
ఇబ్రహీంపట్నం (మైలవరం): సరైన బిల్లులు లేకుండా తరలిస్తున్న 2,400 డమ్మీ ఈవీఎంలను కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు తుమ్మలపాలెం చెక్‌పోస్ట్ వద్ద మంగళవారం తెల్లవారుజామున స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పి.రామాంజనేయులుకు చెందిన వ్యక్తులు వీటిని తరలిస్తుండగా తనిఖీల్లో పట్టుకున్నారు. విషయాన్ని మండల ఎన్నికల నియమావళి అధికారి, ఎంపీడీవో రామప్రసన్న దృష్టికి తీసుకెళ్లారు.
స్వాధీనం చేసుకున్న డమ్మీ ఈవీఎంలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఒక్కొక్క ఈవీఎం రూ.16కు కొనుగోలు చేసినట్లు సంబంధిత వ్యక్తులు బిల్లులు చూపించారు. అయితే ఒక ఈవీఎం ఖరీదు సుమారు రూ.100 వరకు ఉంటుందని గుర్తించిన అధికారులు 2,400 ఈవీఎంలకు రూ.2.40 లక్షలు ఖర్చును భీమవరం టీడీపీ అభ్యర్థి పి.రామాంజనేయులు ఖర్చులో జమచేసి ఎన్నికల కమిషన్‌కు నివేదిక పంపించారు.
Comments
Please login to add a commentAdd a comment