాయకులకు ఎదురైన సమస్యలు, సందేహాలను నివృత్తి పర్చేందుకు నెల రోజుల తదుపరి రెండో రౌండ్ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈవీఎంల నిర్వహణలో సాదారణంగా ఎదురయ్యే సాంకేతిక సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోవాలో మరొసారి ఈ శిక్షణా కార్యక్రమంలో ఈసీఐఎల్ అధికారుల బృందం వివరించింది. అదే విధంగా జిల్లాల వారీగా ఈవీఎం నోడల్ అధికారులు, సాంకేతిక సహాయకులు అడిగిన పలు సందేహాలకు, సమస్యలకు ఈసీఐఎల్ అధికారుల బృందం సభ్యులు సీనియర్ డి.జి.ఎం. ఎ.పి.రాజు, ఇంజనీర్ సి జి ఆదిత్య సమగ్రమైన వివరణను ఇచ్చారు. అసిస్టెంట్ సీఈవో పి.తాతబ్బాయ్ తో పాటు అన్ని జిల్లాలకు చెందిన ఈవీఎం నోడల్ అధికారులు, సాంకేతిక సహాయకులు ఈ శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment