రట్టయిన ఈవీఎంల రహస్యం | evm machines secrets revealed | Sakshi
Sakshi News home page

రట్టయిన ఈవీఎంల రహస్యం

Published Tue, Apr 18 2017 1:24 AM | Last Updated on Tue, Aug 14 2018 4:34 PM

రట్టయిన ఈవీఎంల రహస్యం - Sakshi

రట్టయిన ఈవీఎంల రహస్యం

రెండో మాట
ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను మన పాలకులు, ఎన్నికల కమిషన్‌ లొట్టలు వేసుకుంటూ ఆహ్వానించడానికీ, సమర్థించడానికీ కారణం ఏమై ఉంటుంది? ఇది తెలుసుకోవడం ఆసక్తిదాయకం. ఎందుకంటే, ఇప్పుడున్న ఈవీఎంలలో నీవు కోరుకునే అభ్యర్థికి అనుకూలంగా ‘సర్దుబాటు’ చేయవచ్చునట. బహుశా అందుకేనేమో అమెరికా సహా, యూరోపియన్‌ దేశాలు కొన్ని కూడా పేపర్‌ బ్యాలెట్‌ ప్రయోగం జరపకుండా ఈవీఎం తరహా యంత్రాలను ఆమోదించడానికి ముందుకు రాలేదు. వాటిని నిషేధించాయి కూడా.

భారత ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్‌ను (ఈవీఎం) హ్యాక్‌ చేసేందుకు అమెరికా శాస్త్రవేత్తలు అక్కడి మిచిగాన్‌ విశ్వవిద్యాలయంలో ఒక ప్రత్యేక పరికరాన్ని సృష్టించారు. భారత ఈవీఎమ్స్‌ వ్యవస్థలోకి చొరబడి, పనితీరును కనిపెట్టి బయట పెట్టడమే ఆ టెక్నిక్‌. ఈ ప్రయోగంతో మొబైల్‌ ఫోన్‌ ద్వారా అవస రమైన సందేశాలు పంపించి ఓటింగ్‌ ఫలితాలను ఆ శాస్త్రవేత్తలు తారుమారు చేయగలిగారు’’  – (ఇంటర్నెట్‌ వార్త)

‘‘భారతీయ ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్లు ఎలాంటి లోపం లేని యంత్రాలు. కాబట్టి వేలు పెట్టి ఆ మెషీన్లలోని సమాచారాన్ని తారుమారు చేయడం కష్టమైన పని. అలా దోషరహితంగా తయారైన మెషీన్లు ఇవి.’’ – అలోక్‌ శుక్లా (భారత ఎన్నికల సంఘం డిప్యూటీ కమిషనర్‌)

ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌ అసెంబ్లీల ఎన్నికలలో వచ్చిన అనూహ్య ఫలితాలు, ఇటీవలి భింద్‌ (మధ్యప్రదేశ్‌) ఉప ఎన్నికల ఫలితాల సరళి దేశ వ్యాప్తంగా మున్నెన్నడూ లేనంతగా అనుమానాలనూ, ఆందోళననూ లేవనె త్తాయి. పదహారు రాజకీయ పక్షాలు కనీవినీ ఎరుగని రీతిలో విరుచుకు పడక తప్పలేదు కూడా. భింద్‌ నియోజక వర్గ ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడైన తరు వాత అతి రహస్యం బట్టబయలై ప్రస్తుత పాలక పక్షాల మీద, ఎన్నికల సంఘం మీద గగ్గోలు మొదలైంది. ఓటర్లు ఎవరికి ఓటు వేశారన్న విష యాన్ని, ఓటింగ్‌ పేపర్‌ను ఆడిట్‌ కోసం ప్రయోగించిన సందర్భంలో వెల్లడైన రహస్యం–ఒక్క బీజేపీ చిహ్నంతో ఉన్న స్లిప్‌లే ఈవీఎంలో దొరికాయి. ఇది ‘ఓటర్‌ పేపర్‌ ఆడిట్‌’ వల్లనే బయటపడింది.

అందుకే కాంగ్రెస్‌–యూపీఏ హయాం నుంచి, బీజేపీ–ఎన్డీఏ కూటమి పాలన దాకా ఇలాంటి ఓటింగ్‌ పద్ధ తులే అమలులో ఉన్నాయా అన్న అనుమానం సహజం. భింద్‌ ఫలితాల పుణ్యమా అని ఈవీఎంల గుట్టు బట్టబయలు కావడంతో రాజ్యాంగం పునా దిగా ఆవిర్భవించిన ఎన్నికల సంఘానికీ, పాలక పక్షానికీ నోరు పెగలడం లేదు. ‘నీ వీపు నేను గోకుతాను, నా వీపు నీవు గోకు’ అన్న చందంగా ఎన్ని కల సంఘం ఎడల పూర్తి విశ్వాసం ఉన్నదని బీజేపీ ప్రకటిస్తే; ప్రజల పట్ల పూర్తి నమ్మకం ఉందని ఈసీ ప్రకటించవలసి రావడం ఇందుకే. భింద్‌ బాగోతంపై వివరణ ఇవ్వడంలో ఎన్నికల సంఘం దారుణంగా విఫలమైంది.

ఓటింగ్‌ సరళినే మార్చివేసే ఈవీఎంలు
స్వతంత్ర భారత పాలనను వెలగబెట్టిన రాజకీయ పార్టీలు గానీ, ఎన్నికల వ్యవహారాలను నిర్వహించిన ఎన్నికల సంఘాలు కానీ ఇటీవలి కాలం దాకా ఆధారపడుతూ వచ్చినది బ్యాలెట్‌ పేపర్‌ విధానం మీదనే. బ్యాలెట్‌ మీద ఓటరు పేరు ఉంటుంది. కాబట్టి ఎవరి ఓటు ఎవరికి పడిందో తెలుసు కోవడం తేలిక. ఈవీఎంలలో స్క్రీన్‌ మీద వేలితో తాకడం తప్ప, ఓటరు పేరు నమోదు కాదు. అయితే బ్యాలెట్‌ బాక్సుల మాదిరిగానే, ఆ తరువాత అమలు లోకి వచ్చిన ఈవీఎంలను కూడా దొంగిలించి బద్దలు కొట్టడం మనకు తెలుసు. ఈ అవినీతి నిర్మూలనకు ఎన్నికల సంఘం కొన్ని పాక్షిక చర్యలు తీసుకోవడం గురించి కూడా మనకు ఎరుకే. కానీ ఈవీఎంలను ఎత్తుకుపోయి ఓట్లు గుద్దుకునే పరిస్థితి ఇప్పుడు కొత్తగా సోకిన జబ్బు. ఆ యంత్రాలలోనే ఏర్పాటైన లోపాయికారీ సాంకేతిక మెళకువ ద్వారా ఓటింగ్‌ సరళిని మార్చే అవకాశం ఏర్పడింది. ఆ అవకాశానికి నీరు పెట్టినారు పోసిన వారు మిచి గాన్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలని మరచిపోరాదు. దేశ పాలనా వ్యవస్థల లోని కొందరు పెద్దలకూ లేదా పార్టీల స్థాయిలోనూ ఎలాంటి సంబంధాలు లేకుండానే ఖండాంతరాలకు అవతల నుంచి భారత ఎన్నికల వ్యవస్థను ఎవ రైనా ప్రభావితం చేయగలరని మనం ఊహించగలమా?

మన ఈవీఎంలు లొసుగుల మయమేనా?
ఈవీఎంలలో ఉన్న తాజా లొసుగులు బయటపడిన తరువాత వీటిని రద్దు చేసి, బ్యాలెట్‌ పేపర్‌ వ్యవస్థను తిరిగి ప్రవేశ పెట్టాలనీ, ఆ యంత్రాలు తారు మారు చేయడానికి వీలులేనివని రుజువయ్యే వరకు బ్యాలెట్‌ పేపర్‌ ఆధారం గానే ఓటింగ్‌ నిర్వహించాలనీ దేశంలోని పదహారు రాజకీయ పక్షాలు ఎన్ని కల సంఘానికి వినతిపత్రం (11–4–17) సమర్పించాయి. అయితే ఈ ఆరో పణలను రుజువు చేయవలసిందిగా అంతకు ముందు ఎన్నికల సంఘం విప క్షాలకు సవాలు విసిరింది. నిజానికి ఈ సవాలులో నిజాయితీ ఉన్నట్టు కనిపించదు. ఎందుకంటే, ఆ సవాలు  చేయడానికి ముందు ఎన్నికల సంఘం (2–4–17) ఒక ప్రకటన చేస్తూ, ‘‘ఇప్పటికి సరే, 2019 ఎన్నికల నుంచి ప్రస్తుత ఈవీఎంలను తొలగించి, ఇకపైన అనధికారికంగా తలదూర్చి దిద్దు బాట్లు చేసే ప్రయత్నాలను సాగనివ్వని కొత్త ఈవీఎంలను తీసుకొద్దాం’’ అని  పేర్కొన్నది.

అంటే, ఇప్పటిదాకా పనిచేసిన ఈవీఎంలు పార్టీలకూ, అభ్యర్థులకూ అనుకూలంగా మార్పులూ చేర్పులూ చేసుకునేందుకు వీలుగా ఉన్నా యని (టాంపరబుల్‌) ఎన్నికల కమిషన్‌ అంగీకరించినట్టే కదా! దీనికితోడు పేపర్‌ బ్యాలెట్‌ ఆడిట్‌ ట్రయల్‌కు నిలుస్తుందా లేదా అని నిర్ధారించగల ఆడిట్‌ విచారణను కూడా చేపట్టాలని సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను కూడా బీజేపీ పాలకులు పెడచెవిన పెట్టారనీ, ఎన్నికల కమిషన్‌ ప్రధాన కార్యాలయానికి ఈ విషయమై పంపిన లేఖలను అక్కడా పట్టించుకోలేదనీ పత్రికలు వెల్లడించిన సంగతిని విస్మరించరాదు.  సమయంలోనే ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో బయటపడిన మరొక రహస్యాన్ని కూడా ఎన్ని కల సంఘం నియమించిన విచారణ సంఘం బయటపెట్టక తప్పలేదు. ‘ఉత్తరప్రదేశ్‌లో ఈవీఎంలను పరీక్షిస్తున్న సమయంలో వాటిలోకి ఫీడ్‌ చేసిన డేటాను భింద్‌ పోలింగ్‌ సమయంలో తొలగించకుండా అట్టిపెట్టడంతో ఓటింగ్‌ స్లిప్పులన్నీ వెళ్లి బీజేపీ చిహ్నానికి జతయ్యాయని’ సమర్థనగా చెప్పు కోవలసి వచ్చింది (ది హిందు, 8–4–17). ఇది సిగ్గుచేటు కాదా?


ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను మన పాలకులు, ఎన్నికల కమిషన్‌ లొట్టలు వేసుకుంటూ ఆహ్వానించడానికీ, సమర్థించడానికీ కారణం ఏమై ఉంటుంది? ఇది తెలుసుకోవడం ఆసక్తిదాయకం. ఎందుకంటే, ఇప్పుడున్న ఈవీఎంలలో నీవు కోరుకునే అభ్యర్థికి అనుకూలంగా ‘సర్దుబాటు’ చేయ వచ్చునట. బహుశా అందుకేనేమో అమెరికా సహా, యూరోపియన్‌ దేశాలు కొన్ని కూడా (నెదర్లాండ్స్, ఇంగ్లండ్, జర్మనీ మొదలైనవి) పేపర్‌ బ్యాలెట్‌ ప్రయోగం జరపకుండా ఈవీఎం తరహా యంత్రాలను ఆమోదించడానికి ముందుకు రాలేదు. వాటిని నిషేధించాయి కూడా. ఈవీఎంలు  ఫలితాలను తారుమారు చేయడానికి వెసులుబాటు కలిగినవేనని ఇటలీ చేసిన ప్రయో గాలలో కూడా రుజువైంది. డిజిటల్‌ సాంకేతిక సాయంతో ఎన్నికలలో ‘వచ్చె డివాడు ఫల్గుణుడు....’ అన్న రీతిలో అభ్యర్థులను మొబైళ్ల ద్వారా ఎలా ఊదర గొట్టవచ్చునో బీజేపీ కేంద్ర సమాచార సాంకేతిక వ్యవస్థ అధిపతిగా వ్యవహరించిన అరవింద్‌ గుప్తాయే నిరూపించారు. మాసిడోనియా, ఉక్రెయి న్‌లలో ఉపయోగిస్తున్న ఈవీఎంల వ్యవస్థను పరిశీలించి అవి  దుర్వినియోగా నికి ఎలా వీలు కలిగి ఉన్నాయో అమెరికా భద్రతా వ్యవహారాల నిపుణుడు స్టీగల్‌ నివేదిక ఇచ్చారు.

ఈవీఎంలను గుర్తించని ప్రపంచం
ప్రస్తుతం ఇండియాలో పది లక్షల నలభయ్‌ వేల ఓటింగ్‌ యంత్రాలను విని యోగిస్తున్నారు. మిచిగన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ఇంటర్నె ట్‌లో ఒక వీడియోను ప్రదర్శిస్తూ, ఇండియాలో ఉపయోగిస్తున్న ఒక ఓటింగ్‌ యంత్రాన్ని దేశవాళీ ఎలక్ట్రిక్‌ పరికరాన్ని ఎలా జోడించ వచ్చునో, అనుకున్న ఫలితాన్ని ఎలా పొందవచ్చునో చూపించారు. ఈవీఎంలపై పరిశోధన చేసిన ప్రొఫెసర్‌ జె. అలెగ్జాండర్మాన్‌ కూడా అలా అమర్చిన ఎలక్ట్రిక్‌ పరికరం మొబైల్‌ ఫోన్ల ద్వారా పంపే సందేశాల ద్వారా ఓటింగ్‌ మెషీన్‌ ఫలితాన్ని తారుమారు చేయగలదో నిరూపించాడు (బీబీసీ ప్రసారంలో). ఫలితాలను ప్రదర్శించే ఒక వాస్తవ డిస్‌ప్లే బోర్డు లాగా, ఒక అవాస్తవికమైన బోర్డులో అమర్చిన అంశాల కింద ఒక మైక్రో ప్రాసెసర్‌ను, బ్లూటూత్‌ రేడియోను ఆయన ప్రయోగం కోసం ఉంచారు. అప్పుడా ఇమిటేషన్‌ బోర్డు–ఈవీఎం మదింపు వేసిన ఓట్ల మొత్తాన్ని అడ్డుకుని వాటి స్థానే దొంగ ఓట్ల మొత్తాన్ని ఎలా నింపవచ్చో నిరూపించింది. అప్పుడు తప్పుడు ఇమిటేషన్‌ బోర్డు తప్పుడు ఎన్నికల ఫలితం తీసుకొచ్చిందని అలెగ్జాండర్మాన్‌ నిరూపించాడు.

అలాగే జర్మనీ ఫెడరల్‌ రాజ్యాంగ ధర్మాసనం న్యాయమూర్తులు కూడా ఈ విషయంలో యూరప్, అమెరికాలలో ఏ కోర్టూ చేయలేని ప్రయోగం చేసి ఈవీఎమ్స్‌ను నిరాకరించి, ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌నే నిషేధించారు (2009 మార్చి 3). జర్మన్‌ కోర్టు ఆ సందర్భంగా ఇలా ప్రకటించింది. ‘ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ నిరూపణకు నిలవదు. ఎందుకంటే, ఓట్లను రహస్యంగా లెక్కించడం జరుగు తుంది గనుక. అంతేగాదు, టెక్నాలజీ అందరికీ అందుబాటులో ఉండేది కాదు. ఓట్లు వినియోగించినప్పుడు ఓట్లు ఎలాంటి తప్పుడు పద్ధతిలోనూ రికార్డు కాలేదని నిరూపించగల అవకాశాన్ని పౌరులకు ఈవీఎమ్స్‌ కల్పిం చవు’ అని కూడా జర్మన్‌ కోర్టు స్పష్టం చేసింది. అమెరికాలో ఈవీఎమ్స్‌ సామ ర్థ్యాన్ని తేల్చడానికి పేపర్‌ బ్యాలెట్‌ ప్రయోగం ‘టచ్‌–స్క్రీన్‌’పై ఓటింగ్‌ పద్ధ తిలో సాగుతుంది. 2005లో జర్మన్‌ పార్లమెంట్‌ (బండ్‌స్టాగ్‌) ఎన్నికల్లో ఈవీ ఎమ్స్‌ ప్రయోగాన్ని నిరసిస్తూ శాస్త్రవేత్త అల్రిచ్‌ వీస్నర్, ప్రొఫెసర్‌ జోచిమ్‌ వీస్నర్‌ ఈవీఎమ్స్‌పై కోర్టులో కీలకమైన వ్యాజ్యం వేసి గెలిచారు.

అయినా, ఇతర దేశాల ఈవీఎమ్స్‌తో మన ఈవీఎమ్స్‌ను పోల్చరాదనీ, అక్కడి ఈవీఎం సిస్టమ్స్‌ కంప్యూటర్‌ ఆధారిత యంత్రాలనీ, ఇంటర్నెట్‌తో నియంత్రించే యంత్రాలనీ మన ఎన్నికల కమిషన్‌ చెబుతోంది. కనుకనే విదేశీ ఈవీఎమ్స్‌ కంప్యూటర్‌ ఆధారిత, ఇంటర్నెట్‌ నియంత్రిత మెషీన్లు గనుక వాటి సమాచా రాన్ని ‘హ్యాక్‌’ చేయడం తేలికన్నది మన ఎన్నికల కమిషన్‌ భావన. ఏది ఏమైనా, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ ఈవీఎంలను 2019 నాటికి మార్చేసి, వాటి స్థానే ఫలితాలను తారుమారు చేసే టెక్నిక్స్‌కు లొంగని యంత్రాంగం ఉండాలన్నది నిపుణుల అభిప్రాయం. ఎన్నికలలో ధన ప్రాబ ల్యాన్ని, అరాచకాలను ఎన్నికల కమిషన్‌ నిరోధించలేకపోయింది. తాజాగా అనేక రాజ్యాంగ సంస్థలను 2014 ఎన్నికల తరువాత పీడిస్తున్న పతన దశ ఎన్నికల సంఘాన్ని కూడా పట్టి పీడిస్తున్నట్టు కన్పిస్తోంది. కాల పరీక్షకు నిలి చిన ప్రణాళికా సంఘాన్ని చంపి ‘నీతి ఆయోగ్‌’ అనే కొత్త పిందె పుట్టుకొచ్చి నట్టే ఎన్నికల సంఘం అనుభవిస్తున్న ఆ నామమాత్రపు స్వాతంత్య్రం కూడా రేపు కొడిగట్టిపోతే ఆశ్చర్యపోనక్కర్లేదు!


--- ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు

abkprasad2006@yahoo.co.in

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement